వరల్డ్ కప్ మొత్తం భారత్ ఒక ప్లాన్ ప్రకారం ఆడుతూ వచ్చింది. మెగా టోర్నీలో ఓ ప్యాటర్న్‌ను ఫాలో అవుతూ వచ్చింది రోహిత్ సేన. కానీ ఆఖరుకు వచ్చేసరికి అదే మన కొంపముంచింది.
వరల్డ్ కప్ మొత్తం భారత్ ఒక ప్లాన్ ప్రకారం ఆడుతూ వచ్చింది. మెగా టోర్నీలో ఓ ప్యాటర్న్‌ను ఫాలో అవుతూ వచ్చింది రోహిత్ సేన. కానీ ఆఖరుకు వచ్చేసరికి అదే మన కొంపముంచింది.
ఈసారి కొట్టేస్తున్నాం, కప్పు మనదే, మనల్ని ఎవడ్రా ఆపేది అనుకున్నాం. ఆస్ట్రేలియా అడ్రస్ గల్లంతే.. భారత్ ఒడిలో కప్పు ఖాయమని ఫిక్స్ అయ్యాం. సెలబ్రేషన్స్‌కు రెడీ అయిపోయాం. మరోసారి దీపావళి వచ్చేస్తోందని.. టీమిండియా గెలిస్తే టపాసులు పేల్చేందుకూ సిద్ధమైపోయాం. కానీ గంపెడాశలు పెట్టుకున్న కోట్లాది మంది ఇండియన్ ఫ్యాన్స్ హార్ట్ బ్రేక్ అయింది. వరల్డ్ కప్ కొడుతుందనుకున్న రోహిత్ సేన.. ప్రతిష్టాత్మక ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. వరుస విజయాలతో కమ్ నమ్దే అంటూ ధీమాను పెంచిన మన జట్టు.. ఆఖరి మెట్టుపై బోల్తా పడింది.
టీమిండియా ఓటమిని తట్టుకోలేక ప్లేయర్లతో పాటు అభిమానులు కూడా కన్నీళ్ల పర్యంతం అవుతున్నారు. కప్ వేటలో మరోసారి నిరాశ ఎదురవ్వడం, అదీ 2003 ఫైనల్లో ఓడించిన ఆసీస్ చేతిలోనే ఓటమితో తట్టుకోలేకపోతున్నారు. వరల్డ్ కప్ ఫైనల్లో ఆసీస్ చేతిలో భారత్ ఓటమికి ఎన్నో కారణాలు కనిపిస్తున్నాయి. టాస్ ఓడిపోవడం, బ్యాటర్ల ఫెయిల్యూర్, ఫీల్డింగ్ లోపాలు, బౌలర్లు తేలిపోవడం, అనుకున్న ప్లాన్స్‌ను అనుకున్నట్లుగా ఎగ్జిక్యూట్ చేయకపోవడం, ఏ విషయంలోనూ లక్ కలసి రాకపోవడం కొన్ని కారణాలు. మ్యాచ్ ఓటమికి మెయిన్ రీజన్ మాత్రం కెప్టెన్ రోహిత్ శర్మ ఔట్ అనే చెప్పాలి. మెగా టోర్నీ మొత్తంలో టీమిండియా ఒక ప్యాటర్న్ ఫాలో అయింది.
వరల్డ్ కప్ మొత్తం బ్యాటింగ్‌లో రోహిత్ శర్మ వేగంగా ఆడటం, ప్రెజర్‌ను తాను తీసుకొని హిట్టింగ్‌కు వెళ్లడం, అపోజిషన్‌పై ఒత్తిడి పెంచడం చేశాడు. దీని వల్ల తర్వాత వచ్చే విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ స్వేచ్ఛగా ఆడేందుకు, అవసరమైతే బ్యాట్ ఝళిపించేందుకు అవకాశం దొరికింది. టోర్నీ అంతటా ఈ ఫార్ములా సక్సెస్ అయింది. కానీ కీలకమైన ఫైనల్లో మాత్రం అదే భారత్‌ను దెబ్బతీసింది. బ్యాటింగ్‌కు కష్టంగా మారిన అహ్మదాబాద్ పిచ్ మీద మన జట్టులో రోహిత్ శర్మ, ఆసీస్‌లో ట్రావిస్ హెడ్ మాత్రమే ఈజీగా రన్స్ చేశారు. హెడ్ ఆఖరి వరకు ఉండి సెంచరీతో గెలుపులో కీలపాత్ర పోషించాడు. భారత ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ త్వరగా ఔటవ్వడం మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్‌గా మారింది. మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో ఆ ఓవర్లో అప్పటికే 10 రన్స్ వచ్చినా మరో భారీ షాట్ ఆడేందుకు వెళ్లి హిట్‌మ్యాన్ ఔటయ్యాడు. ఈ ఔట్‌తో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది.
రోహిత్ తర్వాత వచ్చిన కోహ్లీ, రాహుల్ రన్స్ తీసేందుకు ఆపసోపాలు పడ్డారు. క్రీజులో కుదురుకున్నాక హిట్టింగ్ చేద్దామని ప్రయత్నించి ఔటయ్యారు. హిట్‌మ్యాన్ ఇచ్చిన క్యాచ్‌ను వెనక్కి పరిగెత్తుతూ వెళ్లి అందుకున్నాడు హెడ్. అతను అందుకుంది క్యాచ్ కాదు.. మ్యాచ్ అని తర్వాత అర్థమైంది. హిట్‌మ్యాన్ ఔటయ్యాక 11 నుంచి 50 ఓవర్ల మధ్య 4 ఫోర్లు వచ్చాయి, ఒక్క సిక్స్ కూడా రాలేదు. ఒక దశలో 75 బంతుల వరకు ఒక్క బౌండరీ కూడా కొట్టలేదు మన బ్యాటర్లు. అన్ని మ్యాచుల్లోలా కాకుండా రోహిత్ గనుక క్రీజులో ఉండి ఆఖరి వరకు ఆడుంటే రిజల్ట్ వేరేలా ఉండేది. షాట్లకు పోకుండా స్ట్రైక్ రొటేట్ చేస్తూ అప్పుడప్పుడు బౌండరీలు కొట్టినా ఈజీగా 300 ప్లస్ స్కోరు వచ్చేది. కానీ అదే ప్లాన్‌కు స్టిక్ అయి హిట్టింగ్‌కు వెళ్లి రోహిత్ ఔట్ అవ్వడం భారత్ కొంపముంచింది. మరి.. రోహిత్ ఔట్‌పై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: తిరుపతి: ఇండియా ఓటమిని తట్టుకోలేక గుండెపోటుతో ఐటీ ఉద్యోగి మృతి
9 out of 10 times that catch would have been dropped. Lucky for Head & unlucky for rohit sharma that 1 time where the catch gets hold happened to be in the final. pic.twitter.com/Gl3KkMk2RN
— SnEhA KuMaR ReDdY (@snehakumarreddy) November 19, 2023