P Venkatesh
స్మార్ట్ వాచ్ ప్రియులకు మరో కొత్త స్మార్ట్ వాచ్ అందుబాటులోకి వచ్చింది. క్రేజీ ఫీచర్లు, 7 రోజుల బ్యాటరీ లైఫ్ తో వస్తున్న ఈ స్మార్ట్ వాచ్ జూన్ 7 నుంచి సేల్ ప్రారంభంకానుంది.
స్మార్ట్ వాచ్ ప్రియులకు మరో కొత్త స్మార్ట్ వాచ్ అందుబాటులోకి వచ్చింది. క్రేజీ ఫీచర్లు, 7 రోజుల బ్యాటరీ లైఫ్ తో వస్తున్న ఈ స్మార్ట్ వాచ్ జూన్ 7 నుంచి సేల్ ప్రారంభంకానుంది.
P Venkatesh
ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కు ఆదరణ పెరుగుతోంది. స్మార్ట్ ఫోన్ వినియోగం పెరిగాక సరికొత్త గాడ్జెట్స్ మార్కెట్ లోకి వచ్చాయి. ఈ మధ్యకాలంలో స్మార్ట్ వాచ్ లను వినియోగించే వారు ఎక్కువైపోయారు. లుక్ కోసం యూత్ స్మార్ట్ వాచ్ లను ఉపయోగిస్తున్నారు. హెల్త్ కు సంబంధించిన సమాచారం కూడా తెలుసుకునే వెసులుబాటు ఉండడంతో పెద్ద వాళ్లు కూడా స్మార్ట్ వాచ్ లను వాడుతున్నారు. కాగా ప్రముఖ ఎలక్ట్రానిక్ గాడ్జెట్ సంస్థలు అద్భుతమైన ఫీచర్లు, డిజైన్ తో స్మార్ట్ వాచ్ లను రూపొందించి మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి. స్మార్ట్ వాచ్ లవర్స్ కు మరో కొత్త స్మార్ట్ వాచ్ అందుబాటులోకి వచ్చింది. గ్యాడ్జెట్స్ తయారీ సంస్థ నాయిస్ ఇండియా నాయిస్ ఫిట్ ఆరిజిన్ అనే కొత్త స్మార్ట్‌వాచ్ ను మార్కెట్లోకి విడుదల చేసింది.
మీరు ఈ మధ్యకాలంలో కొత్త స్మార్ట్ వాచ్ ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే నాయిస్ ఇండియా న్యూ స్మార్ట్ వాచ్ ను రిలీజ్ చేసింది. నాయిస్‌ఫిట్ ఆరిజిన్ స్మార్ట్ వాచ్ యూజర్లను ఆకట్టుకుంటోంది. నాయిస్‌ఫిట్ ఆరిజిన్ స్మార్ట్‌వాచ్ జెట్ బ్లాక్, సిల్వర్ గ్రే, మిడ్‌నైట్ బ్లాక్, మొజాక్ బ్లూ, క్లాసిక్ బ్లాక్, క్లాసిక్ బ్రౌన్ రంగుల్లో అందుబాటులో ఉంది. దీని ధర రూ.6,500గా కంపెనీ నిర్ణయించింది. గోనాయిస్.కామ్ సహా క్రోమా స్టోర్లలో, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ లలో కొనుగోలు చేయొచ్చు. జూన్ 7 నుంచి సేల్ ప్రారంభంకానుంది.
నాయిస్ ఫిట్ ఆరిజిన్ స్మార్ట్ వాచ్ లో క్రేజీ ఫీచర్లు అందించారు. బీపీ, హార్ట్‌రేట్, బ్లడ్ ఆక్సిజన్ లెవెల్, ఫీమేల్ సైకిల్, స్లీప్, స్ట్రెస్ ట్రాకర్లు సహా ఆరోగ్యాన్ని పర్యవేక్షించే ఫీచర్లను కలిగి ఉంది. ఈ స్మార్ట్ వాచ్ లో 1.46 అంగుళాల అపెక్స్‌విజన్ అమోలెడ్ డిస్‌ప్లేను అమర్చారు. 600 నిట్‌ల బ్రైట్ నెస్ తో వస్తుంది. ఈఎన్ 1 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. నెబ్యులా యూఐతో వస్తోంది. చేతిని తిప్పడం ద్వారా కాల్స్‌ను మ్యూట్ చేసే ఆప్షన్‌ను ఇచ్చారు. బ్లూటూత్ 5.3 కనెక్టివిటీ ఉంది. బ్యాటరీ లైఫ్‌టైమ్ ఏడు రోజుల వరకు ఉంటుందని కంపెనీ వెల్లడించింది. ఈ స్మార్ట్‌వాచ్ 100కి పైగా స్పోర్ట్స్ మోడ్‌లకు సపోర్ట్ చేస్తుంది.