iDreamPost

World Cup 2023: ఇంగ్లండ్‌ కంటే పాక్‌పై గెలుపు ఆఫ్ఘాన్‌కు ఎందుకంత స్పెషల్‌? ఫుల్‌ స్టోరీ

  • Published Oct 24, 2023 | 6:16 PMUpdated Oct 24, 2023 | 6:16 PM

ఈ వరల్డ్‌ కప్‌లో ఆఫ్ఘనిస్థాన్‌.. పాకిస్థాన్‌ను ఓడించింది. కానీ, అంతకంటే ముందే డిఫెండింగ్‌ ఛాంపియన్‌ అయిన ఇంగ్లండ్‌ను సైతం మట్టి కరిపించింది. కానీ, ఇంగ్లండ్‌పై విజయం తర్వాత చేసుకున్న సెలబ్రేషన్స్‌ కంటే.. పాకిస్థాన్‌పై గెలిచిన తర్వాత ఎక్కువ సెలబ్రేట్‌ చేసుకుంటుంది. దీనికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ వరల్డ్‌ కప్‌లో ఆఫ్ఘనిస్థాన్‌.. పాకిస్థాన్‌ను ఓడించింది. కానీ, అంతకంటే ముందే డిఫెండింగ్‌ ఛాంపియన్‌ అయిన ఇంగ్లండ్‌ను సైతం మట్టి కరిపించింది. కానీ, ఇంగ్లండ్‌పై విజయం తర్వాత చేసుకున్న సెలబ్రేషన్స్‌ కంటే.. పాకిస్థాన్‌పై గెలిచిన తర్వాత ఎక్కువ సెలబ్రేట్‌ చేసుకుంటుంది. దీనికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Oct 24, 2023 | 6:16 PMUpdated Oct 24, 2023 | 6:16 PM
World Cup 2023: ఇంగ్లండ్‌ కంటే పాక్‌పై గెలుపు ఆఫ్ఘాన్‌కు ఎందుకంత స్పెషల్‌? ఫుల్‌ స్టోరీ

వరల్డ్‌ కప్‌లో ఆఫ్ఘనిస్థాన్‌ మరో సంచలనం నమోదు చేసింది. ఇప్పటికే ఈ టోర్నీలో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లండ్‌ మట్టికరిపించిన ఆఫ్ఘనిస్థాన్‌ జట్టు.. సోమవారం చెన్నైలోని చెపాక్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను చిత్తుగా ఓడించింది. ఏకంగా 8 వికెట్ల తేడాతో గెలుపోంది పాక్‌ పరువు తీసింది. పైగా 283 పరుగుల భారీ టార్గెట్‌ను ఛేదిస్తూ.. ఎక్కడా తడబడకుండా ఓ ఛాంపియన్‌ టీమ్‌లా ఆడింది ఆఫ్ఘనిస్థాన్‌. కాగా.. ఇంగ్లండ్‌పై విజయం సాధించిన దానికంటే కూడా పాకిస్తాన్‌పై వచ్చిన విజయాన్నే ఆఫ్ఘనిస్థాన్‌ క్రికెటర్లు ఎక్కువగా సెలబ్రేట్‌ చేసుకున్నారు. అలాగే ఆ దేశ క్రికెట్‌ అభిమానులు కూడా అదే రేంజ్‌లో బాణాసంచ కాల్చి సంబురాలు జరుపుకున్నారు.

ఆఫ్ఘనిస్థాన్‌లో జరిగిన సంబురాలకు సంబంధించిన వీడియోలో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఇక ఆఫ్ఘనిస్థాన్‌ క్రికెటర్లు అయితే.. ఏకంగా వరల్డ్‌ కప్‌ గెలిచినంత రేంజ్‌లో సంబురాలు జరుపుకున్నారు. చెపాక్‌ గ్రౌండ్‌ గ్రౌండ్‌ మొత్తం తిరుగుతూ.. తమకు మద్దతు తెలిపిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే.. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ అయినా ఇంగ్లండ్‌ను ఓడించి కూడా ఇంత సంతోష పడని ఆఫ్ఘనిస్థాన్‌ క్రికెటర్లు.. పాకిస్థాన్‌పై గెలిచిన తర్వాత ఎందుకు ఇంతలా సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు? అనే అనుమానం క్రికెట్‌ అభిమానుల్లో కలుగుతుంది. తమ కంటే బెటర్‌ టీమ్‌ అయిన పాకిస్థాన్‌పై గెలుపు వస్తే ఆ మాత్రం సంతోష పడొచ్చని అనుకోవచ్చు కానీ, వారి సంబురాల వెనుక ఓ విషాదం కూడా ఉంది.

అదేంటంటే.. ఆఫ్ఘనిస్థాన్‌లో ప్రజా స్వామ్య ప్రభుత్వం పోయి తాలిబన్ల పాలన వచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆ దేశ ప్రజలపై అనేక ఆంక్షలు విధించారు. అలాగే భూకంపాలు, పేదరికం కారణంగా చాలా మంది పేద ఆఫ్ఘానీలు దేశ విడిచి పాకిస్థాన్‌కు వలుస వెళ్లారు. పొట్ట చేత పట్టుకుని దొరికిన పని చేసుకునేందుకు వచ్చిన ఆఫ్ఘానీలపై పాక్‌ ఏ మాత్రం కనికరం చూపకుండా వారిని బలవంతంగా తమ దేశం నుంచి వెల్లగొట్టింది. అలా చాలా మంది దిక్కులేక మళ్లీ ఆఫ్ఘనిస్థాన్‌కు వచ్చేశారు. దీంతో చాలా మందికి పాకిస్థాన్‌ అంటే ఇండియన్స్‌ కంటే ఎక్కువ కోపం ఆఫ్ఘానీల్లో పెరిగిపోయింది.

అందుకే పాకిస్థాన్‌పై విజయం వారికెంతో సంతోషాన్ని ఇచ్చింది. పాక్‌పై గెలుపును వారు జస్ట్‌ క్రికెట్‌ మ్యాచ్‌లో విజయంలా చూడటం లేదు. తమపై కనికరం చూపకుండా గెంటేసిన అహంకారంపై విజయంలా చూస్తున్నారు. అందుకే పాకిస్థాన్‌పై విజయాన్ని అంతలా సెలబ్రేట్‌ చేసుకున్నారు. అందుకే ఈ మ్యాచ్‌లో ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు గెల్చుకున్న ఇబ్రహీం జడ్రాన్‌ ఏకంగా తన ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డును పాకిస్థాన్‌ నుంచి ఆఫ్ఘనిస్థాన్‌కు తిరిగి వచ్చేసిన వారికి అకింతం ఇచ్చాడు. మరి ఆఫ్ఘాన్‌ సంబురాల వెనుకున్న బాధపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: VIDEO: పాక్‌ ఓటమి.. రషీద్‌ ఖాన్‌తో కలిసి డాన్స్‌ వేసిన టీమిండియా క్రికెటర్‌!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి