Nidhan
భారత యువ కెరటం యశస్వి జైస్వాల్ తనకు దొరికిన ప్రతి ఆపర్చునిటీని ఉపయోగించుకుంటున్నాడు. ఛాన్స్ ఇస్తే చాలు చెలరేగి తానేంటో నిరూపించుకుంటున్నాడు. అయితే అతడు ఆశలు వదిలేసుకోవాలని అంటున్నాడు సీనియర్ క్రికెటర్ దినేష్ కార్తీక్.
భారత యువ కెరటం యశస్వి జైస్వాల్ తనకు దొరికిన ప్రతి ఆపర్చునిటీని ఉపయోగించుకుంటున్నాడు. ఛాన్స్ ఇస్తే చాలు చెలరేగి తానేంటో నిరూపించుకుంటున్నాడు. అయితే అతడు ఆశలు వదిలేసుకోవాలని అంటున్నాడు సీనియర్ క్రికెటర్ దినేష్ కార్తీక్.
Nidhan
భారత యువ కెరటం యశస్వి జైస్వాల్ తనకు దొరికిన ప్రతి ఆపర్చునిటీని ఉపయోగించుకుంటున్నాడు. ఛాన్స్ ఇస్తే చాలు చెలరేగి తానేంటో నిరూపించుకుంటున్నాడు. ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లోనూ పరుగుల వరద పారించాడు. ఆ ఫార్మాట్, ఈ ఫార్మాట్ అనే తేడాల్లేకుండా ఎందులో అవకాశం వచ్చినా బౌలర్లను చీల్చి చెండాడుతున్నాడు. టీమిండియా ఫ్యూచర్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న జైస్వాల్.. టీ20లు, టెస్టుల్లో జట్టులో సెట్ అయ్యాడు. కానీ వన్డేల్లో మాత్రం అతడు ఇంకా పర్మినెంట్ ప్లేయర్ కాలేదు. రోహిత్ శర్మకు జతగా శుబ్‌మన్ గిల్ రూపంలో సాలిడ్ ఓపెనర్ అందుబాటులో ఉండటంతో జైస్వాల్‌కు అవకాశాలు దక్కడం లేదు. గిల్ వైస్ కెప్టెన్ కావడంతో టీమ్‌లో నుంచి తీసేయడానికి లేదు. ఇది జైస్వాల్‌కు ఇబ్బందికరంగా మారింది.
బైల్యాటరల్ సిరీస్‌ల్లోనే టీమ్‌లో చోటు దక్కించుకోలేకపోతున్న జైస్వాల్.. ఛాంపియన్స్ ట్రోఫీ లాంటి బడా టోర్నమెంట్లో టీమ్‌లోకి ఎలా వస్తాడనేది ఆసక్తికరంగా మారింది. ఫుల్ కాంపిటీషన్ మధ్య ఓపెనింగ్ స్పాట్‌ను ఎలా దక్కించుకుంటాడనేది చూడాలి. ఈ విషయంపై భారత మాజీ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ రియాక్ట్ అయ్యాడు. ఇంక జైస్వాల్ ఆశలు వదులుకోవాలని అన్నాడు. వచ్చే ఛాంపియన్స్ ట్రోఫీలో అతడ్ని ఓపెనర్‌గా ఆడించడం కుదిరే పని కాదన్నాడు. అయితే బ్యాకప్ ఓపెనర్‌గా జైస్వాల్ టీమ్‌లో ఉంటాడని.. హిట్‌మ్యాన్‌తో కలసి ఓపెనింగ్ చేయడం మాత్రం కుదరదన్నాడు. గిల్ దారుణంగా విఫలమైతే తప్ప జైస్వాల్ ఆ టోర్నీలో ఓపెనర్‌గా రావడం సాధ్యమయ్యే పనికాదన్నాడు. అయినా రోహిత్-గిల్ బాగా ఆడుతున్నందున వాళ్లనే కంటిన్యూ చేయాలని తెలిపాడు.
‘రోహిత్ శర్మ-శుబ్‌మన్ గిల్ జోడీ బాగుంది. వీళ్లది మంచి కాంబినేషన్. జైస్వాల్‌ను బ్యాకప్ ఓపెనర్‌గా ఆడించొచ్చు. ఒకవేళ గిల్ ఫెయిలైతే హిట్‌మ్యాన్‌కు జతగా జైస్వాల్‌ను మరో ఓపెనర్‌గా దింపాలి. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు పెద్దగా వన్డేలు లేవు. భారత్‌కు కేవలం మూడు మ్యాచ్‌లు మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఛాంపియన్స్ ట్రోఫీలో రోహిత్-గిల్ ఓపెనింగ్ చేసే అవకాశాలు బలంగా ఉన్నాయి’ అని కార్తీక్ చెప్పుకొచ్చాడు. ఇక, వన్డేల్లో ఓపెనింగ్ తప్పితే జైస్వాల్ ఆడేందుకు మరో స్పాట్ లేదు. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ తర్వాతి పొజిషన్లలో ఆడతారు. కాబట్టి గిల్ ఫెయిలైతే తప్ప జైస్వాల్ టీమ్‌లోకి రాడు. ఈ గ్యాప్‌లో ఎక్కువ వన్డేలు జరిగి అతడు ప్రూవ్ చేసుకుంటే ఛాన్స్ వచ్చేదేమో. కానీ భారత్ మూడు వన్డేలు మాత్రమే ఆడనుంది. మరి.. రోహిత్‌కు జతగా గిల్, జైస్వాల్లో ఎవరు ఓపెనర్‌గా వస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి.
Dinesh Karthik ” Rohit Sharma and Shubman Gill are a very good combination.Yashasvi Jaiswal has the great opportunity to be the backup opener and will get the opportunity if Shubman Gill doesn’t go well as expected.”pic.twitter.com/SNENFXPf7m
— Sujeet Suman (@sujeetsuman1991) August 21, 2024