సెమీఫైనల్లో టీమిండియా-న్యూజిలాండ్ తలపడటం దాదాపుగా ఖాయమైంది. ఈ నేపథ్యంలో భారత లెజెండరీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
సెమీఫైనల్లో టీమిండియా-న్యూజిలాండ్ తలపడటం దాదాపుగా ఖాయమైంది. ఈ నేపథ్యంలో భారత లెజెండరీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
వన్డే వరల్డ్ కప్-2023 కీలక దశకు చేరుకుంది. లీగ్ మ్యాచ్‌లు ముగింపు దశకు చేరుకున్నాయి. దీంతో అందరూ నాకౌట్ మ్యాచుల మీద దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికే సెమీఫైనల్ చేరుకునే టీమ్స్ మీద దాదాపుగా ఒక క్లారిటీ వచ్చేసింది. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మధ్య ఓ సెమీస్ కన్ఫర్మ్ అయిపోయింది. మరో సెమీఫైనల్లో టీమిండియాతో న్యూజిలాండ్ ఆడటం దాదాపుగా ఖాయమైందనే చెప్పాలి. పాకిస్థాన్, ఆఫ్ఘానిస్థాన్ నాకౌట్ మ్యాచ్‌లకు క్వాలిఫై అవ్వడం అసాధ్యమనే చెప్పాలి. టెక్నికల్‌గా ప్రకటించకపోయినా విలియమ్సన్ టీమ్ సెమీస్ బెర్తు సొంతం చేసుకుందని చెప్పొచ్చు. ఫైనల్లో చోటు కోసం ఈ నెల 15వ తేదీన ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగే మ్యాచ్‌లో భారత్‌ను ఢీకొనాల్సి ఉంటుంది కివీస్.
మెగా టోర్నీలో వరుసగా నాలుగు విజయాలతో దుమ్మురేపిన కివీస్.. ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓటమి పాలైంది. కానీ సెమీస్ చేరాలంటే కీలకంగా మారిన మ్యాచ్‌లో కెప్టెన్ కేన్ విలియమ్సన్, లాకీ ఫెర్గూసన్ టీమ్‌లో చేరడంతో అనుకున్నది సాధించింది. టెక్నికల్‌గా ప్రకటించికపోయినా భారత సెమీస్ ప్రత్యర్థి న్యూజిలాండ్ అని తేలిపోయింది. దీంతో టీమిండియా ఫ్యాన్స్‌కు ఒక భయం పట్టుకుంది. వరల్డ్ కప్స్‌లో కివీస్‌పై మనకు గొప్ప రికార్డు లేదు. 2019 ప్రపంచ కప్ సెమీస్‌లో ఆ టీమ్ చేతుల్లోనే భారత్ ఓడిపోయింది. ఫైనల్ చేరాలంటే నెగ్గి తీరాల్సిన ఆ మ్యాచ్‌లో 239 రన్స్ ఛేజింగ్‌కు దిగిన టీమిండియా 221 రన్స్‌కు ఆలౌటైంది. దీంతో మళ్లీ అదే రిపీట్ అవుతుందేమోనని అభిమానులు టెన్షన్ పడుతున్నారు. కివీస్ తప్ప ఏ టీమ్‌తో ఆడాల్సి వచ్చినా ఈ ఆందోళన ఉండేది కాదంటున్నారు.
వన్డే వరల్డ్ కప్స్‌లో ఇప్పటిదాకా భారత్-న్యూజిలాండ్‌లు 10 సార్లు తలపడ్డాయి. ఇందులో టీమిండియా నాలుగు సార్లు గెలవగా.. కివీస్ ఐదు సార్లు నెగ్గింది. ఒక మ్యాచ్‌లో రిజల్ట్ రాలేదు. 2003 వరల్డ్ కప్ తర్వాత నుంచి మన టీమ్‌పై మెగా టోర్నీలో కివీస్ డామినేషన్ చూపిస్తోంది. అయితే ఈ వరల్డ్ కప్‌లో మాత్రం సిచ్యువేషన్ వేరేగా ఉంది. రోహిత్ సేన ఆడిన 8 మ్యాచుల్లోనూ నెగ్గింది. లీగ్ దశలో న్యూజిలాండ్‌తో ఆడిన మ్యాచులోనూ విజయం సాధించింది. సొంత గడ్డపై ఆడుతుండటం, ఫ్యాన్స్ సపోర్ట్, పిచ్ కండీషన్స్ తెలియడం, సూపర్ ఫామ్‌లో ఉండటంతో నాకౌట్ పోరులోనూ కివీస్‌ను భారత్ చిత్తు చేస్తుందని క్రికెట్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. తాజాగా ఈ అంశంపై లెజెండరీ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్ రియాక్ట్ అయ్యాడు. మళ్లీ ఆ దరిద్రమేనా అంటూ తనదైన శైలిలో స్పందించాడు సెహ్వాగ్. అయినా సరే కివీస్‌కు గట్టిగా ఇచ్చి పడేయాలన్నాడు. ప్రత్యర్థి ఎవరనేది కాదు.. కప్పే ముఖ్యమన్నాడు వీరూ. మరి.. సెహ్వాగ్ వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: కోహ్లీపై ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ ఘాటు విమర్శలు.. అతడో ఇడియట్ అంటూ..!