వేసవి కోసం చల్లని వార్త.. రూ.3500లకే పోర్టబుల్‌ మినీ AC

Portable AC: వేసవిలో మీకోసం ఓ చల్లని వార్త.. ఎక్కడికైనా తీసుకెళ్లగలిగే మినీ ఏసీ వచ్చేసింది. మీ కోసం ఆ వివరాలు..

Portable AC: వేసవిలో మీకోసం ఓ చల్లని వార్త.. ఎక్కడికైనా తీసుకెళ్లగలిగే మినీ ఏసీ వచ్చేసింది. మీ కోసం ఆ వివరాలు..

ఫిబ్రవరి ఇంకా పూర్తి కాలేదు.. శివరాత్రి రాలేదు.. కానీ అప్పుడే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 11 గంటల నుంచే విపరీతమైన వేడి. సాధారణంగా మార్చి నెలాఖరు నుంచి ఎండలు పెరిగిపోతాయి. కానీ ఈ ఏడాది మాత్రం ఫిబ్రవరిలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఫ్యాన్‌, కూలర్‌ గాలి చాలడం లేదు. చాలా మంది ఏసీలు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. దాంతో చాలా కంపెనీలు ఏసీల మీద డిస్కౌంట్‌ ఆఫర్‌ ప్రకటిస్తున్నాయి.

ఇంట్లో ఉన్నప్పుడు ఏసీ, కూలర్‌ ఉంటుంది కాబట్టి ఓకే.. మరి ఎక్కడికైనా ప్రయాణాలు చేయాల్సి వస్తే.. అసలే వేసవిలో కరెంటు కోతలు ఎక్కువ. మరి అప్పుడు. ఇదుగో ఇలాంటి సమస్యలకు పరిష్కారే ఈ పోర్టబుల్‌ మిని ఏసీ. దీన్ని ఎక్కడికి అంటే అక్కడికి తీసుకెళ్లొచ్చు.. పైగా కరెంట్‌తో పని లేదు. మరి మీరు కూడా దీనిపై ఓ లుక్కేయండి.

సాధారణంగా ఏసీ, కూలర్‌ ధరలు ఎక్కువగానే ఉంటాయి. తక్కువలో తక్కువ 25-30 వేల రూపాయలు ఖర్చు చేయంది ఏసీ రాదు. కూలర్లకు కూడా బాగానే ధర ఉంటుంది. అయితే ఇవి కేవలం ఇంటికే పరిమితం. ఇక వేసవిలో ఎక్కడికైనా ప్రయాణాలు చేయాల్సి వస్తే.. మండే ఎండలో జర్నీ ఎంత నరకంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటి సందర్భాల్లో ఈ పోర్టబుల్‌ మినీ ఏసీ మీ దగ్గర ఉంటే కూల్‌గా ఎంజాయ్‌ చేయవచ్చు. పైగా ధర కూడా చాలా తక్కువ. 3,500 రూపాయలలోపే ఈ ఏసీ కొనుగోలు చేయవచ్చు.

కేవలం 610 గ్రాముల బరువు ఉండే ఈ పోర్టబుల్ ఏసీని.. మనం ఈజీగా ఒక చోట నుంచి ఇంకో చోటకు తీసుకెళ్లవచ్చు. స్టడీ రూమ్, ఆఫీస్, లేదా బయటకు ఎక్కడికైనా పిక్నిక్‌కి వెళ్లేటప్పుడు.. ఇలా ఎక్కడైకైనా సరే ఈ పోర్టబుల్‌ మిని ఏసీని తీసుకెళ్లవచ్చు. దీనిలో 2000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. ఇది ఒక్కసారి ఖాళీ అయితే.. 3 గంటల పాటు చార్జింగ్ అవుతుంది. అలాగే ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 4 గంటల పాటు చల్లటి గాలిని అందిస్తుంది. ఇక ఈ ఛార్జ్ కోసం 9 వోల్ట్‌ల కరెంట్ వినియోగం అవుతుంది. ఇక ఈ పోర్టబుల్ ఏసీ ధర రూ. 3 వేల నుంచి 3,500 మధ్య ఉంది.

ఈ మినీ ఏసీని కొనాలంటే ఇక్కడ క్లిక్‌ చేయండి.

Show comments