iDreamPost

సెమీస్ అంటే భయపడాల్సింది టీమిండియా కాదు న్యూజిలాండ్.. ఎందుకంటే..?

  • Author singhj Published - 04:57 PM, Tue - 14 November 23

న్యూజిలాండ్​తో వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్ అనగానే భారత ఫ్యాన్స్ తెగ టెన్షన్ పడుతున్నారు. అయితే ఈసారి భయపడాల్సింది భారత్ కాదు.. కివీస్ అనే చెప్పాలి.

న్యూజిలాండ్​తో వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్ అనగానే భారత ఫ్యాన్స్ తెగ టెన్షన్ పడుతున్నారు. అయితే ఈసారి భయపడాల్సింది భారత్ కాదు.. కివీస్ అనే చెప్పాలి.

  • Author singhj Published - 04:57 PM, Tue - 14 November 23
సెమీస్ అంటే భయపడాల్సింది టీమిండియా కాదు న్యూజిలాండ్.. ఎందుకంటే..?

వన్డే వరల్డ్ కప్-2023లో ఓటమనేదే లేకుండా సెమీఫైనల్​కు చేరుకుంది టీమిండియా. ఎదురొచ్చిన ప్రతి ప్రత్యర్థిని చిత్తు చిత్తుగా ఓడిస్తూ నాకౌట్ పోరుకు దర్జాగా దూసుకొచ్చిన భారత్.. సెమీస్​లో న్యూజిలాండ్​తో తాడోపేడో తేల్చుకునేందుకు రెడీ అవుతోంది. వరుస విజయాలతో ఉన్న రోహిత్ సేనను నాకౌట్ పోరులో ఓడించాలని కివీస్ అనుకుంటోంది. ఆ టీమ్ మొదట్లో వరుసగా నాలుగు గెలుపులతో డేంజరస్​గా కనిపించినా.. ఆ తర్వాత వరుస పరాజయాలతో డీలా పడిపోయింది. అయితే ఆఖర్లో తేరుకొని ఎలాగోలా సెమీస్​కు క్వాలిఫై అయింది. అయితే న్యూజిలాండ్​తో సెమీఫైనల్ అనగానే టీమిండియా ఫ్యాన్స్ భయపడిపోతున్నారు.

అమ్మో.. మళ్లీ కేన్ మామ టీమ్​తో​ సెమీస్ మ్యాచా అని భారత అభిమానులు టెన్షన్ పడుతున్నారు. మళ్లీ గత వరల్డ్ కప్​లోలాగే రిజల్ట్ వస్తుందేమో అని గాభరా పడిపోతున్నారు. 2019 వరల్డ్ కప్ సెమీస్ ఫైట్​లో కివీస్ చేతుల్లో భారత్ ఓడిన విషయం తెలిసిందే. గెలుపు ఖాయం అనుకున్న మ్యాచ్​లో ఆఖరి క్షణాల్లో తడబడి విక్టరీని దూరం చేసుకుంది. లెజెండ్ ఎంఎస్ ధోని గనుక రనౌట్ కాకపోయి ఉంటే ఆ మ్యాచ్​లో ఫలితం వేరేలా ఉండేది. కానీ బ్యాడ్ లక్ కొద్దీ మాహీ ఔటవ్వడంతో ఫైనల్​కు చేరకుండానే ఆ టోర్నీలో జర్నీని ముగించింది టీమిండియా. ఇప్పుడు ఇదే విషయాన్ని గుర్తు చేసుకొని భారత ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.

సెమీస్ అంటే భయపడాల్సింది రోహిత్ సేన కాదు.. విలియమ్సన్ టీమే. దీనికి కొన్ని కారణాలను ఎగ్జాంపుల్​గా చెప్పొచ్చు. ఈ వరల్డ్ కప్​లో న్యూజిలాండ్ బ్యాటింగ్ అంత గొప్పగా లేదు. భారత సంతతికి చెందిన రచిన్ రవీంద్ర ఒక్కడే సూపర్ ఫామ్​లో ఉన్నాడు. లీగ్ మ్యాచ్​లో టీమిండియాపై సెంచరీ బాదిన డారిల్ మిచెల్ కూడా బాగానే ఆడుతున్నాడు. రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్​ను పక్కన పెడితే మిగతా కివీస్ బ్యాటర్లలో ఎవరూ కన్​సిస్టెంట్​గా రన్స్ చేయడం లేదు. కెప్టెన్ కేన్ విలియమ్సన్ రూపంలో మరో డేంజరస్ బ్యాట్స్​మన్ ఆ టీమ్​లో ఉన్నాడు. కానీ మ్యాచ్​ను ఆఖరి వరకు తీసుకెళ్లి అవసరమైతే హార్డ్ హిట్టింగ్​కు దిగే క్యాపబిలిటీస్​ కేన్ మామకు తక్కువే. గాయం ఎక్కడ తిరగబెడుతుందోనని అతడు భయపడుతున్నాడు.

న్యూజిలాండ్​ జట్టు బౌలర్లలో కూడా మిచెల్ శాంట్నర్ ఒక్కడే మంచి ఫామ్​లో ఉన్నాడు. ఈ టోర్నీలో టాప్-10 బౌలర్ల లిస్టులో కివీస్ నుంచి శాంట్నర్ (16 వికెట్లు) ఒక్కడే ఉన్నాడు. దీన్ని బట్టే ఆ టీమ్ బౌలింగ్ యూనిట్ సరిగ్గా పెర్ఫార్మ్ చేయడం లేదని అర్థమైపోతుంది. ఈ వరల్డ్ కప్​లో టాప్-5లో నిలిచిన టీమ్స్​లో ఒక్క దాని మీద కూడా న్యూజిలాండ్ నెగ్గలేదు. శ్రీలంక, ఆఫ్ఘానిస్థాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, నెదర్లాండ్స్​ మీద గెలిచి సెమీస్​కు రీచ్ అయింది కివీస్. సెమీఫైనల్​కు వచ్చిన ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇండియాతో పాటు టాప్-5లో నిలిచిన పాకిస్థాన్ చేతుల్లో ఆ టీమ్ ఓటమి పాలైంది. ఈ వరల్డ్ కప్​లో ఒక దశలో వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓడిపోయిన న్యూజిలాండ్ టీమ్ పెర్ఫార్మెన్స్ ఏమంత గొప్పగా లేదు.

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్​షిప్​ను పక్కనబెడితే కివీస్ ఇప్పటిదాకా ఒక్క ప్రపంచ కప్ కూడా నెగ్గలేదు. ఆ టీమ్ సెమీస్ రికార్డు చెత్తగా ఉంది. 2015కి ముందు న్యూజిలాండ్ ఏడుసార్లు సెమీస్​కు వస్తే.. ఆ 7 సార్లూ ఓడిపోయింది. ఇక, ఈ వరల్డ్ కప్​లో భారత టీమ్ సూపర్ ఫామ్​లో ఉంది. బౌలర్లు, బ్యాటర్లు అద్భుతమైన ఫామ్​ను కంటిన్యూ చేస్తున్నారు. అందుకే ఇన్ని సమస్యల మధ్య సూపర్ టచ్​లో ఉన్న టీమిండియాను.. వాళ్ల సొంతగడ్డపై ఎదుర్కొనేందుకు న్యూజిలాండ్ భయపడుతోంది. ఆల్రెడీ ఈ టోర్నీ లీగ్ స్టేజ్​లో భారత్ చేతిలో ఓడిపోవడంతో తీవ్ర ఒత్తిడి మధ్య నాకౌట్ మ్యాచ్​లో రోహిత్ సేనతో ఆడాలంటే ఆ టీమ్ వణుకుతోంది. మరి.. సెమీస్​ అంటే భారతే కాదు కివీస్ కూడా భయపడటంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: రేపే సెమీస్..! గంగూలీ ఆదర్శంగా బరిలోకి కోహ్లీ, రోహిత్!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి