వాట్సాప్ లో అతిపెద్ద సమస్యకి చెక్! ఇక లవర్స్ సేఫ్ అబ్బా!

వాట్సాప్ లో అతిపెద్ద సమస్యకి చెక్! ఇక లవర్స్ సేఫ్ అబ్బా!

ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల కొద్దీ యూజర్స్ వినియోగిస్తున్న వాట్సాప్ యాప్ లో ఎప్పటికప్పుడు వినియోగదారులకు కొత్త అనుభూతిని కలిగించేలా కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్ అనేది ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది.

ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల కొద్దీ యూజర్స్ వినియోగిస్తున్న వాట్సాప్ యాప్ లో ఎప్పటికప్పుడు వినియోగదారులకు కొత్త అనుభూతిని కలిగించేలా కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్ అనేది ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది.

నేటి కాలంలో వాట్పాప్ వినియోగించని వారంటూ ఎవరూ లేరు. ప్రతిఒక్కరి దగ్గర ఈ వాట్సాప్ యాప్ అనేది కచ్చితంగా ఉంటుంది. ఇక ఈ వాట్సాప్ లో పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు వాయిస్ కాల్స్, మెసేజ్, స్టేటస్ లంటూ ఏ విధంగా వినియోగిస్తారో అందరికీ తెలిసిందే. అయితే ఈ వాట్సాప్ యాప్ లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి .ముఖ్యంగా సరికొత్త ఫీచర్స్ తో దీనిని యూజర్స్ ఎప్పటికప్పుడు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. కాగా, ఇప్పటికే వాట్సాప్ లో ఆల్బమ్ పికర్ ఫీచర్స్, ఏఆర్ ఫీచర్, రిప్లై బార్ ఫీచర్, ఏఐ ఫీచర్ వంటివి అందుబాటులోకి తీసుకొస్తూ వినియోగదారులకు కొత్త అనుభూతిని అందిస్తున్న విషయం తెలసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఇప్పుడు మరో కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇంతకీ అదేమిటంటే..

ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల కొద్దీ యూజర్స్ వినియోగిస్తున్న వాట్సాప్ యాప్ లో ఎప్పటికప్పుడు వినియోగదారుల భద్రత, కన్వీనియెన్స్ మేరకు కొత్త కొత్త ఫీచర్లు అందుబాటులోకి తీసుకొస్తుంటారు. ఈ క్రమంలోనే.. వాట్సాప్ యూజర్స్ కూడా యాప్ లో కొత్త మార్పులు, చేర్పులు చేస్తూ అప్ డేట్ చేస్తుంటారు. మరీ అటువంటి వారి కోసం ఇటీవల కాలంలో వాట్సాప్ ప్రైవేసీ బేస్డ్ ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చిన  విషయం తెలసిందే. ఇక ఇందులో ప్రైవేట్ చాట్ యాప్ లాక్ వంటి ఫీచర్లును కూడా తీసుకొచ్చింది. అయితే తాజాగా ఇప్పుడు ఆన్ లైన్ స్టేటస్  ‘హైడింగ్ ఫీచర్’ ను అందుబాటులోకి తెస్తుంది. కాగా, ఈ ఫీచర్ కు సంబంధించి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా ఎవరైనా ఆన్ లైన్ లో ఉన్నప్పుడు వారి వాట్సాప్ కు చివరిసారిగా ఎప్పుడు వస్తున్నారు, ఎప్పుడు ఆన్ లైన్ లో ఉంటున్నారు వంటి ప్రతి స్టేటస్ అందరికీ తెలుస్తోంది. దీని వల్ల ఆన్ లైన్ లో ఉన్న ఏ మెసేజ్ లు చూడటం లేదు, రిప్లై ఇవ్వడం లేదని, లేట్ నైట్ వరకు వాట్సాప్ లో ఉంటున్నారని రకరకాలుగా చాలామంది ఫ్రెండ్స్, రిలటివ్స్ అనుకుంటున్నారు. ముఖ్యంగా లవర్స్ విషయానికొస్తే.. ఇది చాలా పెద్ద సమస్య అన్ లైన్ స్టేటస్ షోయింగ్ అనేది పెద్ద సమస్య అనే చెప్పవచ్చు. ఎందుకంటే.. దీని వల్ల  చాలామంది లవర్స్ మధ్య గొడవలు కూడా వస్తున్నాయి.  ఇలా ఎన్నో   ఇబ్బుందులను  ఎదుర్కొవలసి వస్తుంది. మరీ అలాంటి వారి కోసం వాట్సాప్..   వినియోగదారుల గోప్యతను గౌరవించడానికి, చివరిసారిగా  వారు వాట్సాప్ లో ఉన్న ఆన్ లైన్ స్టేటస్ ను దాచడానికి ఈ హైడింగ్ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

అయితే ఇప్పటి వరకు ఈ హైడింగ్ ఫీచర్ అనేది వాట్సాప్ స్టేటస్ లకు, లాస్ట్ సీన్స్ కు మాత్రమే ఉండేది. కానీ, ఇప్పుడు మాత్రం ఎప్పుడు అన్ లైన్ కు వస్తున్నారు, అసలు అన్ లైన్ లో ఉన్నారా, లేదా అనే విషయాలకు చెక్ పెట్టేలా ఈ కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ ఫీచర్ వలన వాట్సాప్ యూజర్స్ తమ ప్రైవసీని భద్రపరచడానికి వారి ఆన్‌లైన్ స్టేటస్ ను ఇతరులకు కనిపించకుండా దాచడానికి చక్కగా ఉపాయోగపడుతుంది. ముఖ్యంగా లవర్స్ కు ఈ ఫీచర్ తో ఈ సమస్యలకు చెక్ పెట్టవచ్చు. మరీ, ఈ ఫీచర్ ను మీ ఫోన్ లో ఎలా సెట్టింగ్స్ మార్చుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా మీ ఫోన్ లోని  వాట్సాప్ యాప్ లో మీరు ఎంచుకున్న ఆప్షన్ ప్రకారం.. మీ ఆన్ లైన్ స్టేటస్ ఉంటుంది. ఉదాహరణకు Nobody అనే ఆప్షన్ ను ఎంచుకుంటే మీ ఆన్ లైన్ స్టేటస్ ఎవరికీ కనిపించదు. దీంతోపాటు పెరుగుతున్న వాట్సాప్ యూజర్ ల సంఖ్యను దృష్టిలో పెట్టుకొని కంపెనీ యాప్, వెబ్ సైట్ రెండింటికీ సెక్యూరిటీ,ప్రైవసీ ఫీచర్లను పరిచయం చేసింది. కనుక ఇక నుంచి వాట్సాప్ వినియోగదారులు వారి స్టేటస్ ను ఇతరలకు కనిపించకుండా దాచవచ్చు. అలాగే ఆన్ లైన్ స్టేటస్ ను కూడా ప్రైవసీలో లో ఉండే ఫీచర్లు బట్టి దాచవచ్చు. అలాగే చాల్ లాక్ చేయవచ్చు. ఇక ఎంపిక చేసిన కాంటాక్ట్, ఫ్రెండ్స్ కు మాత్రమే మీ ఆన్ లైన్ స్టేటస్ కనిపించేలా సెట్ చేసుకోవచ్చు.

Show comments