మీ ఇంట్లో ACఉందా? ఈ మిస్టేక్స్ చేస్తే పేలుడు గ్యారెంటీ.. నివారణకు మార్గాలు ఇవే?

Air Conditioner: ఈ మధ్యకాలంలో ఏసీలు వాడే వారి సంఖ్య బాగా పెరిగింది. దీంతో వివిధ కారణాలతో ఏసీలు పేలి పోతున్నాయి. అయితే ఇవి పేలడానికి ప్రధాన కారణాలు, నివారణ చర్యలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

Air Conditioner: ఈ మధ్యకాలంలో ఏసీలు వాడే వారి సంఖ్య బాగా పెరిగింది. దీంతో వివిధ కారణాలతో ఏసీలు పేలి పోతున్నాయి. అయితే ఇవి పేలడానికి ప్రధాన కారణాలు, నివారణ చర్యలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రస్తుతం సమ్మర్ సీజన్ నడుస్తోంది. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు అయ్యాయి. ఇక ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో జనం అల్లాడిపోతున్నారు.  ఈ కాలంలో ఎండల తీవ్రత నుంచి కాపాడుకునేందుకు చాలా మంది ఇళ్లల్లో ఏసీలు, కూలర్లను ఏర్పాటు చేసుకుంటారు.  అంతేకాక నేటికాలంలో ఏసీల వినియోగం బాగా పెరిగిపోయింది. ఇదే సమయంలో తరచూ వివిధ కారణాలతో ఏసీలు పేలడం వంటి ఘటనలు జరుగుతుంటాయి. దీంతో ఇళ్లకు మంటలు చెలరేగడం జరుగుతుంది. అందుకే ఏసీని ఉపయోగించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని పొరపాట్లు చేయడం వలన ఏసీపు పేలుతుంటాయి. అలానే కొన్ని నివారణ చర్యలు తీసుకుంటే.. అలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవచ్చు. మరి.. ఆవి ఏమిటో ఇప్పుడు చూద్దాం…

ఈ మధ్యకాలంలో ఏసీలు వాడే వారి సంఖ్య బాగా పెరిగింది. దీంతో వివిధ కారణాలతో ఏసీలు పేలి పోతున్నాయి. ఏసీ కంప్రెషర్‌లు పేలిపోవడం వల్ల ఫైర్ యాక్సిడెంట్ జరిగినట్లు గణాంకాలు కూడా ఉన్నాయి. ఆ ఏసీని ఉపయోగిస్తున్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే కొంచెం అజాగ్రత్తగా ఉన్న కూడా ఏసీ కంప్రెజర్ పేలి పెద్ద ప్రమాదాలు, మరణాలకు కూడా సభవిస్తాయి. ఏదైనా ఎలక్ట్రానిక్ ఉత్పత్తి సరిగ్గా వినియోగించుకోవాలి. ఏసీ పేలుడు ఘటనలు నివారించడానికి, సరైన సంరక్షణ, నిర్వహణ చాలా ప్రధానం. కంప్రెసర్ పేలుడుకు కొన్ని కారణాలు కూడా ఉండవచ్చు.

ఏసీని క్రమం తప్పకుండా సర్వీసింగ్, అలా చేయకపోతే.. అందులోకి చెత్త చెదారం చేరి కంప్రెసర్ పై ఒత్తిడిని పెంచుతుంది. దీంతో అది విఫలవుతుంది. అలా కాకుండా తరచూ వాటిని శుభ్రం చేసుకుంటూ ఉండాలి. కంప్రెసర్‌లో రిఫ్రిజిరెటర్ నుంచి గ్యాస్ లీకేజ్ కూడా పేలుడుకు ఓ కారణం అవుతుంది. కాబట్టి అందులో నుంచి గ్యాస్ లీకు కాకుండా చూసుకోవాలి. ఒక లీక్ ఉన్నట్లయితే, గ్యాస్ పీడనం అసాధారణంగా మారవచ్చు. ఇది కంప్రెసర్‌కు హాని కలిగించవచ్చు. కంప్రెసర్ కూలింగ్ ఫ్యాన్ వర్క్ చేయకపోతే.. అది వేడెక్కి..పేలుడుకు దారి తీస్తుంది. మీ ఏసీని క్రమం తప్పకుండా సర్వీసు చేయించాలి.  ప్రతి 6 నెలలకు లేదా కనీసం ఏడాదికి ఒకసారి ఏసీ రిపేరర్ ద్వారా సర్వీస్‌ను పొందండి.

అలానే ఏసీకి వోల్టేజ్ స్టెబిలైజర్‌ను ఉపయోగించాలి. తద్వారా విద్యుత్ సరఫరా సరైన వోల్టేజ్‌ తో ఏసీలోకి వెళ్తోంది. ఏసీ వేడెక్కకుండా నిరోధించడానికి కంప్రెసర్, కండెన్సర్ యూనిట్ చుట్టూ సరైన వెంటిలేషన్ ఉండేలా చూసుకోండి. కంప్రెసర్‌ను ప్రత్యక్ష సూర్యకాంతి లేదా చాలా హీట్ ఉండే  ఏరియాల్లో ఉంచవద్దు. కూలింగ్‌ ఫ్యాన్ సరిగ్గా పని చేస్తుందో లేదో తరచూ చెక్‌ చేయండి. కూలింగ్ ఫ్యాన్‌లో ఏదైనా సమస్య ఉంటే వెంటనే రిపేర్ చేయించండం మంచి. ఇలాపై విధంగా చేయడం వలన ఏసీ పేలుడు ఘటనలు  నివారించవచ్చు.

Show comments