స్మార్ట్ ఫోన్ యూజర్స్‌కి హెచ్చరిక.. వారానికొకసారి రీస్టార్ట్ చేయకపోతే భారీ నష్టం!

Warning To Smartphone Users: ఐఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్ వాడే వారికి హెచ్చరిక. వారానికొకసారి అయినా ఫోన్ రీస్టార్ట్ చేయకపోతే ప్రమాదం తప్పదు. ఖచ్చితంగా వారానికి ఒకసారి అయినా ఫోన్ రీస్టార్ట్ చేయాల్సిందే అని ఎన్ఎస్ఏ హెచ్చరించింది.  

Warning To Smartphone Users: ఐఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్ వాడే వారికి హెచ్చరిక. వారానికొకసారి అయినా ఫోన్ రీస్టార్ట్ చేయకపోతే ప్రమాదం తప్పదు. ఖచ్చితంగా వారానికి ఒకసారి అయినా ఫోన్ రీస్టార్ట్ చేయాల్సిందే అని ఎన్ఎస్ఏ హెచ్చరించింది.  

ఐఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్లు వాడే వారికి యూఎస్ నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ హెచ్చరికలు జారీ చేసింది. ఎడ్వర్డ్ స్నోడెన్ సంస్థ ఆరోపించినట్లు.. ప్రజల మీద, రాజకీయ నాయకుల మీద కొంతమంది వ్యక్తులు నిఘా ఉంచుతున్నారని.. కాబట్టి ఐఫోన్, ఆండ్రాయిడ్ యూజర్లు ప్రతి వారానికి ఒకసారి రీస్టార్ట్ చేయాలని ఎన్ఎస్ఏ హెచ్చరించింది. వ్యక్తిగత మరియు సున్నితమైన సమాచారం, నగదు సంబంధిత సమాచారం, వ్యక్తిగత ఫోటోలు స్టోర్ చేసుకోవడం, ఈమెయిల్స్, పలు ఆన్ లైన్ అకౌంట్స్ కలిగి ఉండడం వంటి కారణాల వల్ల మొబైల్ ఫోన్స్ అనేవి హ్యాకర్స్ కి ప్రధాన టార్గెట్ గా మారిపోయాయి. మొబైల్ ఫోన్ భద్రతలో కూడా కేవలం సెక్యూరిటీ లాక్ పేటర్న్, పాస్వర్డ్ వంటి బేసిక్ మెజర్స్ తో లిమిట్ అయి ఉన్న కారణంగా సైబర్ ఎటాక్స్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.

ఈ కాంబినేషన్ హై వేల్యూ డేటా, బలహీన సెక్యూరిటీ మెజర్స్ అనేవి మొబైల్ ఫోన్లు అనేవి హ్యాకర్స్ దృష్టిని ఈజీగా ఆకర్షిస్తాయి. హానికరమైన యాప్ ల నుంచి బ్యాంకింగ్ ట్రోజన్లు, స్పైవేర్ వరకూ హ్యాకర్లు పలు రకాల టూల్స్, టెక్నిక్స్, అండ్ టాక్టిక్స్ కలిగి ఉన్నారు. అందుకే ఇలాంటి సైబర్ దాడుల నుంచి, స్కామ్స్ నుంచి అప్రమత్తంగా ఉండడం చాలా కీలకం. కాబట్టి ఐఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్లు వాడే వినియోగదారులు.. వారానికి ఒకసారి అయినా ఫోన్లను రీస్టార్ట్ చేయాల్సిందిగా ఎన్ఎస్ఏ సూచిస్తుంది. ఇలా ఫోన్ ని స్విచ్చాఫ్ చేసి స్విచ్ ఆన్ చేయడం వల్ల స్కామర్ల బెదిరింపులకు అంతరాయం కలిగించవచ్చునని, హ్యాకర్లకి ఫోన్ లోకి చొరబడకుండా ఆపవచ్చునని చెబుతుంది.

ఫోన్ రీస్టార్ట్ చేయడం వల్ల భద్రత ఎలా వస్తుంది?

  • ఫోన్ ని రీస్టార్ట్ చేయడం వల్ల బ్యాక్ గ్రౌండ్ లో మనకి తెలియకుండా రన్నింగ్ లో ఉన్న మాల్వేర్ కి అంతరాయం ఏర్పడుతుంది. హాని చేయడాన్ని నిరోధిస్తుంది. 
  • ఫోన్ రీస్టార్ట్ చేయడం వల్ల టెంపరరీ డేటా అనేది క్లియర్ అవుతుంది. టెంపరరీ ఫైల్స్, హ్యాకర్లు దోపిడీ చేయాలనుకున్న డేటా తొలగిపోతాయి. దీని వల్ల హ్యాకర్ పని కష్టమవుతుంది. 
  • రీస్టార్ట్ చేయడం వల్ల ఫోన్ అనేది రిఫ్రెష్ అవుతుంది. రీస్టార్ట్ అనేది సెక్యూరిటీ అప్ డేట్స్, సిస్టం ప్యాచెస్ ని సమర్థవంతంగా వర్తింపజేయడంలో సహాయపడుతుంది. 

 కాబట్టి ఆండ్రాయిడ్, ఐఫోన్లు వాడేవారు వారానికి ఒకసారైనా ఫోన్ ని రీస్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది. దీని వల్ల ఫోన్ హ్యాకింగ్ కి గురయ్యే అవకాశాలు తగ్గుతాయి. మీ వ్యక్తిగత డేటా అనేది సురక్షితంగా ఉంటుంది.

Show comments