iDreamPost
android-app
ios-app

2003 వరల్డ్ కప్ ఫైనల్.. 100 కోట్ల మందికి 20 ఏళ్లుగా తీరని పగ అది!

  • Author singhj Updated - 11:28 AM, Sat - 18 November 23

2003 వరల్డ్ కప్ ఫైనల్​ను ఇండియన్ క్రికెట్ లవర్స్ అంత ఈజీగా మర్చిపోలేరు. దానికి పగ తీర్చుకునేందుకు ఇన్నాళ్లకు మనకు ఛాన్స్ వచ్చింది.

2003 వరల్డ్ కప్ ఫైనల్​ను ఇండియన్ క్రికెట్ లవర్స్ అంత ఈజీగా మర్చిపోలేరు. దానికి పగ తీర్చుకునేందుకు ఇన్నాళ్లకు మనకు ఛాన్స్ వచ్చింది.

  • Author singhj Updated - 11:28 AM, Sat - 18 November 23
2003 వరల్డ్ కప్ ఫైనల్.. 100 కోట్ల మందికి 20 ఏళ్లుగా తీరని పగ అది!

వన్డే వరల్డ్ కప్-2023 లాస్ట్ స్టేజ్​కు చేరుకుంది. గత ఆరు వారాలుగా క్రికెట్ ప్రేమికులను ఎంతగానో అలరించిన మెగా టోర్నీలో ఇంకా ఒక్క మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. ప్రపంచ కప్ టైటిల్ కోసం టీమిండియా, ఆస్ట్రేలియా జట్లు ఆదివారం తాడోపేడో తేల్చుకోనున్నాయి. ఫస్ట్ సెమీఫైనల్​లో న్యూజిలాండ్​ను 70 రన్స్ తేడాతో చిత్తు చేసి ఫైనల్​కు చేరుకుంది భారత్. సెకండ్ సెమీస్​లో సౌతాఫ్రికాపై 3 వికెట్ల తేడాతో నెగ్గి ఫైనల్ ఫైట్​కు చేరుకుంది ఆసీస్. ఈ రెండు టీమ్స్ ఇప్పటికే పలుమార్లు వరల్డ్ కప్ ట్రోఫీని ముద్దాడిన నేపథ్యంలో ఈసారి కొత్త ఛాంపియన్​ను చూసే ఛాన్స్ లేదు. ఈ రెండు జట్లలో ఎవరో ఒకరు విజేతగా నిలుస్తారు.

సరిగ్గా 20 ఏళ్ల తర్వాత భారత్-ఆస్ట్రేలియాలు వరల్డ్ కప్ ఫైనల్​లో తలపడనున్నాయి. అయితే కంగారూ టీమ్​తో ఫైనల్ అనగానే ఇండియా ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. 2003 ప్రపంచ కప్​ ఫైనల్ సీన్ రిపీట్ అవుతుందేమోనని భయపడుతున్నారు. అసలు ఆ మెగా టోర్నీలో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. అది 2003 వరల్డ్ కప్. పెద్దగా ఎక్స్​పెక్టేషన్స్ లేకుండానే టోర్నమెంట్​లో అడుగు పెట్టింది భారత్. అయితే ఒక్కో మ్యాచ్​ను టార్గెట్​గా పెట్టుకొని ప్లాన్ ప్రకారం ఆడుతూ గెలుస్తూ వెళ్లింది. సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, జవగళ్ శ్రీనాథ్ లాంటి సీనియర్ల సహకారంతో టీమ్​ను చక్కగా నడిపించాడు కెప్టెన్ సౌరవ్ గంగూలీ. సీనియర్లను కలుపుకుపోతూనే యువరాజ్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, మహ్మద్ కైఫ్​, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్ లాంటి జూనియర్లకు అండగా నిలిచాడు. వాళ్ల దగ్గర నుంచి మంచి పెర్ఫార్మెన్స్​ను రాబట్టుకున్నాడు.

2003 వరల్డ్ కప్​లో ఒక్కో మ్యాచ్​ను ప్లాన్ ప్రకారం ఆడుతూ గెలిపించాడు దాదా. తనకు అందుబాటులో ఉన్న వనరులతోనే టాప్ క్లాస్ టీమ్స్​ను మట్టికరిపించి జట్టును ఫైనల్స్​కు చేర్చాడు. అయితే తుది పోరులో ఆస్ట్రేలియాతో తలపడింది భారత్. డేంజరస్ టీమ్ అయిన కంగారూలతో ఫైట్, అందులోనూ వరల్డ్ కప్ ఫైనల్ అనే ప్రెజర్ జట్టుతో పాటు కెప్టెన్ గంగూలీలోనూ స్పష్టంగా కనిపించింది. ఒత్తిడిని అతడు సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయాడు. దీంతో అది కాస్తా ప్లేయర్ల మీద కూడా ప్రభావం చూపడంతో వాళ్లు తమ బెస్ట్ ఇవ్వలేకపోయారు. దీనికి తోడు ఆ మ్యాచ్​లో ఉరుము వచ్చి మీద పడ్డట్లు ఆసీస్ కెప్టెన్ రికీ పాంటింగ్ భారత్​పై పడ్డాడు.

ఒక బ్యాటర్ ఇలా కూడా ఆడొచ్చని, ఇంత విధ్వంసకరంగా బ్యాటింగ్ చేయొచ్చని అప్పటిదాకా ఎవరికీ తెలియదు. పాంటింగ్ విధ్వంసక ఇన్నింగ్స్​ను ఎవ్వరూ ఎక్స్​పెక్ట్ చేయలేదు. తుఫాన్​లా వచ్చి భారత్​ను ముంచేశాడు పంటర్. ఈ మ్యాచ్​లో 121 బంతుల్లో 140 రన్స్ చేశాడతను. పాంటింగ్ ఇన్నింగ్స్​లో 8 సిక్సర్లు ఉన్నాయి. దీన్ని బట్టే అతడి బ్యాటింగ్ ఏ విధంగా సాగింది, టీమిండియా ఫ్యాన్స్ ఆశల్ని ఎలా ముంచేసిందో అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ ఆ వరల్డ్ కప్ గనుక భారత్ నెగ్గి ఉంటే సచిన్, గంగూలీ, ద్రవిడ్​పై ప్రేక్షకులు, అభిమానుల్లో అడ్మిరేషన్ మరింత పెరిగేది. కానీ బ్యాడ్ లక్ ఆ ఏడాది కప్​ను మిస్సయ్యాం. అయితే ఆస్ట్రేలియాతో మళ్లీ వరల్డ్ కప్ ఫైనల్ ఆడే ఛాన్స్ రాలేదు. 2011లో కంగారూ టీమ్​తో క్వార్టర్ ఫైనల్​లో తలపడే అవకాశం వచ్చింది. ఆ మ్యాచ్​లో ఆసీస్​ను భారత్ చిత్తు చేసింది.

ఇన్నాళ్లుకు ఫైనల్ మ్యాచ్​లో ఆస్ట్రేలియాను ఓడించే అవకాశం భారత్​కు వచ్చింది. దీంతో 2003 ఫైనల్​ను ఇండియన్ ఫ్యాన్స్ తలచుకుంటున్నారు. ఆ రోజు తాము పడిన బాధను రీకాల్ చేసుకుంటున్నారు. ఎలాగైనా ఆసీస్​ను ఓడించాలని కోరుకుంటున్నారు. అప్పుడు గంగూలీలాగే ఈ ఏడాది వరల్డ్ కప్​లో రోహిత్ శర్మ టీమ్​ను బిల్డ్ చేసుకుంటూ వచ్చాడు. అనుకున్న ప్లాన్స్​ను ఎగ్జిక్యూట్ చేస్తూ లీగ్ స్టేజ్​లో వరుసగా తొమ్మిది విజయాలు దక్కేలా చేశాడు. రికార్డులు భయపెట్టిన నాకౌట్ మ్యాచ్​లో న్యూజిలాండ్​ను చిత్తుగా ఓడించడంలో కీలక పాత్ర పోషించాడు. జట్టు ప్రెజర్​ను తాను తీసుకొని బ్యాటింగ్​లో ధనాధన్ ఇన్నింగ్స్​లు ఆడుతూ మంచి స్టార్ట్స్ ఇస్తున్నాడు.

రోహిత్ శర్మ ఓపెనింగ్​లో సెట్ చేసిన టెంపోను ఇతర బ్యాటర్లు ఫాలో అవుతున్నారు. అయితే ఇప్పుడు ఆడబోయేది ఫైనల్ మ్యాచ్. అందులోనూ ఎదురుగా ఉన్నది డేంజరస్ ఆసీస్ టీమ్​. 2003 వరల్డ్ కప్ ఫైనల్​లో గంగూలీ ప్రెజర్​ను తట్టుకోలేకపోయాడు. కానీ ఈసారి అలా కాకూడదు. రోహిత్ శర్మ చేతిలోనే అంతా ఉంది. ఈ వరల్డ్ కప్ మొత్తం తానే ఒత్తిడి తీసుకొని ప్లేయర్లను స్వేచ్ఛగా ఉంచాడు. ఫైనల్లో కూడా అలాగే చేసి టెన్షన్ అపోజిషన్ టీమ్ మీద పడేలా చేయాలి. ఎలాంటి ఛాన్స్ ఇవ్వకుండా కంగారూలను మట్టికరిపించాలి. అప్పుడే 100 కోట్ల మంది అనుభవించిన 20 ఏళ్ల పగ తీరుతుంది. మరి.. ఇండో-ఆసీస్ ఫైనల్ ఫైట్​ కోసం మీరెంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఆస్ట్రేలియా చేతిలో ఓటమి.. సౌత్ ఆఫ్రికా చేసిన తప్పులు ఇవే!