iDreamPost
android-app
ios-app

Google Mapsలో అదిరిపోయే AI ఫీచర్స్.. ఇక అవి తెలుసుకోవడం చాలా ఈజీ!

  • Published Nov 05, 2024 | 5:41 PM Updated Updated Nov 05, 2024 | 5:41 PM

Google Maps: ప్రస్తుత కాలంలో గూగుల్ మ్యాప్స్ వినియోగం బాగా పెరిగింది. గూగుల్ మ్యాప్స్ ఏఐ ఫీచర్స్ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.

Google Maps: ప్రస్తుత కాలంలో గూగుల్ మ్యాప్స్ వినియోగం బాగా పెరిగింది. గూగుల్ మ్యాప్స్ ఏఐ ఫీచర్స్ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.

Google Mapsలో అదిరిపోయే AI ఫీచర్స్.. ఇక అవి తెలుసుకోవడం చాలా ఈజీ!

గూగుల్‌ మ్యాప్స్‌ వాడకం ప్రస్తుతం చాలా ఎక్కువయ్యింది. ఈరోజుల్లో అందరికీ అనివార్యంగా మారింది. తెలిసిన అడ్రస్​ను కూడా గూగుల్‌ మ్యాప్స్‌లో చూస్తూ వెళ్తున్న పరిస్థితులు వచ్చేశాయి. జర్నీకి ఎంత టైమ్ పడుతుంది? ఏవైనా షార్ట్‌కర్ట్స్‌ ఉన్నాయా? లాంటి వివరాలను తెలుసుకోవడం ఈ రోజుల్లో చాలా ఎక్కువయ్యింది. ఇలా వెళ్లేందుకే గూగుల్ మ్యాప్స్‌ను చాలా మంది ఉపయోగిస్తున్నారు.అయితే గూగుల్ మ్యాప్స్ యాప్​ను మరింత యూజర్ ఫ్రెండ్లీగా మారుస్తూ గూగుల్ కొంతకాలం నుంచి కొత్త ఫీచర్లను తీసుకొస్తుంది.ఇందుకోసం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ని వాడుకుంటుంది. తమ యూజర్ల కోసం ఎన్నో కొత్త ఫీచర్స్​ను తీసుకొస్తున్నామని గూగుల్ ఇటీవల తెలిపింది. వాటి ద్వారా కొత్త ప్రాంతాలకి టూర్ కి వెళ్ళడం మరింత కంఫర్ట్ కానుంది. ఇంతకీ ఆ ఫీచర్స్ ఏంటంటే? వాటి వల్ల ఉపయోగాలు ఏమిటి? పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

మామూలుగా మనం ఓ ఫేమస్ రెస్టారెంట్​కు వెళ్లాలనుకుంటే ఏం చేస్తాం? దాని పేరును మ్యాప్స్​లో సెర్చ్ చేసి అది చూపించిన రూట్ ద్వారా వెళ్లిపోతాం. ఇక కొత్త ఫీచర్ సాయంతో మనం ఎప్పుడైనా కొత్త ప్లేస్ కి వెళ్లినప్పుడు మ్యాప్స్​లో రెస్టారెంట్స్ లేదా డేట్ నైట్ స్పాట్స్ అని సెర్చ్ చేస్తే ఆ ప్రాంతంలో ఉన్న బెస్ట్​ ఔట్​లెట్స్​ ని చూడవచ్చు. మీరు గ్రూప్ డిన్నర్​కు వెళ్లాలనుకన్నా కూడా సజెస్ట్ చేస్తోంది. రెస్టారెంట్‌లు, కేఫ్‌లను ఈజీగా పిన్ చేసి మంచి రూట్ చూపిస్తుంది.ఇంకా అంతే కాకుండా మీకు ఏం చేయాలో తెలియకపోయినా ఇకపై గూగుల్ మ్యాప్స్ సహాయం చేస్తుంది. చలికాలంలో మనం వెళ్లబోయే ట్రిప్​లో ఎంజాయ్ చేయాల్సిన మూమెంట్స్ ఏంటి? ఏ ప్లేసెస్ కి వెళ్తే సరదాగా గడపవచ్చు? బాగా ఎంజాయ్ చేయవచ్చు? ఒకవేళ వర్షం పడుతుంటే ఏం చేయాలి? వంటి క్వశ్చన్స్ కి గూగుల్ మ్యాప్స్ సమాధానాలు ఇస్తుంది. మీరు వెళ్లే ఛాన్స్ ఉన్న ప్లేసెస్ ని సజెస్ట్ చేస్తుంది.

మామూలుగా గూగుల్ లో రివ్యూలను చూసి ట్రిప్​కి ఎక్కడికి వెళ్లాలో డిసైడ్ అవుతాం. అన్నీ చెక్ చేసుకొని ఫిక్స్ అవుతాం. అయితే ఇకపై గూగుల్ మ్యాప్స్​ వందల రివ్యూస్​ను సమ్మరైజ్ చేస్తుంది. ఓ చిన్న పేరాగ్రాఫ్​లో చాలా క్లారిటీగా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఈ ఫీచర్ వల్ల మీ టైమ్ సేవ్ అవుతుంది. అలాగే ఎక్కువ ప్లేసెస్ గురించి కూడా మీరు తెలుసుకోవచ్చు.కొన్ని టూరిస్ట్ స్పాట్​లలో క్లైమేట్ అనుకూలంగా లేకుంటే మనం ఎంజాయ్ చేయలేం. ఇకపై గూగుల్ మ్యాప్స్​లో క్లైమేట్ ఎలా ఉందో కూడా తెలుసుకోవచ్చు. దాని బట్టి మనం టూర్ ప్లాన్ చేసుకోవచ్చు. అలాగే మనం వెళ్లాలనుకునే ప్లేస్ లో క్రౌడ్, ట్రాఫిక్ ఉందో లేదో కూడా గూగుల్ మ్యాప్స్ ఈజీగా చెప్పేస్తుంది. ఇలా మనకు ఉపయోగపడే చాలా ఫీచర్స్​ను గూగుల్ తీసుకొస్తుంది. ఇదీ సంగతి. మరి ఈ గూగుల్ మ్యాప్స్ AI ఫీచర్స్ గురించి మీరేమి అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş