iDreamPost

ఫోన్ ఛార్జర్ ల విషయంలో కేంద్రం న్యూ రూల్! కంపెనీలకి గట్టి షాక్!

మొబైల్ ఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్. ఫోన్ ఛార్జర్ ల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం. ఇక ఛార్జింగ్ సమస్యలకు చెక్ పడినట్టే. కేంద్రం నిర్ణయంతో మొబైల్ కంపెనీలకు గట్టి షాక్ తగలనున్నది.

మొబైల్ ఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్. ఫోన్ ఛార్జర్ ల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం. ఇక ఛార్జింగ్ సమస్యలకు చెక్ పడినట్టే. కేంద్రం నిర్ణయంతో మొబైల్ కంపెనీలకు గట్టి షాక్ తగలనున్నది.

ఫోన్ ఛార్జర్ ల విషయంలో కేంద్రం న్యూ రూల్!  కంపెనీలకి గట్టి షాక్!

ప్రస్తుత రోజుల్లో స్మార్మ్ ఫోన్ వినియోగం ఏ రేంజ్ లో ఉందో వేరే చెప్పక్కర్లేదు. చేతిలో ఫోన్ లేకుండా నిమిషం గడవని పరిస్థితి. పొద్దున నిద్ర లేచింది మొదలు మళ్లీ నిద్ర పోయేంత వరకు గంటలు గంటలు స్మార్ట్ ఫోన్ తో గడిపే వారే ఎక్కువ. మార్కెట్ లో రకరకాల బ్రాండ్ లకు చెందిన మొబైల్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. అయితే మొబైల్ ఫోన్లు అన్నింటికీ ఛార్జింగ్ పోర్ట్ ఒకేలా ఉండదనే విషయం తెలిసిందే. ఒక్కో ఫోన్ కు ఒక్కో రకమైన ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది. కొన్ని ఫోన్లకు యూఎస్బీ, మరికొన్ని ఫోన్లకు టైప్ సీ ఛార్జింగ్ పోర్ట్స్ ఉంటాయి. ఈ కారణంతో యూజర్లకు ఇది సమస్యగా మారింది. ఇప్పుడు తాజాగా కేంద్రం ఫోన్ ఛార్జర్ ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. మొబైల్ తయారీ కంపెనీలకు గట్టి షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తున్నది.

ఒక్కో బ్రాండ్ ఫోన్ కు ఒక్కో రకమైన ఛార్జింగ్ పోర్ట్ ఉండడం వల్ల యూజర్లకు ఛార్జింగ్ అంశం సమస్యగా మారింది. ఎక్కడికైనా వెళ్లినప్పుడు ఆ ఫోన్ కు సపోర్ట్ చేసే ఛార్జర్ లభించనప్పుడు ఛార్జర్ కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అదే ఒక వేళ అన్ని ఫోన్లకు ఒకేరకమైన ఛార్జింగ్ పోర్ట్ ఉంటే ఈ సమస్య అనేదే ఉండదు. దీనికి కేంద్రం త్వరలోనే పరిష్కారం చూపనున్నది. ఏ బ్రాండ్‌ ఫోన్‌ అయినా టైప్‌ సీ చార్జింగ్‌ పోర్ట్‌ మాత్రమే ఉండేలా కేంద్రం కొత్త మార్గదర్శకాలను అమలులోకి తీసుకురానున్నది. ఈ మేరకు వచ్చే ఏడాది జూన్‌ వరకు మొబైల్ కంపెనీలకు డెడ్‌లైన్‌ విధించనున్నట్టు సమాచారం. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం స్మార్ట్‌ఫోన్‌ కంపెనీలు అన్ని కొత్త ఉత్పత్తులను సీ టైప్‌ చార్జింగ్‌ పోర్ట్‌తో మాత్రమే తయారు చేయాల్సి ఉంటుంది.

Phoen charger

కేంద్రం తీసుకొచ్చే కొత్త రూల్ తో మొబైల్ యూజర్లకు ఛార్జింగ్ సమస్యలు తీరనున్నాయి. అంతే గాక ప్రస్తుతం ఒక్కో బ్రాండ్ కు చెందిన మొబైల్ ఛార్జ్ కు ధరలు వేర్వేరుగా ఉంటాయి. ధరలు కూడా ఎక్కువగా ఉండడంతో యూజర్లకు ఆర్థిక భారం కూడా అవుతున్నది. ఇప్పుడు అన్ని ఫోన్లకు ఒకే రకమైన ఛార్జింగ్ పోర్టు తీసుకు రావడం వల్ల ఛార్జర్ ల ధరలు సైతం తగ్గే అవకాశం ఉంటుంది. అయితే భారత్ లో అన్ని ఫోన్లకు ఒకే రకమైన ఛార్జింగ్ పోర్టు ఉండాలనే నిబంధనను 2026 మార్చి నుంచి అమలు చేయాలని భావించినప్పటికీ అది ఆచరణలోకి రాలేదు. తాజాగా ఈ గడువును జూన్ కు మార్చింది. 2026 చివరి నుంచి ల్యాప్‌టాప్‌లను కూడా సీ టైప్‌ చార్జింగ్‌ పోర్ట్‌తో తయారుచేసేలా నిబంధనను రూపొందించనుంది. కేంద్రం నిర్ణయంతో ఎలక్ట్రిక్ వ్యర్థాల సమస్య కూడా తీరనున్నది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి