nagidream
Budget AI iPhone At Affordable Price: యాపిల్ ఐఫోన్ కొనాలని చాలా మందికి ఉంటుంది. కానీ దాని ధర చూసి కొనాలన్నా మూడు, ఉత్సాహం తగ్గిపోతాయి. దీంతో బడ్జెట్ లో దొరికే ఆండ్రాయిడ్ ఫోన్స్ నే కొనుగోలు చేస్తుంటారు. అయితే ఇప్పుడు యాపిల్ కంపెనీ ఆండ్రాయిడ్ ఫోన్స్ ని టార్గెట్ చేస్తూ బడ్జెట్ లో ఐఫోన్ ని తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.
Budget AI iPhone At Affordable Price: యాపిల్ ఐఫోన్ కొనాలని చాలా మందికి ఉంటుంది. కానీ దాని ధర చూసి కొనాలన్నా మూడు, ఉత్సాహం తగ్గిపోతాయి. దీంతో బడ్జెట్ లో దొరికే ఆండ్రాయిడ్ ఫోన్స్ నే కొనుగోలు చేస్తుంటారు. అయితే ఇప్పుడు యాపిల్ కంపెనీ ఆండ్రాయిడ్ ఫోన్స్ ని టార్గెట్ చేస్తూ బడ్జెట్ లో ఐఫోన్ ని తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.
nagidream
2025 ప్రారంభంలో ఐఫోన్ ఎస్ఈ 4 లాంచ్ అవ్వబోతుంది. యాపిల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో లాంచ్ కాబోతున్నట్టు సమాచారం. బడ్జెట్ ఫ్రెండ్లీ ఐఫోన్ గా రాబోతున్న ఈ ఐఫోన్ ఎస్ఈ 4 కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హై ఎండ్ మోడల్స్ లో ఉన్న పవర్ ఫుల్ యాపిల్ ఇంటెలిజెన్స్ తో మిడ్ రేంజ్ బడ్జెట్ లో స్మార్ట్ ఫోన్ ని తీసుకొస్తున్నట్లు తెలుస్తుంది. అదే జరిగితే కనుక స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో ఇదొక గేమ్ ఛేంజర్ అవ్వడం పక్కా అంటున్నారు టెక్ నిపుణులు. ఈ చర్యతో మిడ్ రేంజ్ ఆండ్రాయిడ్ మార్కెట్ గణనీయంగా దెబ్బ తింటుందని అంటున్నారు. ప్రస్తుతం ఐఫోన్ 15 ప్రో, రానున్న ఐఫోన్ 16 సిరీస్ లలో మాత్రమే ఏఐ అసిస్టెంట్ ఎక్స్ క్లూజివ్ గా అందుబాటులో ఉంటుంది.
అయితే ఐఫోన్ ఎస్ఈ 4 ఫోన్లలో ఏఐ టెక్నాలజీని తీసుకొస్తే కనుక యాపిల్ కంపెనీ ఒక మార్క్ ని అయితే సెట్ చేస్తుంది. పలు నివేదికల ప్రకారం యాపిల్ ఐఫోన్ ఎస్ఈ 4 ఫోన్ 8 జీబీ ర్యామ్ తో వస్తుంది. యాపిల్ ఇంటెలిజెన్స్, సరసమైన ధర ఈ రెండిటి వల్ల ఐఫోన్ ఎస్ఈ 4 ఫోన్.. మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో గట్టి పోటీ ఇవ్వనుంది. ఈ మిడ్ రేంజ్ సెగ్మెంట్ లో చాలా వరకూ ఆండ్రాయిడ్ ఫోన్స్ లో ఏఐ ఫీచర్స్ అనేవి పూర్తిగా అందుబాటులో లేవు. అయితే ఈ యాపిల్ ఎస్ఈ 4 మోడల్ లో ఏఐ ఫీచర్స్ ని పూర్తిగా ఎక్స్ పీరియన్స్ చేసేలా తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఏఐ ఫీచర్స్ గురించి పక్కన పెడితే.. ఈ ఐఫోన్ ఎస్ఈ 4 గణనీయమైన డిజైన్ తో రాబోతుంది. ఐఫోన్ 14కి సమాన ఫీచర్స్ తో ఈ ఫోన్ ని తీసుకొస్తున్నట్లు.. ముఖ్యంగా టచ్ ఐడీ ప్లేస్ లో ఫేస్ ఐడీ ఫీచర్ ని తీసుకొస్తున్నట్లు సమాచారం.
డ్యూయల్ కెమెరా సిస్టం, ఇన్నోవేటివ్ యాక్షన్ బటన్, యూఎస్బీ-సీ కనెక్టివిటీతో రాబోతున్నట్లు తెలుస్తోంది. ఐఫోన్ ఎస్ఈ 4 6.1 అంగుళాల ఓఎల్ఈడీ డిస్ప్లేతో.. ఏ18 బయోనిక్ చిప్ సెట్ తో వస్తుంది. 48 మెగా పిక్సెల్ సింగిల్ కెమెరా, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12 ఎంపీ ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. ఈ ఫోన్ ధర 400 డాలర్ల నుంచి 500 డాలర్ల మధ్య ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి. అంటే మన కరెన్సీ ప్రకారం.. 33 వేల నుంచి 41 వేల మధ్యలో ఉంటుంది. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ యూజర్స్ ని ఆకర్షించడం కోసం యాపిల్ కంపెనీ ఈ బడ్జెట్ లో బెస్ట్ ఫీచర్స్ తో ఐఫోన్ ని అందించాలని నిర్ణయించుకున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. ఒకవేళ ఇదే కనుక నిజమైతే కనుక మిడ్ రేంజ్ బడ్జెట్ లో ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ కొనేవారి ఆప్షన్ ఐఫోన్ ఎస్ఈ 4 ఫోన్ అవుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి ఉండదేమో.