ఐఫోన్‌లో కిక్ ఇచ్చే Genmoji ఫీచర్.. దీన్ని ఎలా క్రియేట్ చేయాలంటే?

Genmoji Feature In iPhones: మీరు ఐఫోన్ యూజర్స్ అయితే ఈ ఫీచర్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే ఇది కిక్ ఇచ్చే ఫీచర్. జెన్మోజీ అంటే ఏంటి? దీని వల్ల ఉపయోగాలు ఏంటి? దీన్ని ఐఫోన్ లో ఎలా క్రియేట్ చేసుకోవాలి?

Genmoji Feature In iPhones: మీరు ఐఫోన్ యూజర్స్ అయితే ఈ ఫీచర్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే ఇది కిక్ ఇచ్చే ఫీచర్. జెన్మోజీ అంటే ఏంటి? దీని వల్ల ఉపయోగాలు ఏంటి? దీన్ని ఐఫోన్ లో ఎలా క్రియేట్ చేసుకోవాలి?

వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫిరెన్స్ 2024లో భాగంగా యాపిల్ కంపెనీ ఐఓఎస్ 18, ఐపాడ్ ఓఎస్ 18, మ్యాక్ ఓఎస్ సుక్వోయ సహా పలు ఇతర అప్డేట్స్ ని ప్రకటించింది. యాపిల్ ఇంటిలిజెన్స్ ఫీచర్స్ లో భాగంగా కంపెనీ ఐఫోన్స్ లో జెన్మోజిని పరిచయం చేసింది. అయితే మీకు ఈ జెన్మోజి గురించి తెలియకపోతే కనుక ఈ కథనం మీకు ఉపయోగపడుతుంది.    

జెన్మోజి (జనరేటివ్ + ఎమోజి) అనేది యాపిల్ ఇంటిలిజెన్స్ ఫీచర్స్ లో ఒకటి. ఇది ఎమోజీని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్తుంది. ఈ ఫీచర్ తో మీ ఐఫోన్ డివైజెస్ లో ఎమోజీస్ ని మనకి నచ్చినట్టు క్రియేట్ చేసుకోవచ్చు. ఐఫోన్ లో ఏఐ ప్రాంప్ట్ అండ్ కీబోర్డు ద్వారా మీకు ఎమోజీ ఎలా కావాలంటే అలా డిస్క్రిప్షన్ రాసి ఒక కొత్త ఎమోజీని జనరేట్ చేసుకోవచ్చు. దీన్నే జెన్మోజీ అంటారు. ఉదాహరణకు మీరు ‘సర్ఫ్ బోర్డు మీద టూటూ డ్రస్ వేసుకున్న టీ-రెక్స్’ ఎమోజీ కావాలి అని డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తే మీకు మీ మైండ్ లో ఉన్న పిక్చర్ ఎమోజీలా దర్శనమిస్తుంది.

ఈ జెన్మోజి ఫీచర్ ని చాలా అడ్వాన్స్డ్ గా వాడుకోవచ్చు. మీ ఫోన్ లో ఉన్న ఫోటోలతో కూడా జెన్మోజి ఎమోజీలను క్రియేట్ చేసి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసుకోవచ్చు. మీ తండ్రి ఫోటోని సూపర్ హీరోగా మార్చమని అడిగితే జెన్మోజీ క్షణాల్లోనే సూపర్ హీరోగా మార్చేస్తుంది. ఐఫోన్ లో ఈ బ్రాండ్ న్యూ ఏఐ ఫీచర్ అనేది యూజర్స్ తాము అనుకున్నట్లు స్వేచ్ఛగా కస్టమ్ ఎమోజీని క్రియేట్ చేసుకోవచ్చు. మెసేజెస్ లో ఎమోజీలు యాడ్ చేసినట్టు.. జెన్మోజీలను కూడా పంపవచ్చు. ఈ జెన్మోజీలను స్టిక్కర్స్ గా లేదా మెసేజెస్ యాప్ లో రియాక్షన్ గా వాడుకోవచ్చు. 

ప్రస్తుతం ఇంకా ఈ ఫీచర్ అందుబాటులోకి రాలేదు. ఇది అందుబాటులోకి వచ్చేవరకూ ఐఫోన్లలో జెన్మోజీలను క్రియేట్ చేయడం కుదరదు. అయితే ఐఫోన్ ఎక్స్ఆర్, ఎక్స్ఎస్, ఎక్స్ఎస్ మ్యాక్స్ సహా ఐఓఎస్ 18 సపోర్ట్ చేసే కొత్త మోడల్స్ లో మాత్రమే ఈ ఫీచర్ వర్క్ అవుతుంది. ఇది అన్ని ఫోన్లలో వర్క్ అవ్వదు. ఐఓఎస్18 జెన్మోజీ ఫీచర్ ని పొందాలంటే మీరు ఐఫోన్ 15 ప్రో, 15 ప్రో మ్యాక్స్ యూజర్స్ అయి ఉండాలి. అలానే ఎం-సిరీస్ చిప్ సెట్ కలిగి ఉన్న ఐపాడ్, మ్యాక్ డివైజెస్ ని కల్గి ఉండాలి. మరి మీకు జెన్మోజీని సపోర్ట్ చేసే ఫోన్ ఉండి ఈ ఫీచర్ అందుబాటులో ఉంటే ఎలాంటి జెన్మోజీలను క్రియేట్ చేస్తారో కామెంట్ చేయండి.

Show comments