SNP
Chennai, Agnikul, Agnibaan: చెన్నైలో స్థాపించిన ఒక స్పేస్ స్టార్ట్‌అప్ కంపెనీ తమ తొలి ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. ఈ ఘటన దేశ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోనుంది. దాని గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Chennai, Agnikul, Agnibaan: చెన్నైలో స్థాపించిన ఒక స్పేస్ స్టార్ట్‌అప్ కంపెనీ తమ తొలి ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. ఈ ఘటన దేశ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోనుంది. దాని గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
SNP
దేశం గర్వించేలా ఇండియాలో కొత్త చరిత్ర లిఖించడబడింది. దేశ చరిత్రలో తొలిసారి ఓ స్టార్టప్ స్పేస్ కంపెనీ రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. చెన్నైకి చెందిన ప్రైవేట్ స్పేస్ స్టార్టప్ ‘అగ్నికుల్ కాస్మోస్’ గురువారం ‘అగ్నిబాన్’ SOrTeD(సబోర్బిటల్ టెక్ డెమోన్‌స్ట్రేటర్) పేరుతో రాకెట్‌ను పరీక్షించింది. ఈ విషయాన్ని భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) కూడా ధృవీకరించింది. చెన్నైకి చెందిన స్టార్టప్ స్పేస్ కంపెనీ గురువారం ఉదయం 7.15 గంటలకు రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించిందని ఇస్రో ప్రకటించింది. ఈ ప్రయోగాన్ని శ్రీహరికోటలోని ప్రైవేట్ లాంచ్‌ప్యాడ్ నుంచి చేపట్టారు. ప్రయోగం విజయవంతం కావడంపై ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ రాకెట్‌లో సెమీ క్రయోజెనిక్ లిక్విడ్ ఇంజిన్‌ను ఉపయోగించారు. ఇలాంటి ఇంజెన్‌తో ఇప్పటి వరకు ఇస్రో ఉపయోగించలేదు. ఇప్పటికీ ఆ ఇంజన్‌తో ప్రయోగాలు చేసే ప్రయత్నంలోనే ఉంది. ‘శ్రీహరికోటలోని SDSC-SHARలోని మా స్వంత, భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ లాంచ్‌ప్యాడ్ నుంచి మా మొదటి ఫ్లైట్ మిషన్-01 అగ్నిబాన్ SOrTeD విజయవంతంగా పూర్తి అయినట్లు ప్రకటిస్తున్నాం. ఈ నియంత్రిత నిలువు ఆరోహణ ఫ్లైట్ అన్ని మిషన్ లక్ష్యాలు నెరవేరాయి. ప్రపంచంలోనే మొట్టమొదటి సింగిల్ పీస్ 3డీ ప్రింటెడ్ సెమీ క్రియో ఇంజన్‌తో రూపొందించిన మొట్టమొదటి రాకెట్ ఇదే అవుతుంది’ అని ఈ ప్రయోగం చేపట్టిన అగ్నికుల్ స్పేస్ స్టార్ట్‌అప్ కంపెనీ ప్రకటించింది. అగ్నిబాన్ SOrTeD సెమీ క్రయోజెనిక్ ఇంజిన్‌తో పనిచేస్తుంది, ఇది ఏవియేషన్ టర్బైన్ ఇంధనాన్ని, ముఖ్యంగా కిరోసిన్, మెడికల్ గ్రేడ్ లిక్విడ్ ఆక్సిజన్‌ను ఉపయోగించామని అగ్నికుల్ కాస్మోస్ ప్రైవేట్ లిమిటెడ్ సహ వ్యవస్థాపకుడు మొయిన్ ఎస్‌పీఎం తెలిపారు. 575 కిలోల బరువు, 6.2 మీటర్ల పొడవున్న ఈ రాకెట్ శ్రీహరికోట నుంచి లాంచ్ అయి బంగాళాఖాతంలో పడనట్లు వెల్లడించారు.
అగ్నికుల్ విశేషాలు..
చెన్నైకి చెందిన ఈ స్టార్ట్‌అప్ కంపెనీ.. గతంలో ఇలాంటి ప్రయోగాలు చేయాలని నాలుగు సార్లు ప్రయత్నించింది. కానీ, టెక్నికల్ సమస్యల కారణంగా తమ ప్రయోగాలను విరమించుకుంది. ఇప్పుడు ఐదో సారి ప్రయోగం చేపట్టి విజయవంతంగా ముగించి సక్సెస్ అయింది. ఈ కంపెనీని పెట్టాలని 2017లో ఇద్దరు యువ ఏరోస్పేస్ ఇంజనీర్లు సంకల్పించారు. ప్రస్తుతం ఈ కంపెనీలో 250 మంది పనిచేస్తున్నారు. ఈ స్టార్ట్‌అప్‌ను శ్రీనాథ్ రవిచంద్రన్, మొయిన్ ఎస్‌పీఎం, సత్యనారాయణ చక్రవర్తి, జనార్ధన రాజు కలిసి స్థాపించారు. ఈ సంస్థలో పనిచేసే ఉద్యోగుల సగటు వయసు 23 ఏళ్లు మాత్రమే. ఇప్పటికే ఈ కంపెనీకి 40 డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. మరి ఒక స్టార్ట్‌ఆప్ కంపెనీ తొలిసారి చేపట్టిన రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Humbled to announce the successful completion of our first flight – Mission 01 of Agnibaan SOrTeD – from our own and India’s first & only private Launchpad within SDSC-SHAR at Sriharikota. All the mission objectives of this controlled vertical ascent flight were met and… pic.twitter.com/9icDOWjdVC
— AgniKul Cosmos (@AgnikulCosmos) May 30, 2024