Dharani
విదేశాల్లో చదివి.. అక్కడే మంచి జాబ్ తెచ్చుకోవాలని ఎందరో కలలు కంటారు. ఈ మహిళ మాత్రం అమెరికాలో జాబ్ వదిలేసి.. ఇండియా వచ్చి వ్యాపారం స్థాపించి.. సక్సెస్ అయ్యింది. ఆమె ప్రయాణం మీ కోసం
విదేశాల్లో చదివి.. అక్కడే మంచి జాబ్ తెచ్చుకోవాలని ఎందరో కలలు కంటారు. ఈ మహిళ మాత్రం అమెరికాలో జాబ్ వదిలేసి.. ఇండియా వచ్చి వ్యాపారం స్థాపించి.. సక్సెస్ అయ్యింది. ఆమె ప్రయాణం మీ కోసం
Dharani
సాధారణంగా మన దేశంలో యువత ఎక్కువగా ఎలా ఆలోచిస్తారంటే.. విదేశాలకు వెళ్లాలి.. ఉన్నత విద్య పూర్తి చేయాలి.. అక్కడే మంచి ఉద్యోగం సంపాదించి.. జీవితంలో సెటిల్ అవ్వాలనుకుంటారు. చాలా తక్కువ మంది మాత్రమే విదేశాల్లో మంచి కెరీర్ ను వదులుకుని.. ఇండియాకు తిరిగి వచ్చి.. ఇక్కడే కంపెనీలు, వ్యాపారం ప్రారంభించి.. తమతో పాటు మరి కొంత మందికి ఉపాధి కల్పిస్తారు. ఆ కోవకు చెందిన ఓ జంట గురించే ఇప్పుడు మనం చెప్పుకొబోతున్నాం.
సాధారణంగా బ్లూ టూత్ స్పీకర్స్, ఇయర్ బడ్స్, హెడ్ ఫోన్స్ వంటి వాటి పేరు చెప్పగానే ఎక్కువ మంది యాపిల్, బోట్ వంటి కంపెనీలు పేర్లు చెబుతారు. కానీ వీటి సరసన చేరిన మరో బ్రాండ్ కూడా ఉంది. అదే మివి(ఎంఐవీఐ). భారతదేశంలోనే తొలిసారి బ్లూటూత్ స్పీకర్స్, ఇయర్ బడ్స్, హెడ్ ఫోన్స్ తయారీని ప్రారంభించిన కంపెనీ. ఇక్కడ మరో ఆసక్తికర అంశం ఏంటంటే ఈ కంపెనీ ఇద్దరు భాగస్వాముల్లో ఒకరు మహిళ.. అందునా తెలుగామె కావడం మరింత గర్వకారణంగా మారింది. మరి ఇంతకు మివి కంపెనీని ఎవరు ప్రారంభించారు.. ప్రస్తుతం ఆ కంపెనీ ఏ స్థాయికి చేరుకుంది వంటి వివరాలు..
ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ మివిని 2015లో విశ్వనాథ్ కందుల, మిధుల దేవభక్తుని కలిసి స్థాపించారు. వీరిద్దరి పేర్లలోని తొలి అక్షరాలతో మివి అని కంపెనీ పేరు పెట్టారు. మిధుల ఈ కంపెనీ కో ఫౌండర్, సీఎంవోగా ఉన్నారు. అందరిలానే ఆమె కూడా ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లింది. అక్కడ డబుల్ మాస్టర్స్ చేసింది. మంచి కంపెనీలో హై ప్యాకేజీతో ఉద్యోగం కూడా వచ్చింది.
అంతా బాగుంది అన్నుకున్నప్పటికి ఏదో తెలియని లోటు ఆమెని వెంటాడేది. ఈ క్రమంలోనే ఆమెకు ఇండియా వెళ్లి ఏదైనా వ్యాపారం చేయాలని ఆలోచన వచ్చింది. అలా విశ్వనాథ్ తో కలిసి 2015లో మివి ఎలక్ట్రానిక్స్ కంపెంనీని ప్రారంభించింది. అప్పటికి వీరికి టెక్ రంగం గురించి ఎలాంటి అవగాహన లేదు. కేవలం వ్యాపారం చేయాలన్న ఆలోచన, ఉత్సాహం వారిని ముందడుగు వేసేలా చేసింది.
ప్రారంభంలో వీరు కూడా ఇతర ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్స్ మాదిరిగానే చైనా, వియాత్నం, ఇతర దేశాల నుంచి ఉత్పత్తులను దిగుమతి చేసుకుని.. వాటిని తమ కంపెనీ బ్రాండ్ పేరు మీదుగా విక్రయించేవారు. కానీ తర్వాత వారే సొంతంగా ఉత్పత్తి ప్రారంభించారు. హైదరాబాద్ లో లో వీరి కంపెనీ ఉంది. ఇప్పటికే మివి కంపెనీ టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్, నెక్ బ్యాండ్స్, బ్లూటూత్ స్పీకర్స్ తో పాటు ఇతర ఆడియో ఉత్పత్తులను తయారు చేస్తుంది.
దశాబ్దం క్రితం ఈ కంపెనీకి రోజుకు 20-30 ఆర్డర్స్ మాత్రమే వచ్చేవి. కానీ ఇప్పుడు రోజుకు వందల సంఖ్యలో ఆడియో పరికరాలను ఉత్పత్తి చేస్తు.. నమ్మకమైన బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక త్వరలోనే మివి నుంచి స్మార్ట్ వాచ్ తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నట్లు చెప్పుకొచ్చింది మిధుల. ఇక మరో ఆసక్తికర అంశం ఏంటంటే ఈ కంపెనీలో పని చేసే వారిలో 80 శాతం మందికి మహిళలే కావడం గమనార్హం.
ఈ సందర్భంగా మిధుల ఓ యూట్యూబ్ ఛానెల్ తో మాట్లాడతూ.. ఈ రంగంలోకి వచ్చాక.. కొన్ని రోజుల తర్వాత మాకు కావాల్సిన పరికరాలను ఇండియాలోనే తయారు చేస్తామంటే ముందు చాలా మంది నవ్వారు. వారిలో నేను కూడా ఉన్నాను. విశ్వనాథ్ నాతో ఈ ఐడియా చెప్పగానే నేను కూడా నవ్వాను. కానీ మేం కష్టాన్ని నమ్ముకుని ముందుకు సాగాం. అదే నేడు మమ్మల్ని ఈ స్థాయిలో నిలిపింది. ఇప్పుడు మా కంపెనీ టర్నోవర్ ఏడాదికి సుమారు 250కోట్ల రూపాయలు. మా నమ్మకమే మమ్మల్ని విజయం దిశగా నడిపించింది‘‘ అని చెప్పుకొచ్చింది మిధుల.