Dharani
ప్రముఖ కంపెనీ కేవలం 999 రూపాయలకే హై క్వాలిటీ ఇయర్ బడ్స్‌ను లాంఛ్ చేసింది. ఇక వీటిలోని ఫీచర్లు అద్భుతంగా ఉన్నాయి. ఇంతకు ఇవి ఏ కంపెనీ ఇయర్ బడ్స్.. ఎక్కడ కొనుగోలు చేయాలంటే..
ప్రముఖ కంపెనీ కేవలం 999 రూపాయలకే హై క్వాలిటీ ఇయర్ బడ్స్‌ను లాంఛ్ చేసింది. ఇక వీటిలోని ఫీచర్లు అద్భుతంగా ఉన్నాయి. ఇంతకు ఇవి ఏ కంపెనీ ఇయర్ బడ్స్.. ఎక్కడ కొనుగోలు చేయాలంటే..
Dharani
ఇయర్ ఫోన్స్ పోయి వాటి స్థానంలో ఇయర్ బడ్స్ వచ్చాయి. తీగల ఇయర్‌ఫోన్స్ స్థానంలో.. చేవిలో తగిలించుకునే ఇయర్ బడ్స్ సౌకర్యవంతంగా ఉండటమే కాక.. ఎంతో ఫ్యాషన్‌గా కూడా ఉంటాయి. ఇక నేడు మార్కెట్‌లో ఎన్నో కంపెనీల ఇయర్‌బడ్స్ అందుబాటులో ఉన్నాయి. ఒకప్పుడు వీటి ధరలు చాలా ఎక్కువగా ఉండేవి ఇప్పటికి కూడా యాపిల్ వంటి కంపెనీల ఇయర్ బడ్స్ ధర చాలా భారీగా ఉంటుంది. ఈ క్రమంలో ఓ కంపెనీ తన ఇయర్‌బడ్స్ మీద భారీ ఆఫర్ ప్రకటించింది. కేవలం 999 రూపాయలకే ఇయర్‌బడ్స్ అందించనుంది. ఇక వీటిని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే.. ఏకంగా 100 గంటల పాటు వాడుకోవచ్చు. ఇంతకు అవి ఏ కంపెనీ ఇయర్ బడ్స్.. ఎక్కడ కొనుగోలు చేయాలంటే..
బోట్ కంపెనీ అతి తక్కువ ధర కలిగిన టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్‌లను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ కొత్త ఇయర్‌బడ్స్ పేరు బోట్ ఎయిర్‌పాడ్స్ ఆటమ్ 81 ప్రో. ఈ కొత్త ఇయర్‌బడ్స్ ఏకంగా 100 గంటల ప్లేబ్యాక్ సమయంతో వస్తున్నాయి. వీటి ధర 999 రూపాయలు మూడు రంగుల్లో అందుబాటులో ఉన్నాయి. వీటిని ప్రముఖ ఈకామర్స్ సంస్థ అమెజాన్ నుంచి కొనగోలు చేయవచ్చు. ఇక ఈ కొత్త బోట్ ఇయర్‌బడ్స్ ఫీచర్స్, స్పెసిషికేషన్స్ గురించి మనం ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
ఈ ఇయర్‌బడ్స్‌లో శక్తివంతమైన ధ్వని కోసం బోట్ కంపెనీ 13ఎంఎం డ్రైవర్లను అందిస్తోంది. మీరు ఈ బడ్స్‌లో సిగ్నేచర్ బోట్ సౌండ్‌ని పొందుతారు. స్పష్టమైన ఫోన్ కాల్‌ల కోసం.. బోట్ కంపెనీ వారు ENxTM సాంకేతికతతో కూడిన క్వాడ్ మైక్‌లను వినియోగించారు. ఈ కొత్త బడ్స్‌లో బీస్ట్ మోడ్ కూడా ఇచ్చారు. ఈ ఫీచర్.. గేమింగ్ విభాగంలో వీటిని ఉత్తమ ఇయర్‌బడ్‌లుగా చేస్తుంది. బోట్ కొత్త బడ్స్ బ్యాటరీ అద్భుతమైనది. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే.. ఏకంగా 100 గంటలు ప్లే బ్యాక్ సమయాన్ని అందిస్తున్నాయని బోట్ కంపెనీ వెల్లడించింది.
విశేషమేమిటంటే ఈ బడ్స్ ఏఎస్‌ఏపీ టెక్నాలజీతో వస్తున్నాయి. అందువల్ల వీటిని కేవలం 5 నిమిషాల పాటు ఛార్జింగ్ చేస్తే.. ఏకంగా.. 100 నిమిషాల వరకు ప్లేబ్యాక్‌ను అందించేంత ఛార్జీని పొందుతుంది అని కంపెనీ తెలిపింది. ఇక వీటిని ఛార్జింగ్ చేయడం కోసం యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్‌ను కలిగి ఉంది. కనెక్టివిటీ కోసం, ఇది బ్లూటూత్ 5.1ని కలిగి ఉంది.
అలాగే అవి ఇన్‌స్టంట్ వేక్, పెయిర్ టెక్నాలజీని కలిగి ఉంటాయి. దాంతో ఇవి బ్లూటూత్ తో చాలా వేగంగా కనెక్ట్ అవుతాయి. ఈ ఇయర్‌బడ్స్ ఐపీఎక్స్ 5 రేటింగ్‌తో వస్తాయి. దీని కారణంగా ఇది వ్యాయామం, బహిరంగ కార్యకలాపాలకు కూడా సౌకర్యవంతంగా ఉపయోగించవచ్చు. నీరు చిమ్మడం, చెమట వల్ల ఇవి త్వరగా పాడుకావు. ఇవి చెవిలో సరిగా సెట్ అవుతాయి. కాకపోతే వీటిలో సిలికాన్ టిప్ లేదు. అందువల్ల ఈ ఇయర్‌బడ్స్ కొందరిని ఇబ్బంది పెట్టవచ్చు.