iDreamPost
android-app
ios-app

షాకింగ్ నిర్ణయం.. జైన సన్యాసినిగా మారనున్న 19 ఏళ్ల యువతి!

ఓ 19ఏళ్ల యువతీ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. నిరాడంబరమైన జీవితాన్ని గడిపేందుకు సన్యాసిగా మారాలని నిర్ణయించుకుంది. 19 ఏళ్ల యోగితా సురానా హైదరాబాద్‌లో సన్యాసిగా మారబోతుంది.

ఓ 19ఏళ్ల యువతీ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. నిరాడంబరమైన జీవితాన్ని గడిపేందుకు సన్యాసిగా మారాలని నిర్ణయించుకుంది. 19 ఏళ్ల యోగితా సురానా హైదరాబాద్‌లో సన్యాసిగా మారబోతుంది.

షాకింగ్ నిర్ణయం.. జైన సన్యాసినిగా మారనున్న 19 ఏళ్ల యువతి!

ఓ యువతీ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. 19 ఏళ్లకే సన్యాసినిగా మారాలనుకుంది. ప్రాపంచిక సుఖాలను విడిచి పెట్టి నిరాడంబరమైన జీవితాన్ని గడపాలని నిర్ణయించుకుంది. 19 ఏళ్ల యోగితా సురానా హైదరాబాద్‌లో సన్యాసిగా మారబోతుంది. ఈ యువతి చిత్తోర్‌కు చెందిన రాజస్థానీ జైన్ మార్వాడీ జ్యువెలర్ కుటుంబానికి చెందిన యువతి. జనవరి 13 నుంచి 16 వరకు నిర్వహించే జైన సమాజ్ దీక్షా మహోత్సవ్ కార్యక్రమంలో ఆమె సన్యాసిగా మారనున్నారు. తన తల్లిదండ్రులు, సోదరీమణులతో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యోగితా సురానా ప్రకటించారు. ఏ కోరికలు లేకుండా అహింసే మోక్ష మార్గమని నమ్మి సన్యాసినిగా మారాలని అనుకుంటున్నట్లు వెల్లడించింది.

సన్యాసి అంటే బ్రహ్మచర్యాన్ని లేదా సంసార సాగరాన్ని వీడి సత్యాన్వేషణకై దైవ మార్గాన్ని అవలంభించే వ్యక్తి. దీనికి లింగ భేదం లేదు. ఆడవారైనా, మగవారైనా సన్యాసం తీసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే యోగితా సురానా సన్యాసం తీసుకోనుంది. డిగ్రీ చదివి ఆపేసిన యోగిత సన్యాసిగా మారాలని షాకింగ్ నిర్ణయం తీసుకుంది. జైన సంప్రదాయంలో తమ బిడ్డ సన్యాసిని కావాలనే నిర్ణయాన్ని తల్లిదండ్రులిద్దరూ ఇష్టపూర్వకంగా అంగీకరించడం చాలా అవసరం. ఈ క్రమంలో యోగితా సన్యాసం తీసుకుంటానంటే వారు ఒప్పుకున్నారు. శ్రీవర్ధమాన్ స్థానక్వాసి జైన శ్రావక్ సంఘ్, గ్రేటర్ హైదరాబాద్, శ్రీజైన రత్న హితోషి శ్రావక్ సంఘ్, హైదరాబాద్, సికింద్రాబాద్ ఆధ్వర్యంలో జనవరి 13 నుంచి 16వ తేదీ వరకు సాధారణ మానవుడిని సన్యాసినిగా మార్చే ప్రక్రియను దీక్షా మహోత్సవ్ అంటారు. జనవరి 16 భగవతి దీక్షా మహోత్సవం ఉదయం బర్కత్‌పురాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగనున్నది.