Notice: Undefined variable: rel in /var/www/html/veegamcms/wp-content/themes/veegamtheam-new/seo/seo-function.php on line 1662
iDreamPost

Notice: Undefined variable: review in /var/www/html/veegamcms/wp-content/themes/veegamtheam-new/single.php on line 13

కోహ్లీపై ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ ఘాటు విమర్శలు.. అతడో ఇడియట్ అంటూ..!

  • Author singhj Published - 09:38 AM, Fri - 10 November 23

భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై ఒక ఇంగ్లీష్ ప్లేయర్ ఘాటు విమర్శలు చేశాడు. కోహ్లీ ఓ ఇడియట్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై ఒక ఇంగ్లీష్ ప్లేయర్ ఘాటు విమర్శలు చేశాడు. కోహ్లీ ఓ ఇడియట్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

  • Author singhj Published - 09:38 AM, Fri - 10 November 23

Notice: Undefined variable: output in /var/www/html/veegamcms/wp-content/themes/veegamtheam-new/functions.php on line 151
కోహ్లీపై ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ ఘాటు విమర్శలు.. అతడో ఇడియట్ అంటూ..!

విరాట్ కోహ్లీ.. ఈ పేరు వింటేనే ప్రత్యర్థి టీమ్స్ భయపడిపోతాయి. గ్రౌండ్ బయట ఎంతో కూల్​గా ఉండే కోహ్లీ.. మైదానంలో మాత్రం చాలా అగ్రెసివ్​గా ఉంటాడు. తోటి ప్లేయర్లను ప్రోత్సహిస్తుంటాడు. బ్యాటింగ్​తో పాటు ఫీల్డింగ్​లోనూ దూకుడుగా ఉంటాడు. ప్రత్యర్థి ఆటగాళ్లు ఎవరైనా స్లెడ్జింగ్​కు దిగితే వారికి మాటలతోనే సమాధానం చెబుతాడు. అందుకే కోహ్లీ కెప్టెన్​గా ఉన్న టైమ్​లో భారత ప్లేయర్లతో పెట్టుకోవాలంటే అపోజిషన్ టీమ్స్ భయపడేది. ఒకప్పుడు ఆస్ట్రేలియా లాంటి ఫారెన్ కంట్రీస్ ఎక్కువగా స్లెడ్జింగ్ చేసేవి. కానీ ఆసియాలోని చాలా క్రికెటర్స్ నోటితో కాకుండా బ్యాటుతో, బంతితో జవాబు చెప్పేందుకు ఇష్టపడేవారు. కోహ్లీ మాత్రం బ్యాట్​తో పాటు అవసరమైతే మాటలతోనూ ప్రత్యర్థులపై ఎదురుదాడికి దిగుతాడు.

ప్రత్యర్థి టీమ్స్ కవ్వించినప్పుడు కోహ్లీ మరింత రెచ్చిపోయి ఆడతాడదనేది తెలిసిందే. అయితే విరాట్ ప్రవర్తనను ఒక ఇంగ్లీష్ ప్లేయర్ తప్పుపట్టాడు. ఇంగ్లండ్ స్టార్ ఓపెనర్ అలెక్స్ లీస్ కింగ్ కోహ్లీని తప్పుబడుతూ.. అతడో ఇడియట్ అని సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. ఎడ్జ్​బాస్టన్ వేదికగా 2022లో టీమిండియా, ఇంగ్లండ్ మధ్య ఐదో టెస్ట్ జరిగింది. ఆ మ్యాచ్​లో ఫస్ట్ బ్యాటింగ్​ చేసిన భారత్ 416 రన్స్​కు ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్​కు దిగిన ఇంగ్లీష్ టీమ్ 83 రన్స్​కే 5 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో జానీ బెయిర్​ స్టోను కోహ్లీ స్లెడ్జింగ్ చేశాడని అలెక్స్ లీస్ చెప్పాడు. అయితే ఆ మ్యాచ్​లో బెయిర్ స్టో సెంచరీ చేశాడని.. ఆ తర్వాత ఇంగ్లండ్ ఫ్యాన్స్ కోహ్లీకి బుద్ధి చెప్పారని లీస్ తెలిపాడు.

‘నేను పెద్దగా ఎక్స్​పీరియెన్స్ లేని ప్లేయర్​ను. కానీ విరాట్ కోహ్లీ ఎంతో అనుభవంతో పాటు క్రేజ్ సంపాదించాడు. దీన్ని ఛాన్స్​గా తీసుకొని అతడు స్లెడ్జింగ్ చేసేవాడు. ఎవరైనా నన్ను భయపెట్టేందుకు ప్రయత్నిస్తే నేను అస్సలు సహించను. ఆ మ్యాచ్​లో బెయిర్ స్టోతో పాటు నన్ను కూడా కోహ్లీ స్లెడ్జ్ చేశాడు. అతడు ఎంత గొప్ప క్రికెటరైనా నా దృష్టిలో మాత్రం ఒక ఇడియట్’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు లీస్. టెలిగ్రాఫ్.కో.యూకే అనే పుస్తకంలో లీస్ ఈ మేరకు కోహ్లీతో తనకు ఎదురైన అనుభవాన్ని గురించి రాశాడని తెలుస్తోంది. అయితే ఎడ్జ్​బాస్టన్ టెస్టులో భారత్ ఓడిపోయింది. అందులో ఫస్ట్ ఇన్నింగ్స్​లో 11 రన్స్ చేసిన విరాట్.. సెకండ్ ఇన్నింగ్స్​లోనూ 20 రన్స్ చేసి ఫెయిలయ్యాడు. అయితే కోహ్లీపై లీస్ చేసిన కామెంట్స్ మీద భారత ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. విరాట్ మీద విమర్శలు చేసే అర్హత నీకు ఉందా? అంటూ ఫైర్ అవుతున్నారు. మరి.. కోహ్లీపై లీస్ చేసిన వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: వీడియో: ప్రపంప కప్ లో చెత్త రివ్యూ.. నవ్వాపుకోలేకపోయిన కేన్ మామ!

 

View this post on Instagram

 

A post shared by 12th Khiladi Cricket (@12thkhiladi_cricket)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి