Dharani
ఒకప్పడు కారు అంటే విలాసవంతమైన వస్తువుగా పరిగణించేవారు. మరి ఇప్పుడు అది కనీస అవసరంగా మారింది. మీరు కూడా కారు కొనాలని భావిస్తున్నారా.. అయితే మీ కోసం బెస్ట్ బడ్జెట్ కారును ఇప్పుడు పరిచయం చేయబోతున్నాం. నెలకు రూ.5 వేల ఈఎంఐతో ఈ కారును కొనుగోలు చేయవచ్చు. ఇంతకు ఆ కారేంది అంటే..
ఒకప్పడు కారు అంటే విలాసవంతమైన వస్తువుగా పరిగణించేవారు. మరి ఇప్పుడు అది కనీస అవసరంగా మారింది. మీరు కూడా కారు కొనాలని భావిస్తున్నారా.. అయితే మీ కోసం బెస్ట్ బడ్జెట్ కారును ఇప్పుడు పరిచయం చేయబోతున్నాం. నెలకు రూ.5 వేల ఈఎంఐతో ఈ కారును కొనుగోలు చేయవచ్చు. ఇంతకు ఆ కారేంది అంటే..
Dharani
ఒకప్పుడు సైకిల్ ఉండటమే చాలా గొప్ప అని భావించేవారు. ఆ తర్వాత రోజులు మారిన కొద్ది.. ఆదాయం పెరగడంతో పాటు.. మన జీవితంలోకి అనేక సౌకర్యాలు వచ్చి చేరుతున్నాయి. ఒకప్పుడు ప్రయాణం కోసం బస్సు ఎక్కితే.. చిన్న చిన్న అవసరాలకు దగ్గర దూరాలకు నడిచి వెళ్లేవారు. మరి ఇప్పుడో వీధి చివర ఉన్న దుకాణానికి వెళ్లాలన్నా.. బండి తీయాల్సిందే. అంతలా మన జీవితాలు మారిపోయాయి. ఇక ఒకప్పుడు కారంటే.. కోటీశ్వరులు, సెలబ్రిటీల వాహనం. మరి ఇప్పుడు మధ్య తరగతి వారు సైతం కారు కొంటున్నారు.
పైగా నేటి కాలంలో ఖరీదైన బుల్లెట్ ధరకు వచ్చే కార్లు కూడా మార్కెట్‌లో ఉన్నాయి. దాంతో చాలా మంది కారు కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈనేపథ్యంలోనే మేం మీకు ఇప్పుడు బడ్జెట్ ధరలో.. మంచి ఫీచర్లతో వచ్చే కారును పరిచయం చేయబోతున్నాం. పైగా ఈ కారు ఈఎంఐ నెలకు కేవలం 5 వేల రూపాయలు మాత్రమే అంటే.. ఇక ఈ కారు ధర ఎంత తక్కువో మీరే ఊహించుకొండి. ఇంతకు ఆ కారు ఏ కంపెనీదంటే..
సామాన్యులు సైతం కారు కొనుగోలు చేసేలా ఓ కంపెనీ బడ్జెట్ ధరలో కారు లాంచ్ చేసింది. పైగా తక్కువ ఈఎంఐ చెల్లించి దీన్ని కొనుగోలు చేసే అవకాశం కల్పించింది. దాంతో మధ్యతరగతి వారు ఈ కారు కొనడానికి ఆసక్తి చూపుతున్నారు. మారుతీ కంపెనీ.. ఈ బడ్జెట్ కారును అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ కంపెనీ మార్కెట్‌లోకి తీసుకువచ్చిన ఆల్టో కే 10 కారు ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న కార్లన్నింటిలో కెల్లా అత్యంత లో బడ్జెట్ కారుగా గుర్తింపు తెచ్చుకుంది. నెలకు ఐదు వేల రూపాయల ఈఎంఐ చెల్లించి ఈ కారును సొంతం చేసుకోవచ్చు. తక్కువ ధర అని.. ఫీచర్స్ బాగుండవేమో అనుకునేరు. ఆ విషయంలో కంపెనీ ఏమాత్రం వెనకడుగు వేయలేదు.
ఇక మారుతి కంపెనీ తీసుకువచ్చిన ఆల్టో కే 10 కారు బేస్ మోడల్ ఆన్ రోడ్ ప్రారంభ ధర 4.50 లక్షల రూపాయలు. దీనిలో ఐదుగురు వ్యక్తులు సౌకర్యవంతంగా కూర్చుని ప్రయాణం చేయవచ్చు. ముందుగా 1,35,000 రూపాయలు చెల్లించి ఆ తర్వాత నెలకు 5 వేల ఈఎంఐ కడుతూ ఈ కారును మీ సొంతం చేసుకోవచ్చు. బడ్జెట్ ధరలో లభించే ఈ కారు మైలేజ్ విషయంలో మాత్రం హై రేంజ్ కార్లకు గట్టి పోటీ ఇస్తోంది. ఈ కారు లీటర్ పెట్రోల్‌తో 24 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఇక సీఎన్ జీ వెర్షన్‌లో అయితే 33 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు.
మారుతి ఆల్టో కే 10.. 1.0 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 66 బీహెచ్ పీ పవర్‌తో పాటు 89 ఎన్ ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్, 5 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్‌తో వచ్చే ఈ ఆల్టో కే 10 కారు.. మొత్తం 4 వేరియంట్లలో లభిస్తుంది. గతేడాది అనగా 2023 లో ఈ కారు మార్కెట్లోకి వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దీని అమ్మకాలు బాగానే ఉన్నాయి. లాంగ్ డ్రైవ్‌తో పాటు ఎలాంటి వాతావరణంలోనైనా ఆల్టో కే 10 పరుగులు తీస్తుంది. అందుకే చిన్న ఫ్యామిలీ కోసం కారు కావాలనుకునేవారు దీని వైపే మొగ్గు చూపుతున్నారు. ఇందులో హై ఎండ్ మోడల్ కావాలనకుంటే షో రూమ్‌కి వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.