చెక్కతో చేసిన స్మార్ట్ ఫోన్.. ఒక్కో ఫీచర్‌కి మైండ్ పోతుంది.. ధర ఎంతంటే?

1st Wooden Smartphone: స్మార్ట్ ఫోన్ అంటే మెటల్ తో తయారు చేస్తారు. కానీ చెక్కతో చేయడం అనేది ఎక్కడా ఉండదు. కానీ ఓ ప్రముఖ కంపెనీ చెక్కతో చేసిన స్మార్ట్ ఫోన్ ని తీసుకొచ్చింది. అందులో ప్లాస్టిక్ వంటివి కలపకుండా ప్యూర్ చెక్కతో చేయడం విశేషం.

1st Wooden Smartphone: స్మార్ట్ ఫోన్ అంటే మెటల్ తో తయారు చేస్తారు. కానీ చెక్కతో చేయడం అనేది ఎక్కడా ఉండదు. కానీ ఓ ప్రముఖ కంపెనీ చెక్కతో చేసిన స్మార్ట్ ఫోన్ ని తీసుకొచ్చింది. అందులో ప్లాస్టిక్ వంటివి కలపకుండా ప్యూర్ చెక్కతో చేయడం విశేషం.

మోటరోలా ఎడ్జ్ 50 అల్ట్రా ఫోన్ భారత మార్కెట్లో లాంఛ్ అయ్యింది. అనేక మార్పులతో ఈ సరికొత్త మోడల్ ని మోటోరోలా కంపెనీ లాంఛ్ చేసింది. ప్రీమియం ఆండ్రాయిడ్ కెమెరా స్మార్ట్ ఫోన్ విత్ బెస్ట్ ఆడియో క్వాలిటీ ఫోన్ గా ఈ ఫోన్ ని లాంఛ్ చేసింది కంపెనీ. చూడ్డానికి చాలా ప్రీమియంగా అనిపిస్తుంది. అల్యూమినియం ఫ్రేమ్ తో.. ఫోన్ వెనుక భాగాన్ని చెక్కతో డిజైన్ చేశారు. ఎక్కడా కూడా ప్లాస్టిక్ ని వాడలేదు. ఇది మూడు రంగుల్లో వస్తుంది. ఫారెస్ట్ గ్రే, పీచ్ ఫజ్, నార్డిక్ వుడ్ రంగుల్లో వస్తుంది. నార్డిక్ ఉడ్ ఫోన్ ఉడ్ ఫినిష్ తో వస్తుంది. అయితే ఫారెస్ట్ గ్రే, పీచ్ ఫజ్ రంగు ఫోన్లు మాత్రం వేగన్ లెదర్ ఫినిష్ తో వస్తున్నాయి. దీని ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ మాత్రం అదిరిపోయాయి. 

స్పెసిఫికేషన్స్:  

6.7 అంగుళాల 1.5కే రిజల్యూషన్ తో (2712×1220) పీఓఎల్ఈడీ డిస్ప్లేతో వస్తుంది. 144 హెట్జ్ తో హెచ్డీఆర్ 10+, 10 బిట్, 2800 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ తో వస్తుంది. స్నాప్ డ్రాగన్ 8 ఎస్ జెన్ 3 ప్రాసెసర్ తో ఈ ఫోన్ ని తీసుకొచ్చారు.  ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టంతో వస్తుంది. 12 జీబీ ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ స్పేస్ తో వస్తుంది. ఇందులో నాలుగు  కెమెరాలు ఇచ్చారు. బ్యాక్ సైడ్ మూడు, ఫ్రంట్ సైడ్ ఒక కెమెరా ఉంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ ఓఐఎస్, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్+మ్యాక్రో, 3x టెలిఫోటో ఆప్టికల్ జూమ్, ఓఐఎస్ తో 64 మెగాపిక్సెల్ కెమెరా ఇస్తున్నారు. ఫ్రంట్ సైడ్ కూడా 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. 4500 ఎంఏహెచ్ బ్యాటరీతో 125 వాట్ టర్బో పవర్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. వైర్ లెస్ ఛార్జింగ్ ఆప్షన్ కూడా ఇచ్చారు. 50 వాట్ వైర్ లెస్ ఛార్జింగ్ ఆప్షన్ ఉంది. అలానే రివర్స్ ఛార్జింగ్ ఆప్షన్ కూడా ఉంది. అంటే ఒక ఫోన్ నుంచి మరొక ఫోన్ కి ఛార్జ్ చేసుకునేలా ఆప్షన్ ఇచ్చారు. ఇది  10 వాట్ వైర్ లెస్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఐపీ68 వాటర్, డస్ట్ రెసిస్టెంట్ గా వస్తుంది. 

ప్రత్యేకతలు:

ఇందులో సింక్ యువర్ స్టైల్ అనే ఫీచర్ ఇచ్చారు. ఇది మీరు వేసుకున్న దుస్తుల రంగుని బట్టి వాల్ పేపర్ ని సెట్ చేస్తుంది. మోటో ఏఐ పవర్డ్ కెమెరాలు ఈ ఫోన్ ప్రత్యేకతలు. ఇక స్మార్ట్ కనెక్ట్ అనే ఫీచర్ ఉంది. దీని ద్వారా మీరు ఈ ఫోన్ ని విండోస్ ల్యాప్ టాప్ కి కనెక్ట్ చేసుకోవచ్చు. దీని కోసం స్మార్ట్ కనెక్ట్ అనే యాప్ ని ల్యాప్ టాప్ లో ఇన్ స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనిలో ప్రత్యేకత ఏంటంటే.. ఫోన్ లో యాప్స్ ని ల్యాప్ టాప్ లోకి తీసుకురావాలంటే జస్ట్ కింద నుంచి పైకి స్వైప్ చేస్తే స్ట్రీమ్ యాప్ అని కనిపిస్తుంది. దాని మీద ట్యాప్ చేస్తే ఫోన్ లో ఉన్న యాప్ ల్యాప్ టాప్ లోకి వెళ్ళిపోతుంది. ఫోన్ లో లాగిన్ అయి ఉంటే ల్యాప్ టాప్ లో కూడా లాగిన్ అవుతుంది. ప్రత్యేకించి ల్యాప్ టాప్ లో లాగిన్ అవ్వాల్సిన పని లేదు.

షాపింగ్ యాప్స్, ఎంటర్టైన్మెంట్ యాప్స్ ఏవైనా గానీ ఫోన్ నుంచి ల్యాప్ టాప్ కి ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు. ఒకసారి ఛార్జ్ చేస్తే 40 గంటల వరకూ బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. 5 నిమిషాల్లో రోజుకి సరిపడా పవర్ బ్యాకప్ కోసం టర్బో పవర్ ఛార్జ్ ఆప్షన్ ఉంది. ఇందులో మ్యాజిక్ కాన్వాస్ ఒక ఏఐ ఫీచర్ ఉంది. మీరు ఇచ్చిన టెక్స్ట్ ఆధారంగా ఒక వాల్ పేపర్ ని జనరేట్ చేస్తుంది. ఈ ఫోన్ లో ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే.. కెమెరాలో ఏఐ యాక్షన్ షాట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ తో ఫాస్ట్ గా కదులుతున్నా కూడా మంచిగా ఫోటోలు తీయచ్చు. ఇలా ఈ ఫోన్ లో ఇలాంటి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. 

ధర:

దీని ధర విషయానికొస్తే.. అసలు ధర రూ. 59,999 కాగా.. ఆరంభ సేల్ లో భాగంగా రూ. 49,999గా ఉంది. ఫ్లిప్ కార్ట్ లో జూన్ 24 నుంచి అందుబాటులోకి రానున్నాయి. అలానే మోటోరోలా వెబ్ సైట్ లో, రిటైల్ స్టోర్స్ లో కూడా అందుబాటులోకి రానున్నాయి. ఫోన్ అయితే ప్రీమియం లుక్ లో ఉంది. కానీ సామాన్యులు భరించే బడ్జెట్ లో అయితే లేదు.

  • ఈ ఫోన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి. 
Show comments