ఇన్నాళ్లు మీ ఫోన్‌లో కనిపించిన మెటా ఏఐ ఇప్పుడెందుకు కనిపించడం లేదంటే?

Previously Meta AI Available In Some WhatsApp Accounts But Now Not Available Why?: ఇన్ని రోజులు వాట్సాప్ లో చాట్స్ ట్యాబ్ లో మెటా ఏఐ నీలం రంగు రింగ్ కనబడేది. కానీ ఇప్పుడు అది కనిపించడం లేదు. అలానే వాట్సాప్ వెబ్ బ్రౌజర్ లో లాగిన్ అయితే మెటా ఏఐ చాట్ అనేది ఓపెన్ అవ్వడం లేదు. కొంతమంది వాట్సాప్ యూజర్లు ఈ సమస్యను ఫేస్ చేస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే?

Previously Meta AI Available In Some WhatsApp Accounts But Now Not Available Why?: ఇన్ని రోజులు వాట్సాప్ లో చాట్స్ ట్యాబ్ లో మెటా ఏఐ నీలం రంగు రింగ్ కనబడేది. కానీ ఇప్పుడు అది కనిపించడం లేదు. అలానే వాట్సాప్ వెబ్ బ్రౌజర్ లో లాగిన్ అయితే మెటా ఏఐ చాట్ అనేది ఓపెన్ అవ్వడం లేదు. కొంతమంది వాట్సాప్ యూజర్లు ఈ సమస్యను ఫేస్ చేస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే?

ప్రస్తుతం ఏఐ ట్రెండ్ నడుస్తోంది. యూజర్ ఎక్స్ పీరియన్స్ ని మెరుగుపరిచేందుకు ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ ఫీచర్స్ ని అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఇప్పటికే చాట్ జీపీటీ, జెమినీ ఏఐ, మెటా ఏఐ అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. అయితే మెటా ఏఐ ఇంకా డెవలపింగ్ దశలో ఉంది. అయినప్పటికీ కొంతమంది యూజర్స్ కి మెటా ఏఐ ఫీచర్స్ ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా ఏఐ ఇమేజెస్ ని జనరేట్ చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్, జాబ్, మెడిసిన్ ఇలా ఏ రంగానికి సంబంధించిన సందేహాలు ఉన్నా నివృత్తి చేసుకోవచ్చు. మ్యాథ్స్ కేలుక్యులేషన్స్, కంప్యూటర్ కోడింగ్, ఇమేజ్ టూ టెక్స్ట్ కన్వర్టర్, ఒక భాష నుంచి మరొక భాషలోకి టెక్స్ట్ ని అనువదించుకోవడం వంటి ఫీచర్స్ ఉన్నాయి. గూగుల్ లో సెర్చ్ చేసేవన్నీ ఇందులో సెర్చ్ చేయవచ్చు. ఏదైనా న్యూస్ నిజమో కాదో కూడా వెరిఫై చేసుకోవచ్చు. అయితే ఇన్ని రోజులు కొన్ని ఫోన్లలోని వాట్సాప్ లో అందుబాటులో ఉన్న మెటా ఏఐ ఫీచర్ ఇప్పుడు కనిపించడం లేదు.

మెటా ఏఐ నీలం రంగు వృత్తం ఒకటి చిన్న సైజులో చాట్స్ ట్యాబ్ లో కుడివైపున + ఐకాన్ మీద డిస్ప్లే అయ్యేది. దాన్ని క్లిక్ చేస్తే మెటా ఏఐతో చాట్ చేసేందుకు వీలయ్యేది. అయితే ఇప్పుడు అది ఆ నీలం రంగు వృత్తం కనిపించడం లేదు. వాట్సాప్ లోని సెర్చ్ లోకి వెళ్లి మెటా ఏఐ అని సెర్చ్ చేస్తే కనబడుతుంది. లేదా మీరు రీసెంట్ గా చాట్ చేసి ఉంటే చాట్స్ లో ప్రొఫైల్ కనబడుతుంది. అయితే వెబ్ బ్రౌజర్ లో వాట్సాప్ లాగిన్ అయినప్పుడు కూడా ఇన్ని రోజులు పైన ప్రొఫైల్ కి కుడివైపున రింగ్ కనబడేది. ఇప్పుడు ఆ రింగ్ కనిపించడం లేదు. ఫోన్ వాట్సాప్ లో చాట్ లిస్టులోకి వెళ్లి మెటా ఏఐ ఫీచర్స్ వాడుకుందామన్న వెబ్ వాట్సాప్ లో కుదరడం లేదు. సెర్చ్ లోకి వెళ్ళి మెటా ఏఐ అని టైప్ చేస్తుంటే కనబడుతుంది. కానీ చాట్ చేయడానికి వీలవ్వడం లేదు.

ఏఐ చాట్స్ మీకు ఇప్పుడు అందుబాటులో లేవు అని చెబుతుంది. వాట్సాప్ ని అప్డేట్ చేసినా కూడా ఇలానే చూపిస్తుంది. దీనికి గల కారణం ఏంటి అని మెటా ఏఐని అడగ్గా.. ప్రస్తుతం మెటా ఏఐ విస్తృతంగా అందుబాటులో లేదు. పరిమిత యూజర్స్ కి మాత్రమే అందుబాటులో ఉంది. అన్ని ప్రాంతాల్లో, అన్ని ఖాతాలకు అందుబాటులో లేదు. పాత వాట్సాప్ వెర్షన్ వాడే యూజర్లకు కూడా ఈ ఫీచర్ కనిపించకపోవచ్చు అని మెటా ఏఐ సమాధానమిచ్చింది. ఇంకేం కారణాలు ఉండచ్చు అని అడగ్గా.. తాత్కాలికంగా సాంకేతిక సమస్య అయి ఉండవచ్చునని లేదా మీ వాట్సాప్ ఖాతాలో మార్పులు చోటు చేసుకోవడం లేదా డివైజ్ సెట్టింగ్స్ లో మార్పులు జరిగి ఉండడం గానీ అయి ఉంటుందని వెల్లడించింది.

యాప్ ని గానీ ఫోన్ ని గానీ రీస్టార్ట్ చేస్తే మెటా ఏఐ ఫీచర్ కనబడుతుందని సమాధానం ఇచ్చింది. వాట్సాప్ అప్డేట్ చేసినా, రీస్టార్ట్ చేసినా.. ఫోన్ రీస్టార్ట్ చేసినా గానీ లాభం లేదు. ఫోన్ లో అంతకు ముందులా రింగ్ అయితే కనిపించడం లేదు. వెబ్ వాట్సాప్ లో మొత్తానికి అందుబాటులో లేదు. ఒకవేళ కంప్యూటర్ లో మెటా ఏఐని వాడుకోవాలంటే కనుక మెటా.ఏఐ వెబ్ సైట్ లోకి వెళ్లాల్సిందే. ఫోన్ లో అయితే సెర్చ్ చేసుకుని మెటా ఏఐ ఫీచర్ వాడుకోవాలి. మీకు రింగ్ కనిపించాలంటే మెటా ఏఐ సపోర్ట్ ని అడగవచ్చు. బహుశా ఇన్ని రోజులు ఇంతమంది యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉండేలా పరిమిత ఆంక్షలు పెట్టి ఉండవచ్చు. 

Show comments