iDreamPost
android-app
ios-app

ఆ ఒక్క లోటు అధిగమిస్తేనే ఇండియాకి వరల్డ్ కప్! లేకుంటే..!

కోట్లాది మంది భారతీయుల కలలను నిజం చేసేందుకు టీమిండియా అడుగు దూరంలో నిలిచింది. వరల్డ్ కప్ గెలిచేందుకు ఫైనల్ మ్యాచ్ లో అసాధారణ ప్రతిభ చూపాల్సిన అవసరం ఉంది. కానీ జట్టులో ఆ ఒక్క లోటు అధిగమిస్తే ఇండియాకి వరల్డ్ కప్ ఖాయమని క్రికెట్ నిపుణులు భావిస్తున్నారు.

కోట్లాది మంది భారతీయుల కలలను నిజం చేసేందుకు టీమిండియా అడుగు దూరంలో నిలిచింది. వరల్డ్ కప్ గెలిచేందుకు ఫైనల్ మ్యాచ్ లో అసాధారణ ప్రతిభ చూపాల్సిన అవసరం ఉంది. కానీ జట్టులో ఆ ఒక్క లోటు అధిగమిస్తే ఇండియాకి వరల్డ్ కప్ ఖాయమని క్రికెట్ నిపుణులు భావిస్తున్నారు.

ఆ ఒక్క లోటు అధిగమిస్తేనే ఇండియాకి వరల్డ్ కప్! లేకుంటే..!

వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్ సమరానికి సమయం ఆసన్నమైంది. భారత్ కప్పు గెలిచేందుకు అడుగు దూరంలో ఉంది. సెమీఫైనల్స్ లో న్యూజీలాండ్ పై భారీ విజయం నమోదు చేసి ప్రపంచకప్ ఫైనల్ లోకి అడుగుపెట్టింది టీమిండియా. ఆదివారం నాడు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత్ ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియాతో తలపడబోతోంది. ఇప్పటి వరకు జరిగిన అన్ని మ్యాచ్ లలో రోహిత్ సేన అసాధారణ ప్రదర్శన చేస్తూ ప్రత్యర్థి జట్లను మట్టికరింపించింది. అయినా జట్టులో ఓ లోటు కనిపిస్తోంది. ఇదే ఇప్పుడు క్రికెట్ ఫ్యాన్స్ ను కలవరానికి గురిచేస్తోంది. ఆ ఒక్క విషయంలో మెరుగైతే భారత్ కు తిరుగు లేదని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇంతకీ టీమిండియాకు ఉన్నటు వంటి ఆ లోటు ఏంటి? ఏ విషయంలో మెరుగవ్వాల్సిన అవసరం ఉంది? ఆ వివరాలు మీకోసం..

రోహిత్ సేన ప్రపంచకప్ లో అదరగొడుతోంది. ఓటమెరుగని జట్టుగా వరల్డ్ కప్ ఫైనల్స్ లోకి ప్రవేశించింది. బ్యాట్స్ మెన్స్ మెరుపు బ్యాటింగ్ తో ఆకట్టుకుంటున్నారు. టాప్ ఆర్డర్, మిడిలార్డర్ ప్లేయర్స్ లో ఒకరు విఫలమైనా మరొకరు తమ సత్తా చాటుతున్నారు. రోహిత్ శర్మ, గిల్ ధనాదన్ బ్యాటింగ్ తో జట్టుకు శుభారంబాన్ని అందిస్తున్నారు. కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, జడేజా తమ స్థాయికి తగిన ప్రదర్శన చేస్తూ భారీ స్కోరు అందిస్తున్నారు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే బుమ్రా, సిరాజ్, మహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా నిప్పులు చెరిగే బంతులను సందిస్తూ చెలరేగిపోతున్నారు. ప్రత్యర్థి జట్ల బ్యాట్స్ మెన్లకు చెమటలు పట్టేలా బౌలింగ్ చేస్తూ అదరహో అనిపిస్తున్నారు. పేసు గుర్రాలు రేసు గుర్రాలై శాసిస్తున్నారు.

బీకర ఫాంలో ఉన్న షమీ కీలక వికెట్లను పడగొడుతూ జట్టు విజయంలో కీలకంగా మారారు. సెమీఫైనల్స్ లో ఏకంగా ఏడు వికెట్లు పడగొట్టి అరుదైన ఫీట్ ను అందుకున్నారు. అయితే అంతా బాగానే ఉన్నా ఫీల్డింగ్ విషయంలో కొంత మెరుగు పడాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కీలకమైన మ్యాచ్ లో అంది వచ్చిన క్యాచ్ లను జార విడవడం, మిస్ ఫీల్డింగ్ వంటివి చోటుచేసుకుంటున్నాయి. క్యాచెస్ విన్స్ మ్యచెస్ అంటుంటారు. క్యాచ్ ల విషయంలో పొరపాటు చేస్తే భారీ మూల్యం చెల్లించుకునే పరిస్థితి తలెత్తుతుంది. కాబట్టి బ్యాటింగ్, బౌలింగ్ లో మెరుగ్గా ఉన్న టీమిండియా ఫీల్డింగ్ విభాగంలో జరుగుతున్న పొరపాట్లను అదిగమిస్తే రోహిత్ సేనకు తిరుగు లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. అన్ని విభాగాల్లో అద్బుతమైన ప్రదర్శన చేస్తే వరల్డ్ కప్ గెలవడం భారత్ కు పెద్ద కష్టమేమీ కాదని క్రికెట్ నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి