iDreamPost
android-app
ios-app

ఇంగ్లండ్​తో మ్యాచ్​కు ముందు రోహిత్​కు కొత్త తలనొప్పి.. ఏం చేస్తాడో?

  • Author singhj Published - 08:27 PM, Fri - 27 October 23

టీమిండియా వరుస విజయాలు సాధిస్తుండటంతో కెప్టెన్ రోహిత్ శర్మ ఫుల్ ఖుషీగా ఉన్నాడు. అయితే ఇంగ్లండ్​తో మ్యాచ్​కు ముందు అతడ్ని ఒక సమస్య వేధిస్తోంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

టీమిండియా వరుస విజయాలు సాధిస్తుండటంతో కెప్టెన్ రోహిత్ శర్మ ఫుల్ ఖుషీగా ఉన్నాడు. అయితే ఇంగ్లండ్​తో మ్యాచ్​కు ముందు అతడ్ని ఒక సమస్య వేధిస్తోంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Author singhj Published - 08:27 PM, Fri - 27 October 23
ఇంగ్లండ్​తో మ్యాచ్​కు ముందు రోహిత్​కు కొత్త తలనొప్పి.. ఏం చేస్తాడో?

వన్డే వరల్డ్ కప్​-2023లో కీలక ఫైట్​కు టీమిండియా రెడీ అవుతోంది. ఆడిన ఐదు మ్యాచుల్లోనూ గెలిచి ఊపు మీద ఉన్న రోహిత్ సేన.. ఈ ఆదివారం ఇంగ్లండ్​తో తాడోపేడో తేల్చుకునేందుకు రెడీ అవుతోంది. ఈ మ్యాచ్​లో గెలిస్తే టీమిండియా సెమీస్ బెర్త్ ఖాయం అవుతుంది. వరుస పరాజయాలతో డీలాపడిన ఇంగ్లీష్ టీమ్.. ఈ మ్యాచ్​లో గనుక ఓడితే సెమీస్ రేసు నుంచి నిష్క్రమిస్తుంది. అందుకే ఎలాగైనా భారత్​ను ఓడించాలని ఆ టీమ్ అనుకుంటోంది. బౌలర్లు ఫర్వాలేదనిపిస్తున్నా బ్యాటర్లు దారుణంగా ఫెయిల్ అవుతుండటంతో ఇంగ్లండ్​కు ఏం చేయాలో పాలుపోవడం లేదు. బ్యాటర్లు మళ్లీ ఫామ్​లోకి వస్తేనే టీమిండియాను ఆపడం సాధ్యం అవుతుందని అనుకుంటోంది.

ఇంగ్లండ్​ బౌలర్లలో కూడా ఒకరిద్దరు మాత్రమే రాణిస్తున్నారు. ఒకవైపు ఇంగ్లీష్ టీమ్ పరిస్థితి ఇలా ఉంటే మరోవైపు భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఒక విషయంలో ఇబ్బందులు పడుతున్నాడు. టీమిండియా ఫైనల్ ఎలెవన్​లోకి ఎవర్ని తీసుకోవాలో హిట్​మ్యాన్​కు అర్థం కావడం లేదు. టీమ్​లోకి ఛాన్స్ ఇచ్చిన ప్రతి ప్లేయర్ కూడా అద్భుతంగా ఆడుతున్నాడు. ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యా ఇంజ్యురీ కారణంగా దూరమవ్వడంతో న్యూజిలాండ్​తో మ్యాచ్​లో అతడి ప్లేసులో సూర్యకుమార్ యాదవ్.. శార్దూల్ ఠాకూర్ స్థానంలో మహ్మద్ షమీ టీమ్​లోకి వచ్చారు. ధర్మశాల పిచ్ పేస్​కు అనుకూలిస్తుందని షమీని తీసుకున్నారు. ఆ మ్యాచ్​లో సూర్య రనౌట్ అయినా.. షమి మాత్రం 5 వికెట్లతో బౌలింగ్​లో అదరగొట్టాడు. దీంతో రోహిత్​కు కొత్త తలనొప్పి మొదలైంది.

ఈ వరల్డ్ కప్​లో మహ్మద్ షమీకి పెద్దగా అవకాశాలు రాలేదు. తొలి మ్యాచ్​లో సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్​ను ఆడించారు. ఆ తర్వాత నుంచి ఆ ప్లేస్​లో శార్దూల్​ను ఆడిస్తున్నారు. కానీ న్యూజిలాండ్​ మీద ఛాన్స్ రావడంతో బరిలోకి దిగిన షమి ఐదు వికెట్లతో సత్తా చాటి మ్యాన్ ఆఫ్​ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు. మెగా టోర్నీలో వేసిన తొలి బాల్​కే వికెట్ తీశాడు షమి. డెత్ ఓవర్లలోనూ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి రన్స్ ఆపడమే గాక వికెట్లు తీశాడు. దీంతో అనవసరంగా శార్దూల్​ను ఆడించారని.. ఇప్పటికైనా షమీని కంటిన్యూ చేయాలని నెట్టింట ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

బ్యాటింగ్​కు పనికొస్తాడనుకొని శార్దూల్​ను తీసుకున్నా బ్యాటింగ్, బౌలింగ్​లో అతడు పెద్దగా చేసిందేమీ లేదు. మరోవైపు షమి ఆడిన తొలి మ్యాచులోనే దుమ్మురేపాడు. దీంతో అతడి పెర్ఫార్మెన్స్ కెప్టెన్ రోహిత్​కు తలనొప్పిగా మారింది. షమీని తుది జట్టు నుంచి తీసేయడానికి టీమ్ మేనేజ్​మెంట్ సాహసం చేయలేని పరిస్థితి. పిచ్ స్పిన్​కు అనుకూలిస్తే అశ్విన్​ను తీసుకోవాలి. కానీ షమి పెర్ఫార్మెన్స్ చూశాక అతడి బదులు సిరాజ్​ను పక్కనబెట్టాల్సి ఉంటుంది. దీంతో ఈ సమస్యను రోహిత్ ఎలా పరిష్కరిస్తాడో చూడాలి. మరి.. రోహిత్​కు షమి కొత్త తలనొప్పిగా మారడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఆర్ధిక కష్టాల్లో దిగ్గజ క్రికెటర్‌! తనను ఆదుకోవాలంటూ..