వరల్డ్ కప్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న టీమిండియా ఆఖరి లీగ్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌తో తలపడేందుకు రెడీ అవుతోంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు భారత కెప్టెన్ రోహిత్ శర్మపై నెదర్లాండ్స్ టీమ్ ప్లేయర్లు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
వరల్డ్ కప్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న టీమిండియా ఆఖరి లీగ్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌తో తలపడేందుకు రెడీ అవుతోంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు భారత కెప్టెన్ రోహిత్ శర్మపై నెదర్లాండ్స్ టీమ్ ప్లేయర్లు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
వన్డే వరల్డ్ కప్-2023లో టీమిండియా హవా మామూలుగా లేదు. ఇప్పటివరకు ఆడిన ఎనిమిదికి ఎనిమిది మ్యాచుల్లోనూ విజయం సాధించి ఫుల్ జోష్‌లో ఉంది భారత్. లీగ్ దశలో రోహిత్ సేన ఆడాల్సిన మ్యాచ్ మరొకటి ఉంది. ఈ ఆదివారం నెదర్లాండ్స్‌తో ఆడే మ్యాచే లీగ్ స్టేజీలో భారత్‌కు చివరిది. ఇప్పటికే సెమీఫైనల్‌కు చేరుకున్నందున డచ్ టీమ్‌తో మ్యాచ్ మంచి ప్రాక్టీస్ అనే చెప్పాలి. ఫుల్ ఫామ్‌లో ఉన్న బ్యాటర్లు, బౌలర్లు.. నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌ను ప్రాక్టీస్‌గా ఉపయోగించుకోవాలని చూస్తున్నారు. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే భారీ స్కోరు చేయాలని.. ఛేజింగ్‌లో అయితే టార్గెట్‌ను త్వరగా ఫినిష్ చేయాలని చూస్తున్నారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా ప్రయోగాలు చేసే ఛాన్స్ కూడా ఉంది.
నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా, విరాట్ కోహ్లీ లాంటి కీలక ప్లేయర్లకు రెస్ట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ వాళ్లకు రెస్ట్ ఇస్తే బెంచ్‌పై ఉన్న మిగతా ఆటగాళ్లకు ఛాన్స్ దొరుకుతుంది. కోహ్లీ, బుమ్రాకు రెస్ట్ ఇస్తే.. వాళ్ల ప్లేసులో ఇషాన్ కిషన్, శార్దూల్ ఠాకూర్ టీమ్‌లోకి రావొచ్చు. కానీ కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ తీరును చూస్తుంటే విశ్రాంతిని ఇచ్చే ఉద్దేశంతో ఎవర్నీ పక్కన పెట్టేలా కనిపించడం లేదు. బౌలర్లు మంచి రిథమ్‌తో బౌలింగ్ చేస్తుండటం, బ్యాటర్లు ఫుల్ స్వింగ్‌లో ఉండటంతో ఇదే ఫామ్‌ను కంటిన్యూ చేసే అవకాశాలు ఉన్నాయి. సౌతాఫ్రికాతో మ్యాచ్ తర్వాత ఎలాగూ వారం రెస్ట్ దొరికింది.
లీగ్ దశలో ఆడిన చాలా మ్యాచుల్లో భారత బౌలర్లు పూర్తి ఓవర్లు వేయలేదు. ప్రత్యర్థులను తక్కువ స్కోర్లకే కట్టడి చేశారు. కాబట్టి విశ్రాంతి అవసరం లేదని ద్రవిడ్-రోహిత్ భావిస్తున్నారట. గత మ్యాచ్‌లో ఆడిన టీమ్ కాంబినేషన్నే భారత్ మళ్లీ రిపీట్ చేసే సూచనలు కనిపిస్తున్నాయి. నాకౌట్ మ్యాచ్‌కు ముందు అందరూ తమ ఫామ్‌ను కంటిన్యూ చేయాలన్నా, తప్పొప్పులను సరిదిద్దుకోవాలన్నా డచ్ టీమ్‌తో మ్యాచ్ కీలకమని భారత టీమ్ మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. డచ్ టీమ్‌తో మ్యాచ్‌ను పూర్తిగా సద్వినియోగం చేసుకొని.. సెమీస్ ఫైట్‌కు రెడీగా ఉన్నట్లు ప్రత్యర్థులకు వార్నింగ్ ఇవ్వాలనుకుంటోంది భారత్.
ఇక, మెగా టోర్నీలో సెమీస్‌కు చేరుకోకపోయినా తమ ఆటతీరుతో అందరి మనుసులు గెలుచుకుంది నెదర్లాండ్స్. సౌతాఫ్రికా, బంగ్లాదేశ్‌కు షాకిచ్చి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. భారత్‌తో మ్యాచ్‌లోనూ గట్టి పోటీ ఇవ్వాలని అనుకుంటోంది. ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పై డచ్ క్రికెటర్స్ కీలక కామెంట్ చేశారు. హిట్‌మ్యాన్‌లా బాల్‌ను పర్ఫెక్ట్ టైమింగ్‌తో కొట్టే ప్లేయర్ ఇంకొకడు లేడని నెదర్లాండ్స్ ఆటగాడు బాస్ డీ లీడ్ మెచ్చుకున్నాడు. రోహిత్ నమ్మశక్యం కాని క్రికెటర్ అని.. అతడో గ్రేట్ లీడర్ అంటూ మ్యాక్స్ డౌడ్ ప్రశంసించాడు. క్రికెట్లో బెస్ట్ ఓపెనర్లలో భారత కెప్టెన్ ఒకడని విక్రమ్‌జిత్ సింగ్ పొగడ్తల్లో ముంచెత్తాడు. మరి.. రోహిత్‌పై డచ్ టీమ్ ప్లేయర్స్ చేసిన వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: శ్రీలంక క్రికెట్‌కు భారీ షాక్.. ఇకపై ఆ టోర్నీల్లో ఆడకుండా బ్యాన్.. కారణం ఇదే..!
Netherlands players on Rohit Sharma:
Bas De Leede – no one times the ball better than Rohit.
Max O’Dowd – Rohit is an unbelievable player and a great leader.
Vikramjit Singh – one of the best openers of the game. pic.twitter.com/sY6ZRdEodT— Mufaddal Vohra (@mufaddal_vohra) November 10, 2023