iDreamPost
android-app
ios-app

Jasprit Bumrah: అశ్విన్​కు సవాల్ విసురుతున్న బుమ్రా.. ఈజీగా దాటేసేలా ఉన్నాడు!

  • Published Sep 25, 2024 | 3:02 PM Updated Updated Sep 25, 2024 | 3:02 PM

Jasprit Bumrah, ICC Test bowlers rankings: టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కు సవాల్ విసురుతున్నాడు పేస్ గన్ జస్ప్రీత్ బుమ్రా. బంగ్లాతో తొలి టెస్ట్ లో 5 వికెట్లు పడగొట్టిన ఈ పేసర్.. త్వరలోనే అశ్విన్ ను దాటనున్నాడు. ఆ వివరాల్లోకి వెళితే..

Jasprit Bumrah, ICC Test bowlers rankings: టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కు సవాల్ విసురుతున్నాడు పేస్ గన్ జస్ప్రీత్ బుమ్రా. బంగ్లాతో తొలి టెస్ట్ లో 5 వికెట్లు పడగొట్టిన ఈ పేసర్.. త్వరలోనే అశ్విన్ ను దాటనున్నాడు. ఆ వివరాల్లోకి వెళితే..

Jasprit Bumrah: అశ్విన్​కు సవాల్ విసురుతున్న బుమ్రా.. ఈజీగా దాటేసేలా ఉన్నాడు!

టీమిండియా పేస్ గన్ జస్ప్రీత్ బుమ్రా ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్నాడు. బంగ్లాదేశ్ తో జరిగిన తొలి టెస్ట్ లో భారత జట్టు విజయం సాధించడంలో బుమ్రాది కీలక పాత్ర. ఈ మ్యాచ్ లో రెండు ఇన్నింగ్స్ ల్లో కలిపి 5 వికెట్లు పడగొట్టాడు ఈ యర్కర్ల కింగ్. మరోవైపు టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సైతం ఈ మ్యాచ్ లో చెలరేగిపోయాడు. బ్యాట్ తో సెంచరీ చేయడమే కాక.. బంతితో 6 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. అయితే ఇప్పుడు అశ్విన్ కు సవాల్ విసురుతున్నాడు బుమ్రా. బంగ్లాతో జరిగే సెకండ్ టెస్ట్ లో రాణిస్తే.. ఈజీగా అతడిని దాటేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

రవిచంద్రన్ అశ్విన్ కు జస్ప్రీత్ బుమ్రా నుంచి ఓ ప్రమాదం పొంచి ఉంది. అది బంగ్లాతో జరిగే రెండో టెస్ట్ లోనే ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో అశ్విన్ కు బుమ్రా సవాల్ విసురుతున్నాడు అంటూ క్రీడా నిపుణులు పేర్కొంటున్నారు. అసలు విషయం ఏంటంటే? తాజాగా ఐసీసీ ర్యాంకింగ్స్ ను ప్రకటించింది. ఇందులో పురుషుల విభాగంలో టెస్టు బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అతడు 871 పాయింట్లతో టాప్ లో ఉండగా.. తాజాగా బంగ్లాపై 5 వికెట్లు తీయడంతో.. బుమ్రా సెకండ్ ప్లేస్ లోకి దూసుకొచ్చాడు. ప్రస్తుతం బుమ్రా ఖాతాలో 854 పాయింట్లు ఉన్నాయి. వీరిద్దరి మధ్య 17 పాయింట్ల డిఫరెన్స్ ఉంది.

కాగా.. బంగ్లాతో జరిగే రెండో టెస్ట్ లో రాణించడం ద్వారా అశ్విన్ నుంచి నెంబర్ వన్ ర్యాంకును లాగేసుకోవడానికి బుమ్రా ఎంతో దూరంలో లేడు. పైగా త్వరలోనే న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ లు ఉండనే ఉన్నాయి. ప్రస్తుతం ఈ స్పీడ్ గన్ ఉన్న ఫామ్ కు వికెట్ల వేట కొనసాగించడం ఖాయంగా కనిపిస్తోంది. దాంతో త్వరలోనే టెస్టుల్లో నెంబర్ వన్ బౌలర్ గా జస్ప్రీత్ బుమ్రా అవతరించనున్నాడు. ఇక బ్యాటర్ల ర్యాంకింగ్స్ విషయానికి వస్తే.. టెస్టుల్లో యంగ్ ప్లేయర్ యశస్వీ జైస్వాల్ 5వ స్థానంలో, రిషబ్ పంత్ 6, రోహిత్ 10, కోహ్లీ 12, గిల్ 14వ స్థానాల్లో కొనసాగుతున్నారు. టాప్ 20లో ఐదుగురు టీమిండియా ప్లేయర్లు ఉండటం విశేషం. ఇక అగ్రస్థానంలో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ కొనసాగుతున్నాడు. 899 పాయింట్లతో అతడు టాప్ ప్లేస్ లో ఉన్నాడు. మరి అశ్విన్ ను బుమ్రా దాటుతాడా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.