వీడియో: AI జనరేటెడ్ డీప్ ఫేక్ ఫొటోలను ఇలా ఈజీగా గుర్తించండి!

Awareness Of AI Generated Deepfake Photos: ప్రస్తుతం ఎక్కడ చూసినా డీప్ ఫేక్ వీడియోలు, ఫొటోలు, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ గురించే చర్చ జరుగుతోంది. ఇలాంటి తరుణంలో కేంద్రం ప్రజలకు ఈ టెక్నాలజీకి ఎలా చెక్ చెప్పాలి అవగాహన కల్పిస్తోంది.

Awareness Of AI Generated Deepfake Photos: ప్రస్తుతం ఎక్కడ చూసినా డీప్ ఫేక్ వీడియోలు, ఫొటోలు, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ గురించే చర్చ జరుగుతోంది. ఇలాంటి తరుణంలో కేంద్రం ప్రజలకు ఈ టెక్నాలజీకి ఎలా చెక్ చెప్పాలి అవగాహన కల్పిస్తోంది.

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెద్దఎత్తున చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. మనిషి మేధస్సును కంప్యూటర్ దాటేస్తుంది అంటూ చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. ఈ టెక్నాలజీతో మనిషి జీవితం ఎంతో సులువుగా మారిపోతుందని, టెక్నాలజీకొత్త పుంతలు తొక్కుతుందని చాలా మంది ఊదరగొడుతున్నారు. అయితే అదే సమయంలో అదే టెక్నాలజీ ఎంతో ప్రమాదకారిగా కూడా కనిపిస్తోంది. ముఖ్యంగా మహిళలు, యువతుల, స్త్రీలకు రక్షణ కరవు అవుతుందని హెచ్చరిస్తున్నారు. అందుకు ఈ ఏఐ డీప్ ఫేక్ ఫొటోలు, వీడియోలో కారణం. అయితే ఈ ట్రిక్స్ తో ఆ ఏఐ ఫొటోలను ఇట్టే కనిపెట్టవచ్చు.

ప్రస్తుతం అంతా ఈ డీప్ ఫేక్ టెక్నాలజీ గురించే మాట్లాడుతున్నారు. సామాన్యుస సంగతి పెక్కన పెడితే సెలబ్రిటీలే ఈ టెక్నాలజీకి బాధితులుగా మారిన విషయం తెలిసిందే. రష్మిక మందన్నా డీప్ ఫేక్ వీడియో దేశవ్యాప్తంగా అందరినీ కలవర పెట్టింది. నేరుగా కేంద్రం కూడా ఈ వీడియోపై స్పందించింది. ఒక్క రష్మికానే కాకుండా.. అమితాబ్ బచ్చన్, కత్రినా కైఫ్ వంటి ఎంతో సెలబ్రిటీలు ఈ టెక్నాలజీ బారిన పడ్డారు. వారి ముఖాలను పోలినట్లు కొన్ని ఫేక్ ఫొటోలు, వీడియోలు సృష్టించి వారిని డీ ఫేమ్ చేసే ప్రయత్నం చేశారు. అయితే ఇప్పుడు ఈ టెక్నాలజీకి సంబంధించి జాగ్రత్తగా ఉండాలంటూ కేంద్రం హెచ్చరిస్తోంది. అసలు ఈ ఏఐ డీప్ ఫేక్ ఫొటోలను ఎలా గుర్తించాలో చెబుతూ ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు.

ఈ డీప్ ఫేక్ ఫొటోలు చూడటానికి ఎంతో రియలిస్టిక్ గా ఉంటాయి. వారి పిక్స్ ఫేక్ చేస్తే.. వాళ్లు కూడా నమ్మలేని విధంగా ఆ ఫొటోలు ఉంటాయి. అది నేను కాదు అని గొంతుచించుకున్నా నమ్మే పరిస్థితి ఉండదు. ఈ ఆర్టిఫీషిటల్ టెక్నాలజీ వల్ల ఎన్నో ఇబ్బందులు, ప్రజలు తప్పుదోవ పట్టే విధంగా ఫొటోలు, వీడియోలు సృష్టిస్తున్నారు. అయితే సరిగ్గా గమనిస్తే ఆ ఫొటో రియలా? ఫేకా అనేది కచ్చితంగా చెప్పేచయచ్చు. అందుకు పెద్దగా టెక్నాలజీ కూడా అవసరం లేదు. నిశితంగా పరిశీలిస్తే సరిపోతుంది అంటూ కేంద్రం చెబుతోంది. అందుకు తగిన ఉదాహరణలతో ఒక షార్ట వీడియో విడుదల చేశారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ఫేక్ ఫొటోలు ఇలా గుర్తించండి?:

ఈ ఏఐ జనరేటెడ్ డీప్ ఫేక్ ఫొటోలు చూడటానికి ఎంతో పర్ఫెక్ట్ గా ఉంటాయి. కానీ, ఎంత పెద్ద క్రైమ్ చేసినా.. పక్డబందీగా చేసినా చిన్న క్లూ వదులుతారు అంటారు కదా? అలాగే ఈ టెక్నాలజీ కూడా చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటుంది. అవేంటంటే.. ఆ ఫొటోలు మరీ పర్ఫెక్ట్ గా ఉంటాయి. ముఖం, నవ్వు, ఆకారం అన్నీ ఎంతో పర్ఫెక్ట్ గా షార్ప్ గా ఉంటుంది. అలాగే అందులో ఉండే ఆబ్జెక్ట్స్ కాస్త భిన్నంగా ఉంటాయి. దుస్తులు కూడా ఎంతో బ్రైట్ గా, చాలా పర్ఫెక్షనిజం కనిపిస్తుంది. అయితే ఆ ఫొటోల్లో ఉండే నీడలు కాస్త భిన్నంగా ఉంటాయి.

ఆ ఫొటోలను నిశితంగా, పలు కోణాల్లో గమనిస్తే ఫేక్ ఫొటోలను ఇట్టే కనిపెట్టవచ్చు. ఫొటోలో ఉండే వ్యక్తులు వాడే వస్తువులు కాస్త వైవిధ్యంగా, నమ్మశక్యంగా లేకుండా ఉంటాయి. అలాగే వాస్తవానికి దూరంగా ఉంటాయి. అందుకే క్షుణ్ణంగా పరిశీలిస్తే దానిని కనిపెట్టవచ్చు. కేంద్రం కూడా ఈ డీప్ ఫేక్ టెక్నాలజీకి అడ్డుకట్ట వేసేందుకు కొత్త ఫ్రేమ్ వర్క్ ను రూపొందించనుంది. అందుకు సంబంధించి ప్రకటన కూడా చేసింది. ప్రస్తుతం జరుగుతున్న లోక్ సభ ఎన్నికల తర్వాత అది పట్టాలెక్కే అవకాశం ఉంది.

Show comments