SNP
MS Dhoni, Adam Gilchrist: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని.. గురించి ఆస్ట్రేలియా దిగ్గజ మాజీ క్రికెటర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
MS Dhoni, Adam Gilchrist: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని.. గురించి ఆస్ట్రేలియా దిగ్గజ మాజీ క్రికెటర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
SNP
టీమిండియా దిగ్గజ మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని.. గురించి భారత క్రికెట్ అభిమానులకు అసలు పరిచయమే అక్కర్లేదు. అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమై ఏళ్లు గడుస్తున్నా.. ధోని క్రేజ్ ఇంచు కూడ తగ్గలేదు. భారత్‌కు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ఏకైక కెప్టెన్‌గా భారత క్రికెట్ చరిత్రలో ధోని పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. అలాగే ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఐదు ట్రోఫీలు గెలిచించాడు.. ఇలా ఎన్నో రికార్డులు కలిగి ఉన్న ధోని.. అంత గొప్ప క్రికెటర్ అయ్యాడంటే.. కేవలం ఆట మాత్రమే కాదు అతని వ్యక్తిత్వం కూడా అందుకు దోహదం చేసింది. దాని గురించే తాజాగా ఆడమ్ గిల్‌క్రిస్ట్ మాట్లాడాడు.
ఆస్ట్రేలియా దిగ్గజ మాజీ క్రికెటర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ పేరు వినగానే.. అందరికి విధ్వంసకర బ్యాటింగ్‌తో పాటు అద్భుతమైన కీపింగ్ గుర్తుకు వస్తుంది. ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ వికెట్ కీపర్లలో గిల్‌క్రిస్ట్ ముందు వరుసలో ఉంటాడు. అలాంటి ఆటగాడు ఇప్పుడు ధోనిని అత్యుత్తమ వికెట్ కీపర్‌గా అభివర్ణించాడు. ప్రపంచ వ్యాప్తంగా టాప్ 3 వికెట్ కీపర్లలో ధోని ఎప్పుడూ ఉంటాడంటూ ప్రకటించాడు గిల్‌క్రిస్ట్. అతను మాట్లాడుతూ.. ‘అత్యుత్తమ వికెట్ కీపర్లలో రోడ్నీ మార్ష్ ఒకరు, ఆయనే నాకు ఆదర్శం. నేను ఆయనలా అవ్వాలని అనుకున్నాను. ఆ తర్వాత ఎంఎస్ ధోనీ.. అతని కామ్‌నెస్ నాకు చాలా ఇష్టం. వీరిద్దరితో పాటు కుమార సంగక్కర. అతను క్లాసీ ప్లేయర్.’ అంటూ తన టాప్ 3 వికెట్ కీపర్ల పేర్లు చెప్పాడు గిల్‌క్రిస్ట్.
టీమిండియా కెప్టెన్‌గా, వికెట్ కీపర్, బ్యాటర్‌గా, ఫినిషర్‌గా ధోని.. అనేక రోల్స్ పోషించేవాడు. కానీ, మ్యాచ్ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా.. ఒత్తిడికి గురికాడు, చాలా కామ్ అండ్ కూల్‌గా పని ఫినిష్ చేస్తాడు. అదే ధోనిని ఒక అత్యుత్తమ కెప్టెన్‌గా, ప్లేయర్‌గా, వికెట్ కీపర్‌గా నిలిపింది. ధోనిలో ఉంటే కామ్‌నెస్ తనకు చాలా ఇష్టమంటూ గిల్‌క్రిస్ట్ ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ధోని ఇండియన్ క్రికెట్ హిస్టరీలోనే మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా గుర్తింపు పొందాడు అంటే.. అందుకే అతని కామ్ అండ్ కూల్ నెస్ కారణమని చాలా మంది మాజీ క్రికెటర్లు కూడా గతంలో అభిప్రాయపడ్డారు. అందుకే ధోనిని మిస్టర్ కూల్, కెప్టెన్ కూల్ అని కూడా పిలుస్తుంటారు. మరి ధోని గురించి గిల్‌క్రిస్ట్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Adam Gilchrist said, “MS Dhoni is one of my Top 3 wicketkeeper batters of all time. I like MS’ coolness. He’s always calm”. (TOI). pic.twitter.com/A8Ho2q5Nw0
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 21, 2024