మీ Instagram ప్రొఫైల్ ని మీకు తెలియకుండా ఎవరైనా చూస్తున్నారా? ఈ ట్రిక్ తో తెలుసుకోవచ్చు..!

Instagram: ఈ రోజుల్లో ఇన్స్టా గ్రామ్ వాడకం బాగా పెరిగిపోయింది. అయితే మనకు తెలీకుండా మన ప్రొఫైల్ ని ఎవరెవరు చూస్తున్నారో తెలుసుకోవడం చాలా కష్టం

Instagram: ఈ రోజుల్లో ఇన్స్టా గ్రామ్ వాడకం బాగా పెరిగిపోయింది. అయితే మనకు తెలీకుండా మన ప్రొఫైల్ ని ఎవరెవరు చూస్తున్నారో తెలుసుకోవడం చాలా కష్టం

ప్రస్తుతం ఎక్కువ మంది వాడుతున్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్. చాలా మందికి బ్యాంక్ అకౌంట్ ఉందో లేదో కానీ ఇన్స్టా లో అకౌంట్ మాత్రం ఉంటుంది. ఎందుకంటే ఇదొక రంగుల ప్రపంచం. టైమ్ పాస్ కి అడ్డా. ప్రపంచం మొత్తాన్ని మన కళ్ల ముందు ఉంచేస్తుంది. అందుకే దీనికి యూత్ లో క్రేజ్ చాలా ఎక్కువ. ఫేస్ బుక్, ఎక్స్ ల కంటే ఇన్స్టాగ్రామ్ కే ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు యువత. ఇన్స్టా రీల్స్ ఒక రేంజిలో టైమ్ పాస్ చేస్తాయి. ఇలా ప్రతి ఒక్కరికీ కూడా ఇన్స్టా గ్రామ్ బాగా అలవాటు అయిపోయింది. కానీ చాలా మంది కూడా ఇన్స్టా గ్రామ్ ని చాలా సీరియస్ గా తీసుకుంటారు. తమ ప్రొఫైల్ ని చాలా వెరైటీగా మార్చుకుంటారు. తమని ఫోలో చేసే వారిని ఆకట్టుకోవడానికి చాలా డిఫరెంట్ గా తమ ప్రొఫైల్ ని సెట్ చేసుకుంటారు. రోజుకి కొన్ని వందల సార్లు తమ ప్రొఫైల్ ని చెక్ చేసుకుంటూ ఉంటారు. అయితే మన ప్రొఫైల్ ని మనకు తెలీకుండా ఎవరెవరు చూస్తున్నారో తెలీదు. అది కనిపెట్టడం అసాధ్యం. కానీ చాలా మందికి కూడా తెలుసుకోవాలనే క్యూరియాసిటీ ఉంటుంది. కానీ ఆ ఆప్షన్ లేదు. అయితే ఒక ట్రిక్ ద్వారా మన ఇన్స్టా ప్రొఫైల్ ని ఎవరు చూస్తున్నారో తెలుసుకోవచ్చు. మీకు కూడా తెలుసుకోవాలని ఉందా? అయితే ఇప్పుడు చెప్పబోయే ట్రిక్ ఏంటో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

మనం అప్పుడప్పుడు ఇన్స్టా గ్రామ్ లో స్టోరీస్ లేదా హైలైట్స్ పెడుతూ ఉంటాము. అయితే వీటి ద్వారా మన ప్రొఫైల్ ని ఎవరు చూస్తున్నారో ఈజీగా తెలుసుకోవచ్చు. ముందుగా మీరు మీ అకౌంట్ ప్రైవేట్ లో ఉంటే పబ్లిక్ లో పెట్టండి. తరువాత ఏదైనా ఒక మంచి స్టోరీ పెట్టండి. ఆ తరువాత మీ స్టోరీని ఓపెన్ చేయండి. మీ స్టోరీలో Activity ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే మీ స్టోరీ చూసిన వాళ్ళ లిస్ట్ కనిపిస్తుంది. 100 కి 99 శాతం వీళ్ళే మీ ప్రొఫైల్ ని చూస్తారు. ఈ ట్రిక్ ద్వారా మీ ప్రొఫైల్ మీకు తెలీకుండా ఎవరెవరు చూశారో తెలుసుకోవచ్చు. వారు మీ ప్రొఫైల్ చూడటం మీకు ఇష్టం లేకుంటే వారిని బ్లాక్ చేయవచ్చు.

అలాగే మనం ఏదైనా హైలైట్ పెట్టినన్నపుడు కూడా తెలుసుకోవచ్చు. హైలైట్ పెట్టినప్పుడు కూడా అందులో మీకు Activity సెక్షన్ కనిపిస్తుంది. దాన్ని ఓపెన్ చేసి చూసినా కూడా మన ప్రొఫైల్ ఎవరు చూశారో తెలుసుకోవచ్చు. అయితే మన అకౌంట్ పుబ్లిక్ లో ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యం అవుతుంది. ఒక వేళ ప్రైవేట్ లో ఉంటే కేవలం మీ ఫాలోవర్స్ లో ఎవరు చూశారనేది మాత్రమే తెలుస్తుంది. ఇదీ సంగతి.. ఇలా మీరు మీ ప్రొఫైల్ ని మీకు తెలీకుండా ఎవరెవరు చూశారో ఈజీగా తెలుసుకోవచ్చు. ఇక ఈ సమాచారం గురించి మీరేమి అనుకుంటున్నారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.

Show comments