P Venkatesh
అధిక స్పీడుతో వెళ్లి చలాన్ల భారిన పడుతున్నారా? అయితే మీలాంటి వారికి గుడ్ న్యూస్. గూగుల్ మ్యాప్స్ తో ఇకపై స్పీడ్ చలాన్లకు చెక్ పెట్టొచ్చు. ఇంతకీ ఎలా పనిచేస్తుందంటే?
అధిక స్పీడుతో వెళ్లి చలాన్ల భారిన పడుతున్నారా? అయితే మీలాంటి వారికి గుడ్ న్యూస్. గూగుల్ మ్యాప్స్ తో ఇకపై స్పీడ్ చలాన్లకు చెక్ పెట్టొచ్చు. ఇంతకీ ఎలా పనిచేస్తుందంటే?
P Venkatesh
రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ట్రాఫిక్ పోలీసులు నియమ నిబంధనలను అమలు చేస్తుంటారు. వాటిని ఉల్లంఘించిన వాహనదారులకు చలాన్లు విధిస్తుంటారు అధికారులు. పరిమితికి మించిన వేగం, హెల్మెట్ ధరించకపోవడం, రాంగ్ రూట్, రోడ్లపై స్టంట్స్ చేస్తూ వాహనదారులకు ఇబ్బందులు కలిగించడం, మరీ ముఖ్యంగా లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేయడం వంటి ఇతర కారణాలతో ట్రాఫిక్ అధికారులు చలాన్లు వేస్తారు. అయితే గూగుల్ మ్యాప్స్ వాహనదారులకు అదిరిపోయే వార్తను అందించింది. గూగుల్ మ్యాప్స్ తీసుకొచ్చిన సరికొత్త ఫీచర్ తో ఇకపై చలాన్లకు చెక్ పెట్టొచ్చు అని తెలిసింది. మరి గుగుల్ మ్యాప్స్ తీసుకొచ్చిన ఆ ఫీచర్ ఏంటి? అది ఎలా పని చేస్తుంది? ఆ వివరాలు మీకోసం..
ట్రాఫిక్ నియమాలు, రోడ్డు భద్రతపై అవగాహన లేక వాహనదారులు ప్రమాదాలకు కారణమవుతున్నారు. అధిక స్పీడుతో వెహికిల్స్ ను నడిపి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అంతే గాక ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించినందుకు ఫైన్ కూడా చెల్లించాల్సి ఉంటుంది. కాగా గూగుల్ మ్యాప్స్ ప్రవేశ పెట్టిన ఆ ఫీచర్ తో వేగాన్ని నియంత్రించుకుని చలాన్ల భారిన పడకుండా స్పీడ్ చలాన్లకు చెక్ పెట్టొచ్చు. అదే విధంగా ప్రమాదాలు కూడా తగ్గుతాయని గూగుల్ మ్యాప్స్ ఉద్దేశ్యం. గూగుల్ మ్యాప్స్ లో ఆ ఆప్షన్ ను ఎనెబుల్ చేసుకుని అధిక స్పీడ్ చలాన్ల భారి నుంచి బయటపడొచ్చు. డ్రైవ్ చేస్తున్నప్పుడు ఎంత వేగంతో వెళ్తున్నామో కూడా తెలియకుండా డ్రైవ్ చేసే వారికి గూగుల్ మ్యాప్స్‌లోని కొత్త ఫీచర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
ప్రయాణ సమయంలో వాహనదారుడు తన మొబైల్‌లోని గూగుల్ మ్యాప్స్ యాప్ ను ఓపెన్ చేయాలి. ఆ తర్వాత కుడివైపున ఉన్న ప్రొఫైల్ ఐకాన్‌ని ట్యాప్ చేసి సెట్టింగ్స్ ఆప్షన్ ను ఎంచుకోవాలి. తరువాత స్క్రీన్ కిందికి స్క్రోల్ చేస్తే.. అక్కడ నావిగేషన్ సెట్టింగ్స్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేసి డ్రైవింగ్ సెక్షన్ ఆప్షన్‌లో స్పీడోమీటర్ ఆప్షన్ ను ఎనేబుల్ చేసుకోవాలి. ఇక ఆ తర్వాత వాహనం ఎంత స్పీడుతో వెళ్తోందన్న విషయాన్ని ఎప్పటికప్పుడు పొందవచ్చు. పరిమితికి మించిన వేగంతో వెళ్తున్నట్లైతే వెంటనే హెచ్చరిస్తుంది. దీంతో వెంటనే వేగాన్ని నియంత్రించుకోవచ్చు. ట్రాఫిక్ చలాన్ల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. కాగా ఈ ఫీచర్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ మొబైల్స్‌లో మాత్రమే అందుబాటులో ఉంది.