స్పోర్ట్స్ బైక్ లుక్స్ లో EV.. సింగిల్ ఛార్జ్‌తో 323 కి.మీల రేంజ్

కొత్తగా ఎలక్ట్రిక్ బైక్ కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే మార్కెట్ లోకి మరో సరికొత్త ఎలక్ట్రిక్ బైక్ అందుబాటులోకి వచ్చింది. సింగిల్ ఛార్జ్ తో ఏకంగా 323 కి.మీలు ప్రయాణించొచ్చు.

కొత్తగా ఎలక్ట్రిక్ బైక్ కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే మార్కెట్ లోకి మరో సరికొత్త ఎలక్ట్రిక్ బైక్ అందుబాటులోకి వచ్చింది. సింగిల్ ఛార్జ్ తో ఏకంగా 323 కి.మీలు ప్రయాణించొచ్చు.

ఎలక్ట్రిక్ వాహనాల పట్ల వాహనదారులు ఇంట్రస్టు చూపిస్తున్నారు. మార్కెట్ లో ఎలక్ట్రిక్ బైక్ లు, స్కూటర్లకు ఫుల్ డిమాండ్ పెరుగుతోంది. ఈవీ తయారీ కంపెనీలు స్టన్నింగ్ డిజైన్, అధునాతన ఫీచర్లతో సరికొత్త మోడళ్లను రూపొందించి మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి. ఈవీ రంగంలో ఓలా, ఏథర్, టీవీఎస్, హోండా కంపెనీలు దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలో మరో సరికొత్త ఎలక్ట్రిక్ బైక్ అందుబాటులోకి వచ్చింది. స్పోర్ట్స్ లుక్ లో ఉన్న ఈ వెహికిల్ బైక్ లవర్స్ ని తెగ ఆకట్టుకుంటోంది. బెంగళూరుకు చెందిన స్టార్టర్ అల్ట్రా వయోలెట్ అటోమోటివ్ కంపెనీ తాజాగా కొత్త ఎలక్ట్రిక్ బైక్‌ను లాంచ్ చేసింది. దీని పేరు ఎఫ్77 మ్యాక్ 2.

పెట్రోల్ ధరల నుంచి తప్పించుకోవాలనుకుంటే ఎఫ్77 మ్యాక్ 2 ఎలక్ట్రిక్ బైక్ ను తీసుకుంటే మేలు. ఎందుకంటే ఈ ఈవీ ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే 323 కి.మీలు ప్రయాణించొచ్చు. అంతే కాదు ఈ బైక్ లో పొందుపర్చిన ఫీచర్లు చూస్తే ఫిదా కావాల్సిందే. ఈ బైక్ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. ఈ బైక్ డెలివరీస్ వచ్చే మే నెల నుంచి ప్రారంభం అవుతాయి. ఎఫ్ 77 మ్యాక్ 2 బైక్‌లో స్టాండర్డ్, రెకాన్ రెండు వేరియంట్లు ఉంటాయి. స్టాండర్డ్ వేరియంట్ ధర రూ. 2.99 లక్షలు. ఇక రెకాన్ వేరియంట్ ధర రూ. 3.99 లక్షలు.

ఈ కొత్త బైక్ 9 రకాల కలర్స్‌లో అందుబాటులో ఉంటుంది. కంపెనీ ఇందులో 7.1 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ పోయాక్ ఉంటుంది. అలాగే 27 కేడబ్ల్యూ మోటార్ అమర్చారు. స్టాండర్డ్ వేరియంట్‌కు ఇది వర్తిస్తుంది. అదే రెకాన్ వేరియంట్ అయితే 10.3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ, 30 కేడబ్ల్యూ మోటార్ ఉంటాయి. స్టాండర్డ్ వేరియంట్ రేంజ్ 211 కిలోమీటర్లు. ఇక రెకాన్ వేరియంట్ రేంజ్ 323 కిలోమీటర్లు. ఈ రెకాన్ వేరియంట్ 0 నుంచి 60 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 2.8 సెకన్లలోనే అందుకుంటుంది. దీని టాప్ స్పీడ్ 155 కిలో మీటర్లు. ఈ బైక్ లో మూడు రైడింగ్ మోడ్స్ ఉంటాయి. ఐదు ఇంచుల టీఎఫ్‌టీ డిజిటల్ క్లస్టర్, ఆటో డిమ్మింగ్ లైట్స్, హిల్ హోల్డ్, ఏబీఎస్, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్, డిస్క్ బ్రేక్స్ వంటి ఫీచర్లు వంటి ఫీచర్లు ఉన్నాయి.

Show comments