P Venkatesh
మీరు ఈ మధ్యకాలంలో స్మార్ట్ వాచ్ కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే సూపర్ ఫీచర్లతో బోట్ నుంచి మరో స్మార్ట్ వాచ్ రిలీజ్ అయ్యింది. ఈ స్మార్ట్ వాచ్ ప్రారంభ ధర రూ.1099.
మీరు ఈ మధ్యకాలంలో స్మార్ట్ వాచ్ కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే సూపర్ ఫీచర్లతో బోట్ నుంచి మరో స్మార్ట్ వాచ్ రిలీజ్ అయ్యింది. ఈ స్మార్ట్ వాచ్ ప్రారంభ ధర రూ.1099.
P Venkatesh
ప్రస్తుత కాలంలో స్మార్ట్ వాచ్ ల వాడకానికి యువత తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కేవలం టైమ్ కోసమే కాకుండా ఫోన్ కాలింగ్, హెల్త్ ట్రాక్ ఇంక ఇతర ఫీచర్లు కలిగి ఉండడంతో స్మార్ట్ వాచ్ లకు డిమాండ్ పెరిగింది. మార్కెట్ లో పలు కంపెనీలకు చెందిన స్మార్ట్ వాచ్ లు అందుబాటులో ఉన్నాయి. లేటెస్ట్ వర్షన్ లతో అధునాతన టెక్నాలజీతో మార్కెట్ లోకి కొత్త స్మార్ట్ వాచ్ లు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో మరో స్మార్ట్ వాచ్ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. ఇయర్ ఫోన్స్, స్పీకర్లు, స్మార్ట్ వాచ్ ల తయారీ సంస్థ బోట్ తాజాగా బోట్ స్ట్రోమ్ కాల్ 3 పేరుతో స్మార్ట్‌వాచ్‌ను లాంచ్ చేసింది.
ఈ స్మార్ట్ వాచ్ 1.83 అంగుళాల దీర్ఘ చతురస్రాకార డిస్‌ప్లేను కలిగి ఉంది. దీంతోపాటు బ్లూటూత్ కాలింగ్, నావిగేషన్ సపోర్టును కలిగి ఉంది. 240*296 పిక్సల్ రిజల్యూషన్, 550 నిట్స్ బ్రైట్ నెస్ ను కలిగి ఉంది. ఈ స్మార్ట్ వాచ్ అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడేలా ఎస్ఓఎస్ మోడ్‌ను కలిగి ఉంది. ఎమర్జెన్సీ సమయాల్లో ముందస్తుగానే నమోదు చేసిన వ్యక్తుల ఫోన్ నంబర్లకు సమాచారం అందిస్తుంది. ఈ బోట్ కొత్త స్మార్ట్ వాచ్ 230ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంటుంది. సింగిల్ ఛార్జింగ్ తో 7 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ ఉంటుందని బోట్ వెల్లడించింది.
ఈ బోట్ స్ట్రోమ్ కాల్ 3 స్మార్ట్ వాచ్ అనేక హెల్త్ ట్రాకర్లను కలిగి ఉంటుంది. హార్ట్ రేట్, బ్లడ్ ఆక్సిజన్ మానిటర్, స్లీప్ సైకిల్ ట్రాకర్ వంటి అనేక ట్రాకర్లను కలిగి ఉంది. మరియు 700+ ప్రీ ఇన్ స్టాల్ట్ యాక్టివిటీ మోడ్‌లను కలిగి ఉంది. యాక్టివ్ బ్లాక్, చెర్రీ బ్లోసమ్, డార్క్ బ్లూ, ఓలివ్ గ్రీన్ మరియు సిల్వర్ మెటల్ వేరియంట్‌లలో లభిస్తోంది. స్మార్ట్‌వాచ్ ప్రారంభ ధర రూ.1099 కాగా.. సిల్వర్ మెటల్ వేరియంట్ ధర రూ.1249 గా ఉంది. మిగిలిన వేరియంట్ల ధరలు రూ.1,588, రూ.1,694 గా ఉంది.