Nidhan
ICC Rankings, Yashasvi Jaiswal, Rishabh Pant: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఎందులోనూ తగ్గరు. రికార్డులు, ర్యాంకింగ్స్ ఎందులోనైనా వాళ్లు ముందంజలో ఉంటారు. అయితే ఈసారి మాత్రం వాళ్లు కాస్త వెనుకబడ్డారు.
ICC Rankings, Yashasvi Jaiswal, Rishabh Pant: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఎందులోనూ తగ్గరు. రికార్డులు, ర్యాంకింగ్స్ ఎందులోనైనా వాళ్లు ముందంజలో ఉంటారు. అయితే ఈసారి మాత్రం వాళ్లు కాస్త వెనుకబడ్డారు.
Nidhan
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఎందులోనూ తగ్గరు. రికార్డులు, ర్యాంకింగ్స్ ఎందులోనైనా వాళ్లు ముందంజలో ఉంటారు. పరుగుల వరద పారించే ఈ ఇద్దరు స్టార్ బ్యాటర్లు.. క్రీజులోకి దిగితే బౌలర్లను ఓ ఆటాడుకుంటారు. ఫోర్లు, సిక్సుల సంద్రంలో అపోజిషన్ టీమ్‌ను ముంచేస్తారు. దశాబ్దంన్నర నుంచి భారత క్రికెట్‌ను భుజస్కందాల మీద మోస్తున్న వీళ్లు అన్ని ఫార్మాట్లలోనూ హవా నడిపిస్తున్నారు. అందుకే ప్రస్తుత క్రికెట్లో టాప్ బ్యాటర్స్ ఎవరంటే కోహ్లీ-రోహిత్ పేర్లు ముందు ప్రస్తావనకు వస్తాయి. ఇంతలా దూసుకెళ్తున్న ఈ ఇద్దరు మోడర్న్ మాస్టర్స్ ఒక విషయంలో కాస్త వెనుకబడ్డారు. అయితే జూనియర్లు యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్ మాత్రం టీమిండియా పరువు కాపాడారు. సీనియర్లు ఫెయిలైనా రెస్పాన్సిబిలిటీ తీసుకొని అదరగొట్టారు.
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ తాజాగా టెస్ట్ బ్యాటర్స్ ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది. ఇందులో భారత యంగ్ ఓపెనర్ జైస్వాల్ (751 పాయింట్లు) మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. బంగ్లాదేశ్‌తో చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో హాఫ్ సెంచరీతో రాణించడంతో ర్యాంకింగ్స్‌లో అతడు ఒక స్థానం మెరుగుపర్చుకున్నాడు. ఆరో నంబర్ నుంచి ఐదో పొజిషన్‌కు ఎగబాకాడు. స్టార్ వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్ (731 పాయింట్లు) ఆరో స్థానంలో నిలిచాడు. వీళ్లతో పాటు కెప్టెన్ రోహిత్ (716 పాయింట్లు) టాప్-10 టెస్ట్ బ్యాటర్స్ లిస్ట్‌లో ఒకడిగా నిలిచాడు. అతడు పదో పొజిషన్లో నిలిచాడు. అయితే ఇంతకుముందు ఐదో స్థానంలో ఉన్న హిట్‌మ్యాన్.. చెన్నై టెస్ట్ రెండు ఇన్నింగ్స్‌ల్లో ఫెయిలవడంతో ఐదు స్థానాలు దిగజారాడు. టాప్ బ్యాటర్ కోహ్లీ కూడా ఐదు స్థానాలు దిగజారాడు.
ర్యాంకింగ్స్‌లో ఇంతకముందు ఏడో స్థానంలో ఉన్న కోహ్లీ (709 పాయింట్లు) ఇప్పుడు ఐదు స్థానాలు దిగజారి 12వ ర్యాంక్‌కు పడిపోయాడు. సీనియర్లు రోహిత్-కోహ్లీ ర్యాంకింగ్స్‌లో పడిపోయినా.. జూనియర్లు జైస్వాల్-పంత్ మాత్రం టీమిండియ పరువు కాపాడారు. బంగ్లాదేశ్‌పై ఫస్ట్ టెస్ట్‌లో ఇద్దరూ రాణించడం ర్యాంకింగ్స్ మెరుగుదలకు ఉపయోగపడింది. ఆ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 39 పరుగులు చేసిన పంత్.. రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీతో చెలరేగాడు. 128 బంతుల్లో 109 పరుగుల ధనాధన్ ఇన్నింగ్స్‌తో అలరించాడు. ఇక, టెస్ట్ బౌలర్స్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఏస్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (871 పాయింట్లు) టాప్ ప్లేస్‌ను కాపాడుకున్నాడు. అతడి తర్వాతి స్థానంలో పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా (854 పాయింట్లు) నిలిచాడు. స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (804 పాయింట్లు) ఏడు నుంచి ఆరో స్థానానికి ఎగబాకాడు. వీళ్లందరూ చెన్నై టెస్ట్‌లో రాణించడంతో ర్యాంకుల్లో భారత్ హవా మరింత పెరిగింది.
Yashasvi Jaiswal becomes India’s highest ranked Test batter.
– Jaiswal at No.5.
– Pant at No.6.
– Rohit drops to No.10.
– Kohli drops to No.12. pic.twitter.com/0XiNdmJpY2— Mufaddal Vohra (@mufaddal_vohra) September 25, 2024