Venkateswarlu
జేమ్స్ కామెరూన్ ప్రపంచ చలన చిత్ర రంగానికి ఓ స్పూర్తి దాత. కథతో సినిమా తీసి ప్రేక్షకులకు చూపించటం కాదు.. ప్రజల్ని సినిమా ప్రపంచంలోకి తీసుకెళ్లటం ఆయనకు మాత్రమే సాధ్యం అయింది.
జేమ్స్ కామెరూన్ ప్రపంచ చలన చిత్ర రంగానికి ఓ స్పూర్తి దాత. కథతో సినిమా తీసి ప్రేక్షకులకు చూపించటం కాదు.. ప్రజల్ని సినిమా ప్రపంచంలోకి తీసుకెళ్లటం ఆయనకు మాత్రమే సాధ్యం అయింది.
Venkateswarlu
సినిమా చరిత్ర సజీవంగా ఉన్నంత కాలం ‘‘ అవతార్’’ ఇప్పటికీ.. ఎప్పటికీ ఓ మైలు రాయే. ఈ సినిమా సృష్టించిన రికార్డులు చరిత్రలో పథిలంగా ఉండిపోతాయి. హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ సృష్టించిన అవతార్ ప్రపంచం ప్రేక్షకుల్ని ఓ అద్భుత లోకంలోకి తీసుకుపోయింది. ప్రతీ ఫ్రేము ఓ వాస్తవంలా.. సినిమా చూసే వాళ్ల కళ్ల ముందు కదలాడింది. 2డీలో ‘అవతార్’ చూసిన జనం సైతం పండారా ప్రపంచంలో తాము ఉన్నట్లు భ్రమ చెందారంటే.. సినిమా ఎంతటి ప్రభావం చూపిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
జేమ్స్ కామెరూన్ ఈ సినిమా కోసం కఠోర శ్రమ చేశారు. దాదాపు ఐదేళ్లకు పైగా కష్టపడ్డారు. కొత్త కొత్త టెక్నాలజీని సినిమా కోసం వాడారు. అంతేకాదు! సినిమా కోసమే ఓ కొత్త కెమెరాను తయారు చేశారు. ఆ కెమెరాతోనే సినిమాను షూట్ చేశారు. కేవలం కెమెరా విషయంలోనే కాదు.. ఇతర విషయాల్లోనూ జేమ్స్ ట్రెండ్‌ను ఫాలో అవ్వకుండా సెట్ చేశారు. కొత్త కొత్త టెక్నాలజీలను వాడి అవతార్‌ను తెరకెక్కించారు. అప్పటి వరకు అలాంటి టెక్నాలజీలు ఉన్నాయని బయటి ప్రపంచానికి సరిగా తెలీదు.
సాధారణంగా హాలీవుడ్ సినిమాల్లో ఎక్కువగా త్రీడీ, మోషన్ క్యాప్చర్ టెక్నాలజీలను వాడుతూ ఉంటారు. కానీ, జేమ్స్ కామెరూన్ మాత్రం ఈ టెక్నాలజీని మరో లెవెల్‌కు తీసుకెళ్లి వాడ్డం మొదలెట్టారు. ఇందుకోసం కొత్త టెక్నాలజీని తయారు చేసి మరీ వాడ్డం మొదలుపెట్టారు. కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీ అనే కొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. హెడ్ రిగ్స్, వర్ట్యువల్ అండ్ ఫ్యూజన్ కెమెరాలను వాడి వీడియోను చిత్రీకరించారు. వీటిని ఉపయోగించటం ద్వారా రియల్ టైమ్ మోషన్ క్యాప్చర్ పద్దతిలో వీడియో తీయటం సాధ్యపడింది.
‘ నేను ట్రెండ్ ఫాలో అవ్వను.. సెట్ చేస్తాను’ అన్న డైలాగ్ జేమ్స్ కామెరూన్ సరిగ్గా సూట్ అవుతుంది. ఎందుకంటే.. సినిమా సినిమాకు కథలో.. కథనంలోనే కాదు.. మేకింగ్ విషయంలోనూ ఆయన తన ప్రత్యేకతను చాటుతూ ఉంటారు. అవతార్ సినిమా కోసం జేమ్స్ ఓ అడుగు ముందుకు వేశారు. ఈ సినిమా కోసం ఏకంగా కొత్త కెమెరాను తయారు చేశారు. రెండు సోనీ ఎఫ్950 స్టీరియోస్కోపిక్ కెమెరాలను కలిపి ఓ కొత్త కెమెరా ‘ఫ్యూజన్ కెమెరా సిస్టమ్’ను తయారు చేశారు. ఈ కెమెరా ద్వారా కొన్ని షాట్లను అత్యంత ఈజీగా తీయటం సాధ్యమైంది. ఈ కెమెరాతోనే సినిమా మొత్తాన్ని తీశారు. ఇక, అవుట్ పుట్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
అవతార్ సీక్వెల్‌గా తెరకెక్కిన ‘అవతార్: వే ఆఫ్ వాటర్’ కోసం కూడా కొత్త టెక్నాలజీని క్రియేట్ చేశారు. ఆస్ట్రేలియన్ సినిమాటోగ్రాఫర్ తయారు చేసిన డీప్‌ఎక్స్ త్రీడీని ఉపయోగించి ఓ కెమెరా రిగ్‌ను తయారు చేశారు. ఆ కెమెరా రిగ్‌తో సముద్రంలోని సన్ని వేశాలను చిత్రీకరించారు. అంతేకాదు! నీళ్లలో సన్నివేశాలను చిత్రీకరించడానికి తయారు చేసిన పాత కెమెరాలను సైతం రంగంలోకి దింపారు. DeepX 3D..Nikon’s 15mm underwater lensesను వాడారు. మిక్సింగ్ కోసం Sony VENICEను ఉపయోగించారు.
ప్రపంచ చలనచిత్ర రంగంలో అందరిదీ ఒక వైపు అయితే.. జేమ్స్ కామెరూన్ మాత్రం ఓ వైపు ఉన్నారు. తాను ఏం చేసినా ప్రేక్షకుల్ని మెప్పించేలా.. అద్భుతమైన అనుభూతి కలిగించేలా సినిమాలు చేస్తున్నారు. టైటానిక్ సినిమా తీయటం కోసం ఓ సబ్‌మెరైన్‌ను తయారు చేసి సముద్రంలో మునిగిపోయిన టైటానిక్ షిప్ దగ్గరకు వెళ్లి వచ్చారు. తన స్క్రిప్టుకు అవసరమైన విషయాలను తెలుసుకున్నారు. ఇలా ప్రతీ సినిమా కోసం ఏదో ఒక సాహసం చేస్తూనే ఉన్నారు.