P Venkatesh
స్మార్ట్ ఫోన్ ప్రియులకు అదిరిపోయే కొత్త స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. కిర్రాక్ ఫీచర్లను కలిగి ఉంది. షావోమీ నుంచి కిర్రాక్ ఫీచర్లతో షావోమీ 14 సివి మొబైల్ ను భారత్ లో లాంఛ్ చేసింది.
స్మార్ట్ ఫోన్ ప్రియులకు అదిరిపోయే కొత్త స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. కిర్రాక్ ఫీచర్లను కలిగి ఉంది. షావోమీ నుంచి కిర్రాక్ ఫీచర్లతో షావోమీ 14 సివి మొబైల్ ను భారత్ లో లాంఛ్ చేసింది.
P Venkatesh
హ్యూమన్ లైఫ్ స్టైల్లో స్మార్ట్ ఫోన్ తెచ్చిన మార్పు అంతా ఇంతా కాదు. నేడు చేతిలో క్షణకాలం మొబైల్ లేకపోతే ఊపిరాడన్నతంపనైపోతుంది. ఏ పని కావాలన్నా స్మార్ట్ ఫోన్ ఉండాల్సిందే. నిద్ర లేచింది మొదలు పడుకునేంత వరకు స్మార్ట్ ఫోన్ కి అతుక్కుపోయేవారే ఎక్కువ. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు స్మార్ట్ ఫోన్లకు అడిక్ట్ అయిపోతున్నారు. స్మార్ట్ ఫోన్ లో వస్తున్న లేటెస్ట్ ఫీచర్లు యూజర్లను కొత్త స్మార్ట్ ఫోన్లను కొనేలా చేస్తున్నాయి. మొబైల్ తయారీ కంపెనీలు ఎప్పటికప్పుడు అప్ డేటెడ్ వర్షన్లతో అధునాతన ఫీచర్లతో స్మార్ట్ ఫోన్లను తయారు చేసి మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి. ఈ క్రమంలో మరో కొత్త స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. షావోమీ నుంచి కిర్రాక్ ఫీచర్లతో షావోమీ 14 సివి మొబైల్ ను భారత్ లో లాంఛ్ చేసింది.
ప్రముఖ మొబైల్ సంస్థ షావోమీ నుంచి విడుదలయ్యే స్మార్ట్ ఫోన్లకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. షావోమీ స్మార్ట్ ఫోన్లలో అదిరిపోయే ఫీచర్లను అందిస్తుండడంతో హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఇక షావోమీ భారత్ లో లాంఛ్ చేసిన షావోమీ 14 సివి స్మార్ట్ ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. 8జీబీ+256జీబీ, 12జీబీ+512 వేరియంట్ లలో అందుబాటులో ఉంది. ధర విషయానికి వస్తే.. 8జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.42,999గా కంపెనీ నిర్ణయించింది. 12జీబీ+512జీబీ వేరియంట్ ధర రూ.47,999గా తెలిపింది. ఈ స్మార్ట్ ఫోన్ క్రూయిజ్ బ్లూ, మ్యాచా గ్రీన్, షాడో బ్లాక్ కలర్స్ లో లభిస్తుంది. జూన్ 20 మధ్యాహ్నం 12 నుంచి వీటి విక్రయాలు ప్రారంభం అవుతాయని పేర్కొంది. ఎంఐ వెబ్‌సైట్, స్టోర్‌లతో పాటు ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయొచ్చని కంపెనీ తెలిపింది. ఐసీఐసీఐ బ్యాంక్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ.3 వేలు డిస్కౌంట్ అందించనున్నట్లు కంపెనీ తెలిపింది.
షావోమీ 14 సివి స్మార్ట్ ఫోన్ 6.55 అంగుళాల 1.5కే కర్వ్‌డ్ అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తుంది. స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్3 ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత హైపర్‌ఓఎస్‌తో పనిచేస్తుంది. 120హెచ్ జెడ్ రిఫ్రెష్ రేటు, 240హెచ్ జెడ్ టచ్‌శాంప్లింగ్ రేట్, 3000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఇందులో 50 ఎంపీ ఓఐఎస్ కెమెరా, 50 ఎంపీ టెలిఫొటో, 12 ఎంపీ ట్రిపుల్ కెమెరాలను అందించారు. సెల్ఫీల కోసం డ్యుయల్ 32 ఎంపీ కెమెరాలు అమర్చారు. ఈ స్మార్ట్ ఫోన్ 4,700ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీని కలిగి ఉంది.