iDreamPost
android-app
ios-app

మనకే కాదు ఆస్ట్రేలియాకూ ఒక హిట్​మ్యాన్ ఉన్నాడు.. ఫైనల్​లో ఏం చేస్తాడో..?

  • Author singhj Published - 09:54 PM, Fri - 17 November 23

భారత టీమ్​ వరుస విజయాలు సాధించడం, వరల్డ్ కప్ ఫైనల్​కు చేరుకోవడంలో కెప్టెన్ రోహిత్ శర్మ పాత్ర ఎంత ఉందో స్పెషల్​గా చెప్పనక్కర్లేదు. అయితే మనకే కాదు.. ఫైనల్​కు చేరుకున్న ఆసీస్ టీమ్​కూ ఓ హిట్​మ్యాన్ ఉన్నాడు.

భారత టీమ్​ వరుస విజయాలు సాధించడం, వరల్డ్ కప్ ఫైనల్​కు చేరుకోవడంలో కెప్టెన్ రోహిత్ శర్మ పాత్ర ఎంత ఉందో స్పెషల్​గా చెప్పనక్కర్లేదు. అయితే మనకే కాదు.. ఫైనల్​కు చేరుకున్న ఆసీస్ టీమ్​కూ ఓ హిట్​మ్యాన్ ఉన్నాడు.

  • Author singhj Published - 09:54 PM, Fri - 17 November 23
మనకే కాదు ఆస్ట్రేలియాకూ ఒక హిట్​మ్యాన్ ఉన్నాడు.. ఫైనల్​లో ఏం చేస్తాడో..?

వన్డే వరల్డ్ కప్​లో భారత్ వరుస విజయాల్లో కెప్టెన్ రోహిత్ శర్మ రోల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సారథిగా ప్లేయర్లకు అండగా ఉంటూ, కీలక సమయంలో సలహాలు, సూచనలు ఇస్తున్నాడు. టైమ్​కు తగ్గట్లు అవసరమైతే డేరింగ్ డెసిజన్స్ కూడా తీసుకుంటున్నాడు. ఎవరైనా ఆటగాళ్లు ఫెయిలైనా వాళ్లకు సపోర్ట్​గా ఉంటూ, బాగా పెర్ఫార్మ్ చేసేలా ప్రయత్నిస్తున్నాడు హిట్​మ్యాన్. కెప్టెన్​గానే గాక బ్యాటింగ్​లోనూ జట్టును ముందుండి లీగ్ చేస్తున్నాడు రోహిత్. ఈ మెగా టోర్నీలో చెలరేగిపోతున్న ఈ స్టార్ బ్యాటర్.. ఇప్పటిదాకా 10 మ్యాచ్​లు ఆడి 550 రన్స్ చేశాడు.

ఓపెనింగ్​ చేస్తున్న రోహిత్ శర్మ ధనాధన్ ఇన్నింగ్స్​లు ఆడుతూ టీమిండియాకు అదిరిపోయే స్టార్ట్స్ ఇస్తున్నాడు. ప్రెజర్​ను అపోజిషన్ టీమ్​పై పెట్టడంలో సక్సెస్ అవుతున్నాడు. దీంతో తర్వాత వచ్చే బ్యాటర్స్​ స్వేచ్ఛగా బ్యాట్​ను ఝళిపిస్తున్నారు. ఇప్పటి వరకు ఆడుతూ వచ్చినట్లుగానే ఫైనల్​లోనూ ఆస్ట్రేలియాపై రోహిత్ ఇదే తీరులో ఆడితే భారత్​ అకౌంట్​లో మూడో వరల్డ్ కప్ వచ్చి చేరినట్లే. అయితే మనకే కాదు.. ఆసీస్ టీమ్​లోనూ ఒక హిట్​మ్యాన్ ఉన్నాడు. అతడు కూడా రోహిత్​లాగే ఈ ప్రపంచ కప్​లో బ్యాట్​తో రెచ్చిపోతున్నాడు. అవసరమైనప్పుడు వికెట్లు కూడా తీస్తూ టీమ్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు.

ఆసీస్ హిట్​మ్యాన్​ మరెవరో కాదు.. ఓపెనర్ ట్రావిస్ హెడ్. ఇంజ్యురీ తర్వాత స్ట్రాంగ్​గా కమ్​బ్యాక్ ఇచ్చాడీ ప్లేయర్. వరల్డ్ కప్ మధ్యలో టీమ్​తో జాయిన్ అయ్యాడు. లీగ్ దశలో న్యూజిలాండ్​పై ఆడిన తొలి మ్యాచ్​లోనే మెరుపు సెంచరీతో తన విలువ ఏంటో చాటాడు హెడ్. ఆ తర్వాత పలు మ్యాచుల్లో ఫెయిలైనప్పటికీ.. కీలకమైన నాకౌట్ మ్యాచ్​లో మాత్రం ఆల్​రౌండ్ మెరుపులతో జట్టును గెలిపించి ఫైనల్​కు చేర్చాడు. సౌతాఫ్రికాతో సెమీస్​లో 48 బంతుల్లో 62 రన్స్ చేసి టార్గెట్ ఛేజ్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. స్టార్టింగ్​లో హెడ్ వేగంగా ఆడటం వల్లే ఆ తర్వాత వరుసగా వికెట్లు పడ్డా.. కిందా మీద పడి ఆసీస్ ఛేజ్ చేసింది.

పార్ట్ టైమర్ అయిన హెడ్ సెమీస్​లో ఇద్దరు సఫారీ బ్యాటర్లను ఔట్ చేశాడు. మంచి ఊపు మీద ఉన్న హెన్రిచ్ క్లాసెన్ (47)తో పాటు ఆల్​రౌండర్ మార్కో యాన్సెన్ (0)ను వరుస బంతుల్లో పెవిలియన్​కు పంపాడు. వీళ్లిద్దరూ త్వరగా ఔటవ్వడంతో సౌతాఫ్రికా భారీ టార్గెట్ సెట్ చేయలేకపోయింది. గతంలో కంటే ఇప్పుడు మరింత అటాకింగ్ గేమ్ ఆడుతూ ప్రత్యర్థి జట్ల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాడు హెడ్. గత సంవత్సరం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్​షిప్ ఫైనల్లో టీమిండియా ఓటమికి అతనే ప్రధాన కారణం. ఆ మ్యాచ్​లో 169 పరుగుల మెరుపు ఇన్నింగ్స్​తో మ్యాచ్​ను మన టీమ్​కు దూరం చేశాడు. హెడ్ మళ్లీ అదే పెర్ఫార్మెన్స్ రిపీట్ చేస్తాడేమోనని భారత ఫ్యాన్స్ భయపడుతున్నారు. మరి.. ఆసీస్ హిట్​మ్యాన్ పెర్ఫార్మెన్స్​పై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఆ ఒక్క లోటు అధిగమిస్తేనే ఇండియాకి వరల్డ్ కప్! లేకుంటే..!