iDreamPost
android-app
ios-app

Electric Vehicle వాడుతున్నారా? ఈ తప్పులు చేస్తే రిపేర్లు తప్పవు!

  • Published Nov 02, 2024 | 5:06 PM Updated Updated Nov 02, 2024 | 5:06 PM

Electric Vehicle: ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడే వారు కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే చాలా నష్టపోతారు.

Electric Vehicle: ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడే వారు కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే చాలా నష్టపోతారు.

Electric Vehicle వాడుతున్నారా? ఈ తప్పులు చేస్తే రిపేర్లు తప్పవు!

ప్రస్తుతం మార్కెట్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ చలామణి అవుతున్నాయి. కొత్త టెక్నాలజీతో పాటు స్ట్రాంగ్ బ్యాటరీ కెపాసిటీ ఉన్న ఎలక్ట్రిక్ వెహికల్స్ మార్కెట్లోకి వస్తున్నాయి. ఇక ఎలక్ట్రిక్ వెహికల్స్ లో అన్నిటికంటే ముఖ్యమైన పార్ట్ బ్యాటరీ. ఇది ఎలక్ట్రిక్ వెహికల్స్ కి గుండె లాంటిది. అంతేగాక అత్యంత ఖరీదైన పార్ట్ కూడా. కాబట్టి కచ్చితంగా బ్యాటరీని సరిగ్గా వాడాలి. ఎలా పడితే అలా వాడితే బ్యాటరీ త్వరగా పాడు కావచ్చు. అప్పుడప్పుడు మనం చేసే కొన్ని పొరపాట్లు బ్యాటరీని దెబ్బతీస్తాయి. మీ ఎలక్ట్రిక్ కారు, ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ ఎక్కువ కాలం రావాలంటే కొన్ని తప్పులు చేయడం మానేయాలి. మీరు ఈ తప్పులు చేయడం మానేయకపోతే, బ్యాటరీ కచ్చితంగా పాడైపోవచ్చు లేదా బ్యాటరీ లైఫ్ టైమ్ ఈజీగా తగ్గిపోవచ్చు. ఇక ఎలక్ట్రిక్ వెహికల్ వాడేటప్పుడు మనం చేస్తున్న తప్పులు ఏంటి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడుతున్న వారు ఎక్కువగా చేస్తున్న తప్పు ఏంటంటే.. ఫాస్ట్ ఛార్జింగ్.. కొంతమంది అవసరం ఉన్నా లేకున్నా ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ వాడతారు. అలా వాడితే బ్యాటరీ త్వరగా పాడవుతుంది. మనకు అర్జెంట్ అయినప్పుడు మాత్రమే ఫాస్ట్ ఛార్జింగ్‌ని ఉపయోగించాలి. ఎందుకంటే ఫాస్ట్ ఛార్జింగ్ అనేది చాలా వేడిని జనరేట్ చేస్తుంది. ఓవర్ హీట్ క్రమంగా బ్యాటరీ పని తీరుని తగ్గిస్తుంది. కాబట్టి మనకు అవసరం అయితే తప్ప ఫాస్ట్ ఛార్జింగ్ పెట్టకూడదు. కాబట్టి ఈ విషయాన్ని కచ్చితంగా గుర్తు పెట్టుకోండి. ఫాస్ట్ ఛార్జింగ్ ని తగ్గించండి. ఎప్పుడైనా కానీ బ్యాటరీని చార్జ్ చేస్తున్నప్పుడు 20:80 రూల్ ని కచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి. మొబైల్ ఫోన్ అయినా, ఎలక్ట్రిక్ వెహికల్ అయినా సరే, బ్యాటరీ 20 శాతానికి తగ్గకుండా, 80 శాతానికి మించకుండా చార్జ్ చేయకూడదు. అయితే చాలా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఓవర్‌ఛార్జ్‌ కాకుండా ఛార్జింగ్ లిమిట్ ఆప్షన్‌ ని కలిగి ఉంటాయి. కొన్నింటిలో ఈ ఆప్షన్ ఉండదు. ఒకవేళ మీ ఎలక్ట్రిక్ స్కూటర్ కి ఆ ఆప్షన్ లేకుంటే ఓవర్ చార్జ్ జరిగినప్పుడు బ్యాటరీ పనితీరు తగ్గిపోవడం జరుగుతుంది.

ఎలక్ట్రిక్ వాహనానికి కచ్చితంగా సర్వీసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సకాలంలో ఈవీకి సర్వీసింగ్‌ కనుక అందించకపోతే సరిగ్గా పని చేయదు. కాబట్టి కచ్చితంగా సర్వీసింగ్ చేయించండి. ఈ జాగ్రత్తలు పాటించడం వల్ల మీ ఈవి బ్యాటరీ సేఫ్ గా ఉంటుంది. బ్యాటరీ సేఫ్ గా ఉంటే ఎలాంటి ఫైర్ యాక్సిడెంట్స్ జరగవు. కొన్ని వెహికల్స్ అప్పుడప్పుడు తగలబడి పోతూ ఉంటాయి. దానికి కారణం బ్యాటరీ విషయంలో చేసే ఈ తప్పులే. కాబట్టి కచ్చితంగా ఇలాంటి తప్పులు చేయకుండా బ్యాటరీ విషయంలో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి. మీ ఈవీని మంచి కండిషన్లో సేఫ్ గా ఉంచుకోండి. ఇక ఈ సమాచారం గురించి మీరేమి అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.