iDreamPost
android-app
ios-app

ఆసీస్​ను పట్టుకున్న భయం.. ఆ సెంటిమెంట్ రిపీటైతే వరల్డ్ కప్ టీమిండియాదే!

  • Author singhj Published - 08:47 PM, Fri - 17 November 23

వరల్డ్ కప్ ఫైనల్​కు ముందు ఆస్ట్రేలియా టీమ్​ను ఓ భయం పట్టుకుంది. ఒక సెంటిమెంట్ రిపీటైతే భారత్​దే కప్పు అని ఆ జట్టు అనుకుంటోంది.

వరల్డ్ కప్ ఫైనల్​కు ముందు ఆస్ట్రేలియా టీమ్​ను ఓ భయం పట్టుకుంది. ఒక సెంటిమెంట్ రిపీటైతే భారత్​దే కప్పు అని ఆ జట్టు అనుకుంటోంది.

  • Author singhj Published - 08:47 PM, Fri - 17 November 23
ఆసీస్​ను పట్టుకున్న భయం.. ఆ సెంటిమెంట్ రిపీటైతే వరల్డ్ కప్ టీమిండియాదే!

వన్డే వరల్డ్ కప్-2023 ఫైనల్ మ్యాచ్​ కోసం క్రికెట్ లవర్స్, ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగే ఫైనల్ ఫైట్ మామూలుగా ఉండబోదు. ఎందుకంటే రెండు టీమ్స్ సూపర్ ఫామ్​లో ఉన్నాయి. వీటిల్లో ఒక టీమ్ లీగ్ స్టేజ్​లో ఆడిన అన్ని మ్యాచుల్లోనూ గెలిచి, సెమీస్​లో న్యూజిలాండ్​నూ చిత్తు చేసింది. మరో జట్టు మొదట్లో ఓటములతో తడబడినా, వెంటనే తేరుకొని చెలరేగి ఆడుతూ నాకౌట్ మ్యాచ్​లో సౌతాఫ్రికాను మట్టికరిపించింది. వరల్డ్ కప్​ ఫైనల్​కు చేరుకునే క్రమంలో భారత్, ఆసీస్​లు అద్భుతమైన ఆటతీరుతో అందర్నీ అలరించాయి. మెగా టోర్నీని ఫేవరెట్స్​గా స్టార్ట్ చేసిన ఈ టీమ్స్.. మ్యాచ్​ మ్యాచ్​కూ మరింత ఇంప్రూవ్ అవుతూ హాట్ ఫేవరెట్స్​గా నిలిచాయి. 2003 వరల్డ్ కప్ ఫైనల్​ ఓటమికి బదులు తీర్చుకోవాలని టీమిండియా భావిస్తోంది. 2011 క్వార్టర్ ఫైనల్ ఓటమికి రివేంజ్ తీర్చుకోవాలని కంగారూ టీమ్ అనుకుంటోంది.

ఈ వరల్డ్ కప్​లో ఇన్ని మ్యాచ్​లు పక్కా ప్లాన్ ఆడుతూ ప్రకారం గెలుస్తూ వచ్చిన టీమిండియా.. ఫైనల్​లో ఆసీస్​ను చిత్తు చేసి ముచ్చటగా మూడోమారు వరల్డ్ కప్​ను కైవసం చేసుకోవాలని కోరుకుంటోంది. నాకౌట్ మ్యాచ్​లో సౌతాఫ్రికాను ఓడించి కాన్ఫిడెన్స్​తో ఉన్న ఆసీస్.. తుది సమరంలో రోహిత్ సేనకు ఝలక్ ఇచ్చి ఆరోసారి వరల్డ్ ఛాంపియన్స్​గా నిలవాలని అనుకుంటోంది. ఇప్పటిదాకా మెగా టోర్నీలో ఎలాంటి పొరపాట్లకు, లోపాలకు ఛాన్స్ ఇవ్వకుండా ఆడుతూ వచ్చిన టీమిండియా.. ఇదే టెంపోను కంటిన్యూ చేస్తే మాత్రం కప్ గెలవడం పెద్ద కష్టం కాదు. ఆల్రెడీ వరల్డ్ కప్ ఫస్ట్ మ్యాచ్​లో ఆస్ట్రేలియాను చిత్తు చేశాం. కాబట్టి అదే నమ్మకంతో సూపర్ ఫామ్​ను కంటిన్యూ చేస్తూ ఆడితే టైటిల్ మనదేనని చెప్పొచ్చు. కొత్తగా ట్రై చేయకుండా ఇప్పటికదాకా టోర్నీలో ఆడిన ఆటనే రిపీట్ చేస్తే సరిపోతుంది.

ఈసారి భారత్ వరల్డ్‌ కప్ గెలుస్తుందని అనడానికి కొన్ని సెంటిమెంట్స్​ను కూడా ఎగ్జాంపుల్​గా చెప్పొచ్చు. అందులో ఒకటే ఈ ఉదాహరణ. 2003 ప్రపంచ కప్​ విన్నరైన ఆస్ట్రేలియా ఆ టోర్నీలో ఫైనల్​కు ముందు ఆడిన పదికి 10 మ్యాచుల్లోనూ గెలిచింది. ఆ మెగా టోర్నీలో రన్నరప్​గా నిలిచిన భారత్.. ఫైనల్​కు ముందు ఆడిన పది మ్యాచుల్లో 8 మ్యాచుల్లో నెగ్గింది. 2023 వరల్డ్ కప్​లో ఫైనల్​కు చేరుకునే క్రమంలో ఆడిన పదికి 10 మ్యాచుల్లోనూ టీమిండియా గెలిచింది. అదే టైమ్​లో ఆసీస్ మాత్రం ఇప్పటిదాకా టోర్నీలో ఆడిన 10 మ్యాచుల్లో ఎనిమిదింట్లోనే నెగ్గింది. 2003లో ఆడిన అన్ని మ్యాచుల్లనూ గెలిచిన ఆసీస్ కప్పును కైవసం చేసుకుంది. కాబట్టి ఈసారి మెగాటోర్నీలో అన్ని మ్యాచుల్లోనూ నెగ్గిన భారత్​దే కప్పు అని ఫ్యాన్స్ అంటున్నారు. ఒకవేళ ఇదే సెంటిమెంట్ రిపీటైతే మాత్రం రోహిత్ సేనను కప్ గెలవకుండా ఎవరూ అడ్డుకోలేరని చెబుతున్నారు. మరి.. ఈ సెంటిమెంట్ రిపీట్ అవుతుందని మీరు భావిస్తే కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: వీడియో: వరల్డ్ కప్ ఫైనల్లో మరో ఆకర్షణ.. రివీల్ చేసిన ఆనంద్ మహీంద్ర!