ఆఫ్ఘానిస్థాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఎప్పుడూ తన బౌలింగ్, బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్తో వార్తల్లో నిలుస్తుంటాడు. అయితే ఈసారి తన బౌలింగ్ యాక్షన్ కారణంగా వైరల్ అయ్యాడు.
ఆఫ్ఘానిస్థాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఎప్పుడూ తన బౌలింగ్, బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్తో వార్తల్లో నిలుస్తుంటాడు. అయితే ఈసారి తన బౌలింగ్ యాక్షన్ కారణంగా వైరల్ అయ్యాడు.
వన్డే వరల్డ్ కప్-2023లో రెండు చిన్న టీమ్స్ అదిరిపోయే ఆటతీరుతో అందర్నీ ఇంప్రెస్ చేస్తున్నాయి. తమ గేమ్‌తో ఫ్యాన్స్ మనసులు దోచుకుంటున్న ఈ రెండు జట్లు.. పెద్ద టీమ్స్‌కు మాత్రం వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. ఆ రెండు టీమ్స్ మరేవో కాదు.. ఒకటి నెదర్లాండ్స్, ఇంకొకటి ఆఫ్ఘానిస్థాన్. సౌతాఫ్రికాకు షాకిచ్చిన డచ్ జట్టు.. ఆ విజయం గాలివాటం కాదని నిరూపిస్తూ మిగిలిన మ్యాచుల్లోనూ శక్తికి, స్థాయికి మించిన పెర్ఫార్మెన్స్ ఇస్తోంది. ఆఫ్ఘానిస్థాన్ అయితే తాము పసికూనలం కాదని ప్రూవ్ చేసుకునేందుకు కసితో ఆడుతూ రెండు పెద్ద టీమ్స్‌పై విక్టరీ కొట్టింది.
తొలుత డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌ను ఓడించిన ఆఫ్ఘానిస్థాన్.. రీసెంట్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. ఇంగ్లీష్ టీమ్‌పై తాము అదృష్టంతో గెలవలేదని.. పాక్‌పై గెలుపు ద్వారా ప్రూవ్ చేసింది. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో ఆఫ్ఘాన్ ఆడిన తీరు అద్భుతమనే చెప్పాలి. ఆ మ్యాచ్‌లో ఆఫ్ఘాన్ కాదు.. పాక్ పసికూన టీమ్‌లా కనిపించింది. స్పిన్‌కు అనుకూలించే పిచ్ మీద యంగ్ స్పిన్నర్ నూర్ అహ్మద్ (3/49) పాక్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. బ్యాటింగ్‌లో రహ్మత్ షా (77 నాటౌట్), గుర్బాజ్ (65), ఇబ్రహీం జాద్రాన్ (87), హష్మతుల్లా (48 నాటౌట్)లు అదరగొట్టారు. ఎలాంటి బెరుకు, ఆందోళన లేకుండా అటాకింగ్ గేమ్ ఆడుతూ టార్గెట్‌ను కూల్‌గా ఛేదించారు.
ఇంగ్లండ్‌తో మాదిరిగానే సాధికారికంగా ఆడి పాకిస్థాన్‌ను చిత్తు చేసింది ఆఫ్ఘానిస్థాన్. ముఖ్యంగా ఆ టీమ్ బ్యాటర్లు బౌండరీలు, సిక్సుల మీదే ఆధారపడకుండా సింగిల్స్, డబుల్స్‌తో స్ట్రైక్ రొటేట్ చేశారు. పాక్ బౌలర్లకు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా టార్గెట్‌ను ఛేజ్ చేశారు. ఆ దేశ క్రికెట్ హిస్టరీలో ఈ వరల్డ్ కప్ ఎప్పటికీ గుర్తుండిపోతుందని చెప్పొచ్చు. ఇక, పాక్‌తో మ్యాచ్‌లో స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ (0/44) వికెట్ తీయలేకపోయాడు. కానీ అతడు బౌలింగ్ వేస్తున్న టైమ్‌లో ఏ బంతికి వికెట్ పడుతుందో అన్నంత ఉత్కంఠ రేగింది. ముజీబ్‌తో కలసి రషీద్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. దీంతో పాక్ బ్యాటర్లు ఒత్తిడిలో పడి యంగ్ స్పిన్నర్ నూర్ అహ్మద్‌కు వికెట్లు అప్పగించారు.
ఇక, పాక్‌తో ఆఫ్ఘాన్ మ్యాచ్ స్టార్ట్ అయ్యేందుకు ముందు రషీద్ ఖాన్ వెరైటీ బౌలింగ్ యాక్షన్‌తో బాల్స్ వేస్తూ ఆకట్టుకున్నాడు. ఏకంగా రెండు బంతుల్ని తన చేతిలో బిగించి బౌలింగ్ వేయడగమే గాక స్పిన్ చేశాడు. ఇది చూసిన నెటిజన్స్.. ఇలాంటి బౌలింగ్ ఎప్పుడూ చూడలేదని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇదెక్కడి మాస్ బౌలింగ్ రా మావా అంటున్నారు. రషీద్.. అవి చేతులా? లేదా ఇనుప రాడ్లా? అలా ఎలా బౌలింగ్ చేశావ్ బ్రో అని ప్రశ్నిస్తున్నారు ఫ్యాన్స్. బౌలింగ్ మిషన్ మాదిరిగా రెండు బంతుల్ని హోల్డ్ చేసి ఒకేసారి ఎలా వేశావని క్వశ్చన్ చేస్తున్నారు. మరి.. రషీద్ వెరైటీ బౌలింగ్‌పై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: World Cup 2023: ఇంగ్లండ్ కంటే పాక్‌పై గెలుపు ఆఫ్ఘాన్‌కు ఎందుకంత స్పెషల్? ఫుల్ స్టోరీ