iDreamPost
android-app
ios-app

IND vs NZ: శ్రేయస్ అయ్యర్ సూపర్ క్యాచ్.. బాల్ పట్టాక రియాక్షన్ హైలైట్!

  • Author singhj Published - 04:14 PM, Sun - 22 October 23

టీమిండియాలో బెస్ట్ ఫీల్డర్లలో శ్రేయస్ అయ్యర్ ఒకడు. గ్రౌండ్ ఫీల్డింగ్​తో పాటు క్యాచింగ్​లోనూ అతడు మంచి పేరు తెచ్చుకున్నాడు. మరోమారు ఫీల్డింగ్​లో తన మార్క్ చూపించాడు అయ్యర్.

టీమిండియాలో బెస్ట్ ఫీల్డర్లలో శ్రేయస్ అయ్యర్ ఒకడు. గ్రౌండ్ ఫీల్డింగ్​తో పాటు క్యాచింగ్​లోనూ అతడు మంచి పేరు తెచ్చుకున్నాడు. మరోమారు ఫీల్డింగ్​లో తన మార్క్ చూపించాడు అయ్యర్.

  • Author singhj Published - 04:14 PM, Sun - 22 October 23
IND vs NZ: శ్రేయస్ అయ్యర్ సూపర్ క్యాచ్.. బాల్ పట్టాక రియాక్షన్ హైలైట్!

వన్డే వరల్డ్ కప్-2023లో అత్యంత ఆసక్తిని రేకెత్తించిన భారత్-న్యూజిలాండ్ మ్యాచ్ ఇంట్రెస్టింగ్​గా సాగుతోంది. ఇరు టీమ్స్ పోటాపోటీగా ఆడుతున్నాయి. ఈ మ్యాచ్​లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ సెలెక్ట్ చేసుకున్నాడు. దీంతో కివీస్ బ్యాటింగ్​కు దిగింది. అయితే ఆ టీమ్​ మంచి స్టార్ట్ లభించలేదు. పేస్​కు అనుకూలిస్తున్న పిచ్ మీద జస్​ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ విజృంభించి బౌలింగ్ చేశారు. రన్స్ రాకపోవడంతో ఒత్తిడి పెరిగింది. దీంతో షాట్ కొట్టేందుకు ప్రయత్నించి సిరాజ్ బౌలింగ్​లో శ్రేయస్ అయ్యర్​కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు డెవిన్ కాన్వే. ఆ తర్వాత కొద్దిసేపటికే బాగా ఆడుతున్న మరో ఓపెనర్ విల్ యంగ్​ను వెటరన్ పేసర్ మహ్మద్ షమి క్లీన్ బౌల్డ్ చేశాడు.

ఈ మ్యాచ్​లో శ్రేయస్ అయ్యర్ పట్టిన క్యాచ్ గురించి స్పెషల్​గా చెప్పుకోవాలి. సిరాజ్ బౌలింగ్​లో కాన్వే కొట్టిన షాట్​ను అద్భుతంగా ఒడిసి పట్టుకున్నాడు అయ్యర్. గాలిలో డైవ్ కొడుతూ క్యాచ్​ను అందుకున్నాడు. దీంతో మ్యాచ్​లో భారత్​కు మంచి ఆరంభం లభించింది. కాన్వే క్యాచ్ పట్టాక అయ్యర్ రియాక్షన్ హైలైట్ అనే చెప్పాలి. ఈ వరల్డ్ కప్​లో బెస్ట్ క్యాచ్ పట్టిన భారత ప్లేయర్లకు టీమ్ ఫీల్డింగ్ కోచ్ మెడల్స్ అందిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఆటగాళ్లు క్యాచ్ పట్టుకున్నాక ఆ అవార్డు తమకే ఇవ్వాలంటూ సైగలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కివీస్​తో మ్యాచ్​లో అయ్యర్ కూడా ఇదే విధంగా టీమ్ మేనేజ్​మెంట్​కు హింట్ ఇచ్చాడు.

కాన్వే క్యాచ్ పట్టుకున్న అయ్యర్ మెడల్ తనకే ఇవ్వాలంటే చేతితో సైగ చేస్తూ కనిపించాడు. అయ్యర్‌‌ క్యాచ్​కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్స్.. తప్పకుండా ఈసారి మెడల్ అయ్యర్​కే దక్కాలని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుత భారత జట్టులో అయ్యరే బెస్ట్ ఫీల్డర్ అని అతడి ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా, ప్రస్తుతం 22 ఓవర్లకు 2 వికెట్ల నష్టానికి న్యూజిలాండ్ 107 స్కోరుతో ఉంది. రచిన్ రవీంద్ర (47 నాటౌట్), డారిల్ మిచెల్ (38 నాటౌట్) క్రీజులో ఉన్నారు. మరి.. శ్రేయస్ అయ్యర్ స్టన్నింగ్ క్యాచ్​ మీకెలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: World Cup: కసితో బౌలింగ్ చేస్తున్న షమి.. వేసిన ఫస్ట్ బాల్​కే..!