iDreamPost
android-app
ios-app

సెమీస్​కు ముందు షాకింగ్‌ కామెంట్స్‌ చేసిన కేన్‌ మామ!

  • Author singhj Published - 06:06 PM, Tue - 14 November 23

టీమిండియాతో నాకౌట్ మ్యాచ్​కు ముందు న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. మెగా టోర్నీలో భారత్ బాగా ఆడుతోందని అంటూనే ఇన్​డైరెక్ట్​గా వార్నింగ్ ఇచ్చాడు కేన్ మామ.

టీమిండియాతో నాకౌట్ మ్యాచ్​కు ముందు న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. మెగా టోర్నీలో భారత్ బాగా ఆడుతోందని అంటూనే ఇన్​డైరెక్ట్​గా వార్నింగ్ ఇచ్చాడు కేన్ మామ.

  • Author singhj Published - 06:06 PM, Tue - 14 November 23
సెమీస్​కు ముందు షాకింగ్‌ కామెంట్స్‌ చేసిన కేన్‌ మామ!

గత కొన్ని వారాలుగా క్రికెట్ లవర్స్​ను ఎంతగానో అలరిస్తున్న వన్డే వరల్డ్ కప్-2023 ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. లీగ్ దశలోని మ్యాచులు కంప్లీట్ అవ్వడంతో ఇప్పుడు అందరి కాన్​సంట్రేషన్ సెమీస్ మీద పడింది. లీగ్ స్టేజ్​లో అద్భుత విజయాలు సాధించిన భారత్​తో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌతాఫ్రికాలు నాకౌట్ బరిలో నిలిచాయి. ఇందులో టీమిండియా-న్యూజిలాండ్, ఆస్ట్రేలియా-సౌతాఫ్రికాకు మధ్య సెమీస్ పోరు జరగనుంది. నాకౌట్ ఫైట్​లో గెలిచిన టీమ్ ఫైనల్​కు చేరుకొని కప్ కోసం ఆడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో సెమీస్ బరిలో నిలిచిన అన్ని జట్లు తమ అపోజిషన్ టీమ్స్​ను ఓడించడంపై ఫోకస్ పెడుతున్నాయి. ఎలాగైనా నాకౌట్ ఫైట్​లో నెగ్గి ఫైనల్స్​లోకి దూసుకెళ్లాలని చూస్తున్నాయి.

ఈసారి సెమీస్ చేరుకున్న జట్లలో ఒక్కొక్కరి జర్నీలా ఒక్కోలా సాగింది. ఆస్ట్రేలియాతో మ్యాచ్​తో ట్రోఫీ వేటను మొదలుపెట్టిన రోహిత్ సేన.. నెదర్లాండ్స్​తో మ్యాచ్ వరకు అదిరిపోయే ఆటతో అందర్నీ ఆకట్టుకుంది. మెగా టోర్నీ మన టీమ్ పెత్తనం మామూలుగా లేదు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆడిన తొమ్మిది మ్యాచుల్లో 99 యావరేజ్​తో 594 రన్స్ చేసి టోర్నీలో హయ్యెస్ట్ రన్ స్కోరర్​గా కంటిన్యూ అవుతున్నాడు. రోహిత్ శర్మ (503 రన్స్) బ్యాటింగ్​లో రఫ్ఫాడిస్తున్నాడు. అలాగే అతను కెప్టెన్సీలోనూ తన మార్క్ చూపిస్తున్నాడు. శ్రేయస్ అయ్యర్ (421), కేఎల్ రాహుల్ (347), శుబ్​మన్ గిల్ (270) కూడా పీక్ ఫామ్​లో ఉన్నారు. పేస్ బౌలింగ్ త్రయం బుమ్రా (17 వికెట్లు), షమి (16), సిరాజ్ (12) ప్రత్యర్థి బ్యాటర్లను వణికిస్తున్నారు. బుమ్రా, షమి, సిరాజ్​తో పాటు స్పిన్నర్లు జడేజా (16 వికెట్లు), కుల్​దీప్ (14) కూడా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు.

టోర్నీ మొదలవ్వడానికి ముందు వరకు ఎలాంటి ఎక్స్​పెక్టేషన్స్ లేని సౌతాఫ్రికా తమ గేమ్​తో అందరి మనుసులు దోచుకుంటోంది. ఆడిన తొమ్మిది మ్యాచుల్లో 7 విజయాలతో లీగ్ దశను ముగించింది. సెమీస్​లో ఆస్ట్రేలియాను ఓడించాలని ఆ టీమ్ కంకణం కట్టుకుంది. అయితే కంగారూ జట్టు భీకర ఫామ్​లో ఉంది. వరుసగా ఏడు విజయాలతో సెమీస్​లోకి అడుగుపెట్టింది ఆసీస్. మరోవైపు న్యూజిలాండ్ టీమ్ టోర్నీ స్టార్టింగ్​లో వరుస విజయాలు సాధించి మంచి ఊపులో కనిపించింది. కానీ భారత్​తో మ్యాచ్ తర్వాత రిథమ్ కోల్పోయిన కివీస్.. వరుసగా మ్యాచుల్లో ఓడిపోయింది. ఆఖరికి శ్రీలంకపై భారీ తేడాతో నెగ్గి రన్​రేట్ మెరుగుపర్చుకొని నాలుగో టీమ్​గా సెమీస్​కు క్వాలిఫై అయింది. న్యూజిలాండ్ సెమీస్​కు చేరడం వెనుక రచిన్ రవీంద్ర (565), డారిల్ మిచెల్ (418), డెవిన్ కాన్వే (359)ల కాంట్రిబ్యూషన్ చాలా ఉంది.

న్యూజిలాండ్ విజయాల్లో స్పిన్నర్ మిచెల్ శాంట్నర్ (16 వికెట్లు), ట్రెంట్ బౌల్ట్ (13 వికెట్లు) రోల్ కూడా చాలా ఉంది. అయితే సూపర్ ఫామ్​లో టీమిండియాను నాకౌట్ మ్యాచ్​లో ఎదుర్కోవడం ఆ జట్టుకు అంత ఈజీ కాదు. భారత్​తో సెమీస్​కు ముందు న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ‘ఇండియా బాగా ఆడుతోంది. కానీ ఆ రోజు ఎలా ఆడామన్నదే కీలకం. ఈ టోర్నమెంట్​లో ప్రతి మ్యాచ్​ చాలా ట్రికీ అనే చెప్పాలి. ఏ జట్టు ఎవర్నయినా ఓడించొచ్చు’ అని కేన్ మామ చెప్పుకొచ్చాడు. కేన్ మామ కామెంట్స్​పై నెటిజన్స్ ఒక్కోలా స్పందిస్తున్నారు. ఇన్​డైరెక్ట్​గా తమను తక్కువ అంచనా వేయొద్దని విలియమ్సన్ భారత్​కు వార్నింగ్ ఇచ్చాడని అంటున్నారు. మరి.. విలియమ్సన్ వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: సెమీస్ అంటే భయపడాల్సింది టీమిండియా కాదు న్యూజిలాండ్.. ఎందుకంటే..?