iDreamPost
android-app
ios-app

వీడియో: క్రికెట్‌ చరిత్రలోనే ఇలాంటి క్యాచ్‌ ఎవరూ చూసి, పట్టి ఉండరు!

ఉత్కంఠరేపే మ్యాచ్ లు, ఆటగాళ్ల అద్భుతమైన ప్రదర్శనలు ఇలా ఎన్నో రికార్డులకు వేదికవుతోంది వన్డే వరల్డ్ కప్. ఇదిలా ఉంటే.. ఓ క్రికెట్ లీగ్ మ్యాచ్ లో వికెట్ కీపర్ అందుకున్న క్యాచ్ నవ్వులు పూయిస్తోంది.

ఉత్కంఠరేపే మ్యాచ్ లు, ఆటగాళ్ల అద్భుతమైన ప్రదర్శనలు ఇలా ఎన్నో రికార్డులకు వేదికవుతోంది వన్డే వరల్డ్ కప్. ఇదిలా ఉంటే.. ఓ క్రికెట్ లీగ్ మ్యాచ్ లో వికెట్ కీపర్ అందుకున్న క్యాచ్ నవ్వులు పూయిస్తోంది.

వీడియో: క్రికెట్‌ చరిత్రలోనే ఇలాంటి క్యాచ్‌ ఎవరూ చూసి, పట్టి ఉండరు!

ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ కు ఉన్న ఆధరణ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మ్యాచ్ జరుగుతుందంటే చాలు క్రికెట్ ఫ్యాన్స్ స్టేడియాలకు క్యూ కడుతుంటారు. టీవీలకు అతుక్కుపోయి మరి మ్యాచ్ ఎంజాయ్ చేస్తుంటారు. ఇప్పుడంతా వరల్డ్ కప్ ఫీవర్ నడుస్తోంది. క్రికెట్ లవర్స్ కి కావాల్సినంత వినోదాన్ని పంచుతోంది. ఉత్కంఠరేపే మ్యాచ్ లు, ఆటగాళ్ల అద్భుతమైన ప్రదర్శనలు ఇలా ఎన్నో రికార్డులకు వేదికవుతోంది వన్డే వరల్డ్ కప్. ఇదిలా ఉంటే.. ఓ క్రికెట్ లీగ్ మ్యాచ్ లో వికెట్ కీపర్ అందుకున్న క్యాచ్ నవ్వులు పూయిస్తోంది. అసలు ఇలా కూడా క్యాచ్ పడతారా అంటూ కామెంట్ చేస్తున్నారు.

సాధారణంగా మ్యాచ్ జరుగుతుంటే ఫీల్డర్స్ సింగిల్ హ్యాండ్ తో క్యాచ్ లు పట్టడం, గాల్లో డైవ్ కొట్టి బంతిని ఒడిసిపట్టడం, బౌండరీ లైన్ వద్ద అసాధారణ రీతిలో డైవ్ చేసి అద్భుతమైన క్యాచ్ లు పట్టడం మనం చూసే ఉంటాము. కానీ ఓ వికెట్ కీపర్ రొటీన్ కు భిన్నంగా క్యాచ్ అందుకున్నాడు. అతడు క్యాచ్ పట్టిన తీరుకు సహచర ఆటగాళ్లతో పాటు నెటిజన్స్ కూడా నవ్వు ఆపుకోలేకపోతున్నారు. ఇది క్రికెట్ మ్యాచ్ లోనే అరుదైన క్యాచ్ అంటూ సరదాగా కామెంట్ చేస్తున్నారు. ఆ వికెట్ కీపర్ డైవ్ చేసి ఒంటిచేత్తో క్యాచ్ అందుకోగా అది కాస్త మిస్ అయి బంతి అతడి వీపుపైకి చేరింది. వెంటనే తేరుకున్న వికెట్ కీపర్ బాల్ కింద పడకుండా చేసిన విన్యాసం నవ్వులు తెప్పిస్తుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది.

దట్స్ సో విలేజ్ ట్విట్టర్ ఖాతా నుండి దీనికి సంబంధించిన పోస్ట్ చేయబడింది. ఇది కేరళలో జరుగిన క్రికెట్ లీగ్ మ్యాచ్ అని తెలుస్తోంది. క్రీజులో ఉన్న బ్యాటర్ బాల్ ను టచ్ చేయగా ఆ బంతి ముందుగా వికెట్ కీపర్ గ్లోవ్స్‌కు తగిలి, అక్కడి నుంచి బంతి బౌన్స్ అయి అతని వీపుపై పడ్డది. వెంటనే వికెట్ కీపర్ తన రెండు చేతులతో వృత్తం చేస్తూ బంతిని ఆపాడు. అనంతరం పరుగెత్తుకొచ్చిన మిగతా ఫీల్డర్లు బంతిని అందుకుని క్యాచ్ ను పూర్తి చేశారు. దీంతో బ్యాట్స్ మెన్ ఔటయ్యాడు. ఇలాంటి క్యాచ్ ఎప్పుడు చూడలేదు ఆల్ టైమ్ గ్రెటెస్ట్ వికెట్ కీపర్ క్యాచ్ అంటూ స్పందిస్తున్నారు. అన్ లక్కీ బ్యాట్స్ మెన్ అంటూ కామెంట్ చేస్తున్నారు.