P Venkatesh
చన్నీటితో స్నానం చేయాలంటే భయపడే వారికి శుభవార్త. వాటర్ హీటర్, గీజర్లకు ధీటుగా మార్కెట్ లోకి ఇన్ బిల్ట్ వాటర్ హీటర్ బకెట్ అందుబాటులోకి వచ్చింది. కావాల్సినప్పుడల్లా వేడి నీటిని హీట్ చేసుకోవచ్చు.
చన్నీటితో స్నానం చేయాలంటే భయపడే వారికి శుభవార్త. వాటర్ హీటర్, గీజర్లకు ధీటుగా మార్కెట్ లోకి ఇన్ బిల్ట్ వాటర్ హీటర్ బకెట్ అందుబాటులోకి వచ్చింది. కావాల్సినప్పుడల్లా వేడి నీటిని హీట్ చేసుకోవచ్చు.
P Venkatesh
చలికాలం వచ్చిందంటే చాలు కొందరు స్నానం చేయడానికి వణికిపోతుంటారు. ఇక చన్నీళ్లతో స్నానం చేయాల్సి వస్తే.. స్నానం చేయడం వాయిదా వేసుకుంటారే తప్ప చన్నీటి స్నానం మాత్రం చేయరు. ఇలాంటి వారికి ఓ గుడ్ న్యూస్. మార్కెట్ లోకి వేడి నీళ్లు ఇచ్చే బకెట్ వచ్చింది. వాటర్ హీటర్, గీజర్ లతో పని లేకుండా ఎంచక్కా ఈ ఇన్ బిల్ట్ వాటర్ హీటర్ బకెట్ ను ఉపయోగించుకుని హాట్ వాటర్ ను పొందొచ్చు. తక్కువ ధరకే ఈ వేడి నీళ్లు ఇచ్చే బకెట్ అందుబాటులో ఉంది. భద్రతా పరంగా కూడా ఈ వేడీ నీళ్లు ఇచ్చే బకెట్ చాలా బాగుంటుంది. మరి ఈ హాట్ వాటర్ బకెట్ ధర ఎంత? ఎలా పనిచేస్తుంది? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
గజగజా వణికించే చలిలో చన్నీటితో స్నానం చేయడం కష్టంగానే ఉంటుంది. జలుబు, దగ్గు, ఆస్తమా వంటి వ్యాధులతో బాధపడే వారికి మరింత ఇబ్బందికరంగా మారుతుంది. ఈ కారణం చేతనే చలికాలంలో ఎక్కువగా వేడినీటితో స్నానం చేసేందుకు మొగ్గుచూపుతారు. దీని కోసం వాటర్ హీటర్లను, గీజర్లను వాడుతుంటారు. అయితే ఈ రెండు ఎలక్ట్రిక్ పరికరాలు ప్రమాదంతో కూడుకున్నవే. గతంలో గీజర్ ప్రమాదాలకు గురై చాలా మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయి. గీజర్ ధరలు కూడా ఎక్కువగా ఉంటాయి. వాటర్ హీటర్ కూడా ప్రమాదమే. బకెట్ లో హీటర్ రాడ్ వేసి స్విచ్ ఆన్ చేసిన తర్వాత, ఆదమరిచి నీళ్లలో చేతులు పెట్టినట్లైతే షాక్ కు గురై ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నట్లైతే వాటర్ హీటర్లతో మరింత ప్రమాదం పొంచి ఉంటుంది. వీటితో పోల్చితే వేడి నీళ్లు ఇచ్చే బకెట్ ఎంతో సురక్షితంగా ఉంటుంది.
శీతాకాలంలో చలి నుంచి కాపాడే వస్తువులు.. మీ దగ్గరున్నాయా?
కాగా వేడినీళ్లు ఇచ్చే బకెట్ లో వాటర్ హీటర్ ఇన్ బిల్ట్ గా ఉంటుంది. వేడినీళ్లు కావాల్సినప్పుడల్లా వాటర్ హీటర్ మాదిరిగా ప్రతిసారి బకెట్ లో పెట్టాల్సిన పనిలేదు. ఈ బకెట్‌లో నీరు పోసి ప్లగ్‌ను పవర్ సాకెట్‌లో పెట్టి స్విచ్ ఆన్ చేస్తే చాలు నీరు వేడెక్కుతుంది. ఎప్పుడంటే అప్పుడు నీళ్లను వేడి చేసుకోవచ్చు. చలికాలంలో ఈ బకెట్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇక ఈ బకెట్ 20 లీటర్ల నీటి సామర్థ్యాన్ని కలిగి ఉంది. నీరు వేడెక్కిన తర్వాత సులభంగా బయటకు తీసుకునేందుకు బకెట్ కింది భాగంలో ట్యాప్ ను కూడా అమర్చారు. కాగా ఈ ఇన్ బిల్ట్ వాటర్ హీటర్ ప్రముఖ ఈ కామర్స్ కంపెనీలో అందుబాటులో ఉంది. ఈ బకెట్ రూ. 1,599 కి అందుబాటులో ఉంది. మరి.. ఈ అభిరామి వాటర్ బకెట్ వాటర్ హీటర్ ని కొనుగోలు చేయాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.