విస్ట్రాన్ గ్రీన్ సిగ్నల్.. భారత్ లో టాటాల నుండి ఐఫోన్లు!

ఐఫోన్ అంటే ఇష్టపడని వాళ్లు ఎవరుంటారు చెప్పండి. యువతలో ముఖ్యంగా ఐఫోన్ అంటే విపరీతమైన క్రేజ్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా కూడా భారత్ ఐఫోన్లకు కీలక మార్కెట్ గా అవతరిస్తోంది.

ఐఫోన్ అంటే ఇష్టపడని వాళ్లు ఎవరుంటారు చెప్పండి. యువతలో ముఖ్యంగా ఐఫోన్ అంటే విపరీతమైన క్రేజ్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా కూడా భారత్ ఐఫోన్లకు కీలక మార్కెట్ గా అవతరిస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్లకు ఉన్న క్రేజ్ గురించి ఎవరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా యువతలో ఐఫోన్ అంటే సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. పైగా ఇప్పుడు ఐఫోన్ అనేది స్టేటస్ సింబల్ కూడా అయిపోయింది. ఇటీవల భారత్ లో కూడా యాపిల్ సంస్థ రెండు రిటైల్ అవుట్ లెట్లను ఓపెన్ చేసింది. ఐఫోన్లకు భారత్ అనేది ఒక ప్రధాన మార్కెట్ గా మారుతుండటం కూడా చూస్తున్నాం. ఇప్పుడు ఐఫోన్లు తయారీ సంస్థను విక్రయించేందుకు విస్ట్రాన్ సంస్థ అంగీకరించడందో.. ఐఫోన్లు తయారు చేయనున్న తొలి దేశీయ సంస్థగా టాటా గ్రూప్ నిలవనుంది.

బెంగళూరు సమీపంలోని ఐఫోన్ అసెబ్లింగ్ యూనిట్ ను టాటా గ్రూపునకు విక్రయించేందుకు తైవాన్ సంస్థ విస్ట్రా గ్రూప్ అంగీకారం తెలిపింది. దాదాపు ఏడాదిగా టాటా గ్రూపు- విస్ట్రాన్ మధ్య ఈ డీల్ కి సంబంధించి సంప్రదింపులు జరుగుతున్నాయి. ఇండియాలోని విస్ట్రాన్ ఇన్ఫోకామ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని టాటా గ్రూపునకు విక్రయించేందుకు ఆ సంస్థ బోర్డు ఆమోదం తెలిపింది. 125 మిలియన్ డాలర్ల(దాదాపు రూ.1035 కోట్లు)కు విక్రయించేందుకు సిద్ధమయ్యారు. ఈ యూనిట్ లో ప్రస్తుతం ఐఫోన్ 14 కూడా అసెంబ్లిగ్ జరుగుతోంది. ఈ యూనిట్ ద్వారా దాదాపు 10 వేల మంది ఉపాధి పొందుతున్నారు.

రెండు కంపెనీలు ఒప్పందాలపై సంతకాలు చేసిన తర్వాత తప్పనిసరి అనుమతుల కోసం ముందుకు వెళ్తామంటూ విస్ట్రాన్ సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం ఇండియాలో తైవాన్ కు చెందిన పెగాట్రాన్ కార్పొరేషన్, ఫాక్స్ కాన్ టెక్నాలజీ గ్రూపు సంస్థలు ఐఫోన్లను తయారు చేస్తున్నాయి. లేటెస్ట్ అప్ డేట్స్ తో వీటి సరసన టాటా సన్స్ అనుబంధ సంస్థ టాటా ఎలక్ట్రానిక్స్ చేరనుంది. తాజా పరిణామాలపై కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. టాటా గ్రూపునకు శుభాకాంక్షలు చెప్పారు. టాటా సంస్థ ఐఫోన్లను విదేశాలకు ఎగుమతి చేయాలంటూ ఆకాంక్షించారు. స్మార్ట్ ఫోన్ తాయరీ, ఎగుమతులకు భారత్ హబ్ గా అవతరిస్తోందని వ్యాఖ్యానించారు. మరి.. ఐఫోన్లను టాటా సంస్థ తాయరు చేయనుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments