బంగ్లాతో మ్యాచ్​పై రోహిత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. తప్పు చేశానంటూ..!

  • Author singhj Updated - 07:50 PM, Fri - 20 October 23

హ్యాట్రిక్ విజయాలతో ఫుల్ జోష్​లో ఉన్న టీమిండియా.. బంగ్లాదేశ్​పై విక్టరీతో మరో విక్టరీని తన ఖాతాలో వేసుకుంది. అయితే ఈ మ్యాచ్ తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తాను ఒక తప్పు చేశానన్నాడు హిట్​మ్యాన్.

హ్యాట్రిక్ విజయాలతో ఫుల్ జోష్​లో ఉన్న టీమిండియా.. బంగ్లాదేశ్​పై విక్టరీతో మరో విక్టరీని తన ఖాతాలో వేసుకుంది. అయితే ఈ మ్యాచ్ తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తాను ఒక తప్పు చేశానన్నాడు హిట్​మ్యాన్.

  • Author singhj Updated - 07:50 PM, Fri - 20 October 23

వన్డే వరల్డ్ కప్​-2023లో భారత్ దూకుడుకు అడ్డే లేకుండా పోతోంది. హ్యాట్రిక్ విజయాలతో దూసుకెళ్తున్న రోహిత్ సేన.. నాలుగో మ్యాచ్​లో బంగ్లాదేశ్​పై నెగ్గి మరో సక్సెస్​ను ఖాతాలో వేసుకుంది. గత రికార్డుల దృష్ట్యా ఈ మ్యాచ్​లో బంగ్లాదేశ్ గట్టి పోటీని ఇస్తుందని అంతా అనుకున్నారు. ఆఫ్ఘానిస్థాన్​, నెదర్లాండ్స్​ల మాదిరిగా బంగ్లా కూడా సంచలన విజయం సాధిస్తుందని కొందరు అనలిస్టులు కూడా అంచనా వేశారు. కానీ వాళ్లకు షాకిస్తూ బంగ్లాను చిత్తు చేసింది టీమిండియా. ఆ టీమ్​కు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా మ్యాచ్​ను వన్​సైడ్​గా నెగ్గింది.

భారత్ వరుస విజయాల్లో కెప్టెన్ రోహిత్ శర్మ పాత్ర ఎంతో కీలకమనే చెప్పాలి. ఆస్ట్రేలియాతో ఆడిన ఒక్క మ్యాచ్ తప్పితే మెగా టోర్నీలో హిట్​మ్యాన్ భీకర ఫామ్​లో కనిపిస్తున్నాడు. ఆఫ్ఘానిస్థాన్​ఫై సెంచరీ బాదిన అతడు.. పాకిస్థాన్​ మీద హాఫ్ సెంచరీ కొట్టాడు. బంగ్లాతో మ్యాచ్​లో రోహిత్ (48) కొద్దిలో అర్ధ శతకాన్ని చేసే ఛాన్స్​ను మిస్సయ్యాడు. అయితే ప్రత్యర్థి జట్టు బౌలర్లపై ఫోర్లు, సిక్సులతో విరుచుకుపడుతూ ఛేజింగ్​లో భారత్​కు మంచి ఓపెనింగ్ అందించాడు. అటు కెప్టెన్సీలోనూ తన మార్క్​ను చూపించాడు. వికెట్లు పడని టైమ్​లో బౌలర్లతో కలసి ప్లాన్స్ మార్చి, వారిని ఎంకరేజ్ చేసి టీమ్​ను తిరిగి పోటీలోకి తీసుకొచ్చాడు. అయితే కెప్టెన్సీ నాక్​తో టీమిండియాకు మరో విజయాన్ని కట్టబెట్టిన రోహిత్.. మ్యాచ్​లో ఔటైన తీరు మాత్రం షాకింగ్​గా అనిపించింది.

కుర్ర పేసర్ హసన్ మహమూద్ వరుసగా బౌన్సర్లతో హిట్​మ్యాన్​ను కవ్వించాడు. రోహిత్ బౌండరీలు, సిక్స్ కొట్టినా హసన్ వెనక్కి తగ్గలేదు. మళ్లీ టార్గెట్ చేస్తూ షార్ట్ బాల్స్ సంధించాడు. దీంతో మరో భారీ షాట్ కొట్టే క్రమంలో బౌండరీ దగ్గర క్యాచ్​ ఇచ్చి ఔటయ్యాడు రోహిత్. షార్ట్ బాల్స్​ను సిక్సర్లుగా మలిచే భారత కెప్టెన్.. ఆ బాల్​కే ఔటవ్వడం కాస్త షాకింగ్ అనే చెప్పాలి. ఈ విషయంపై మ్యాచ్ తర్వాత రోహిత్ స్పందించాడు. దీని మీద గిల్​తో మాట్లాడుతూ తాను తప్పు చేశానన్నాడు. ఆ బాల్​ను పైకి కొట్టి సిక్సర్​గా మలచాల్సిందని.. కానీ అనవసరంగా కిందకు షాట్ ఆడి తప్పు చేశానన్నాడు. మరి.. తాను ఔటవ్వడంపై రోహిత్ చేసిన వ్యాఖ్యల మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: World Cup: పాపం హరీస్‌ రౌఫ్‌! మరీ ఇంత దారుణంగా కొట్టారేంటి బ్రో!

Show comments