iDreamPost
android-app
ios-app

యాపిల్, మైక్రోసాఫ్ట్ సంస్థలని కోలుకోలేని దెబ్బ కొట్టిన అతి చిన్న కంపెనీ!

Company Beats Apple, Microsoft: గత కొన్నేళ్లుగా అయితే యాపిల్, లేదా మైక్రోసాఫ్ట్.. ఈ రెండే కంపెనీలు పోటీ పడుతున్నాయి. తమ మధ్య మూడో కంపెనీ రానివ్వకుండా రేసులో ముందుంటున్నారు. అయితే తాజాగా ఓ కంపెనీ ఈ రెండు కంపెనీలకు బిగ్ షాక్ ఇచ్చింది.

Company Beats Apple, Microsoft: గత కొన్నేళ్లుగా అయితే యాపిల్, లేదా మైక్రోసాఫ్ట్.. ఈ రెండే కంపెనీలు పోటీ పడుతున్నాయి. తమ మధ్య మూడో కంపెనీ రానివ్వకుండా రేసులో ముందుంటున్నారు. అయితే తాజాగా ఓ కంపెనీ ఈ రెండు కంపెనీలకు బిగ్ షాక్ ఇచ్చింది.

యాపిల్, మైక్రోసాఫ్ట్ సంస్థలని కోలుకోలేని దెబ్బ కొట్టిన అతి చిన్న కంపెనీ!

యాపిల్, మైక్రోసాఫ్ట్.. ఈ రెండు కంపెనీలు ప్రపంచంలోనే దిగ్గజ కంపెనీలుగా ఉన్నాయి. ఈ రెండు కంపెనీలు ఒకదానితో ఒకటి పోటీ పడుతుంటాయి. మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ ఆధారిత సాఫ్ట్ వేర్లను, పరికరాలను డెవలప్ చేస్తే.. యాపిల్ కంపెనీ ఐఓఎస్ ఆధారిత పరికరాలను, సాఫ్ట్ వేర్లను తయారుచేస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ రెండిటి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. కాగా ఇప్పుడు మరొక కంపెనీ రేసులోకి వచ్చింది. ఈ రెండు కంపెనీలతో ఢీకొట్టడమే కాకుండా వీటిని వెనక్కి నెట్టి మరీ నంబర్ వన్ గా అవతరించింది. టెక్ దిగ్గజ కంపెనీలైన యాపిల్, మైక్రోసాఫ్ట్ లను అధిగమించి వరల్డ్ లోనే అత్యంత విలువైన కంపెనీగా నిలిచింది. ఒకప్పుడు చిన్న కంపెనీగా ఉండేది.

ఆ కంపెనీ మరేదో కాదు.. ఎన్విడియా అనే సెమీ కండక్టర్ చిప్ ల తయారీ సంస్థ. జూన్ 18వ తేదీన ఈ కంపెనీ షేర్లు 3.5 శాతం మేర పెరిగాయి. దీంతో ఆ కంపెనీ మార్కెట్ విలువ 3.325 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. మన కరెన్సీ ప్రకారం దాదాపు 276 లక్షల కోట్లు. మైక్రోసాఫ్ట్ మార్కెట్ విలువ 3.323 ట్రిలియన్ డాలర్లు కాగా.. యాపిల్ కంపెనీ మార్కెట్ విలువ 3.281 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. ఐదేళ్ల క్రితం ఈ ఎన్విడియా కంపెనీ టాప్ 20 జాబితాలో కూడా లేదు. అలాంటిది ఇప్పుడు ఏకంగా నంబర్ వన్ స్థానానికి ఎగబాకింది. ప్రస్తుతం అమెరికాలో అతి పెద్ద కంపెనీగా అవతరించింది. ఒక రకంగా కొన్ని సంవత్సరాలుగా నంబర్ వన్, నంబర్ 2 స్థానాల్లో పాతుకుపోయిన యాపిల్, మైక్రోసాఫ్ట్ పునాదులను కదిలించినట్టే అయ్యింది.

ఇది నిజంగా దిగ్గజ కంపెనీలకి కోలుకోలేని దెబ్బ. ఈ దెబ్బతో నంబర్ వన్ పొజిషన్ కోసం పోటీ పడుతున్న యాపిల్, మైక్రోసాఫ్ట్ కంపెనీలను ఎన్విడియా కంపెనీ వెనక్కి నెట్టేసింది. అంతకు ముందు అంటే జూన్ 5న తన మార్కెట్ పెరుగుదలతో యాపిల్ కంపెనీని అధిగమించి ప్రపంచంలో అత్యంత విలువైన రెండో కంపెనీగా ఎన్విడియా కంపెనీ అవతరించింది. తాజాగా మైక్రోసాఫ్ట్ ని వెనక్కి నెట్టి నంబర్ వన్ స్థానంలో కొనసాగుతుంది.

Nivida company beat apple and microsoft company

ఇక ఎన్విడియా కంపెనీ.. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ కంప్యూటింగ్ లో వరల్డ్ లీడర్ గా ఉంది. గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ (జీపీయూ)ని ఆవిష్కరించింది. అలానే ఏఐ, హెచ్పీసీ, గేమింగ్, క్రియేటివ్ డిజైన్, అటానమస్ వెహికల్స్, రోబోటిక్స్ వంటి వాటిలో పురోగతిని సాధించింది. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ కి కావాల్సిన చిప్ లను తయారు చేస్తుంది. జీఈ ఫోర్స్ గ్రాఫిక్ కార్డ్స్, ల్యాప్ టాప్స్, జీ-సింక్ మానిటర్లు వంటి గేమింగ్ పరికరాలను తయారు చేస్తుంది. అలానే ల్యాప్ టాప్స్, వర్క్ స్టేషన్స్ ని కూడా తయారు చేస్తుంది. గత కొన్నేళ్లుగా ఎన్విడియా కంపెనీ ఉత్పత్తులకు డిమాండ్ పెరగడంతో అమ్మకాలు పెరిగి లాభాల బాటలో దూసుకుపోతుంది. 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి