హ్యాట్రిక్ విజయాలతో ఫుల్ జోష్‌లో ఉన్న టీమిండియా.. బంగ్లాదేశ్‌పై విక్టరీతో మరో విక్టరీని తన ఖాతాలో వేసుకుంది. అయితే ఈ మ్యాచ్ తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తాను ఒక తప్పు చేశానన్నాడు హిట్‌మ్యాన్.
హ్యాట్రిక్ విజయాలతో ఫుల్ జోష్‌లో ఉన్న టీమిండియా.. బంగ్లాదేశ్‌పై విక్టరీతో మరో విక్టరీని తన ఖాతాలో వేసుకుంది. అయితే ఈ మ్యాచ్ తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తాను ఒక తప్పు చేశానన్నాడు హిట్‌మ్యాన్.
వన్డే వరల్డ్ కప్-2023లో భారత్ దూకుడుకు అడ్డే లేకుండా పోతోంది. హ్యాట్రిక్ విజయాలతో దూసుకెళ్తున్న రోహిత్ సేన.. నాలుగో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై నెగ్గి మరో సక్సెస్‌ను ఖాతాలో వేసుకుంది. గత రికార్డుల దృష్ట్యా ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ గట్టి పోటీని ఇస్తుందని అంతా అనుకున్నారు. ఆఫ్ఘానిస్థాన్, నెదర్లాండ్స్‌ల మాదిరిగా బంగ్లా కూడా సంచలన విజయం సాధిస్తుందని కొందరు అనలిస్టులు కూడా అంచనా వేశారు. కానీ వాళ్లకు షాకిస్తూ బంగ్లాను చిత్తు చేసింది టీమిండియా. ఆ టీమ్‌కు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా మ్యాచ్‌ను వన్‌సైడ్‌గా నెగ్గింది.
భారత్ వరుస విజయాల్లో కెప్టెన్ రోహిత్ శర్మ పాత్ర ఎంతో కీలకమనే చెప్పాలి. ఆస్ట్రేలియాతో ఆడిన ఒక్క మ్యాచ్ తప్పితే మెగా టోర్నీలో హిట్‌మ్యాన్ భీకర ఫామ్‌లో కనిపిస్తున్నాడు. ఆఫ్ఘానిస్థాన్ఫై సెంచరీ బాదిన అతడు.. పాకిస్థాన్ మీద హాఫ్ సెంచరీ కొట్టాడు. బంగ్లాతో మ్యాచ్‌లో రోహిత్ (48) కొద్దిలో అర్ధ శతకాన్ని చేసే ఛాన్స్‌ను మిస్సయ్యాడు. అయితే ప్రత్యర్థి జట్టు బౌలర్లపై ఫోర్లు, సిక్సులతో విరుచుకుపడుతూ ఛేజింగ్‌లో భారత్‌కు మంచి ఓపెనింగ్ అందించాడు. అటు కెప్టెన్సీలోనూ తన మార్క్‌ను చూపించాడు. వికెట్లు పడని టైమ్‌లో బౌలర్లతో కలసి ప్లాన్స్ మార్చి, వారిని ఎంకరేజ్ చేసి టీమ్‌ను తిరిగి పోటీలోకి తీసుకొచ్చాడు. అయితే కెప్టెన్సీ నాక్‌తో టీమిండియాకు మరో విజయాన్ని కట్టబెట్టిన రోహిత్.. మ్యాచ్‌లో ఔటైన తీరు మాత్రం షాకింగ్‌గా అనిపించింది.
కుర్ర పేసర్ హసన్ మహమూద్ వరుసగా బౌన్సర్లతో హిట్‌మ్యాన్‌ను కవ్వించాడు. రోహిత్ బౌండరీలు, సిక్స్ కొట్టినా హసన్ వెనక్కి తగ్గలేదు. మళ్లీ టార్గెట్ చేస్తూ షార్ట్ బాల్స్ సంధించాడు. దీంతో మరో భారీ షాట్ కొట్టే క్రమంలో బౌండరీ దగ్గర క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు రోహిత్. షార్ట్ బాల్స్‌ను సిక్సర్లుగా మలిచే భారత కెప్టెన్.. ఆ బాల్కే ఔటవ్వడం కాస్త షాకింగ్ అనే చెప్పాలి. ఈ విషయంపై మ్యాచ్ తర్వాత రోహిత్ స్పందించాడు. దీని మీద గిల్‌తో మాట్లాడుతూ తాను తప్పు చేశానన్నాడు. ఆ బాల్‌ను పైకి కొట్టి సిక్సర్‌గా మలచాల్సిందని.. కానీ అనవసరంగా కిందకు షాట్ ఆడి తప్పు చేశానన్నాడు. మరి.. తాను ఔటవ్వడంపై రోహిత్ చేసిన వ్యాఖ్యల మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: World Cup: పాపం హరీస్ రౌఫ్! మరీ ఇంత దారుణంగా కొట్టారేంటి బ్రో!
Rohit Sharma being Rohit Sharma.😭pic.twitter.com/51hHhavAtq
— Sir Dinda⁴⁵ (@FuriousDinda) October 20, 2023