Somesekhar
రోహిత్ శర్మను ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి తప్పించిన దగ్గర నుంచి వేరే టీమ్ లోకి వెళ్తాడన్న ప్రచారం జరుగుతూ వస్తోంది. కాగా.. రోహిత్ కేకేఆర్ టీమ్ లోకి రావాలని పాకిస్తాన్ దిగ్గజ బౌలర్ వసీం అక్రమ్ సూచించాడు. దానికి కారణం ఏంటంటే?
రోహిత్ శర్మను ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి తప్పించిన దగ్గర నుంచి వేరే టీమ్ లోకి వెళ్తాడన్న ప్రచారం జరుగుతూ వస్తోంది. కాగా.. రోహిత్ కేకేఆర్ టీమ్ లోకి రావాలని పాకిస్తాన్ దిగ్గజ బౌలర్ వసీం అక్రమ్ సూచించాడు. దానికి కారణం ఏంటంటే?
Somesekhar
ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మ ను కెప్టెన్సీ నుంచి తప్పించిన తర్వాత అతడు జట్టును వీడుతాడని ఎన్నో వార్తలు వచ్చాయి. కానీ అవన్నీ అబద్దం అని తేలిపోయాయి. ప్రస్తుతం ముంబైలోనే కొనసాగుతున్నాడు రోహిత్. కానీ వచ్చే సీజన్ కు అంటే 2025 ఐపీఎల్ సీజన్ కు కచ్చితంగా అతడు టీమ్ మారుతాడని చాలా మంది చెప్పుకొస్తున్నాడు. కెప్టెన్సీ నుంచి తొలగించడంతో తీవ్ర మనోవేదనకు గురైయ్యాడు రోహిత్. దాంతో టీమ్ మారాలనుకున్నట్లు న్యూస్ వైరల్ అయ్యింది. తాజాగా మరోసారి రోహిత్ టీమ్ మార్పుపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు పాకిస్తాన్ దిగ్గజ ప్లేయర్ వసీం అక్రమ్. హిట్ మ్యాన్ కేకేఆర్ టీమ్ లోకి వస్తే చూడాలనుందని తన మనసులోని మాటను చెప్పాడు.
ముంబై ఇండియన్స్ కు ఐదు టైటిళ్లు అందించిన రోహిత్ శర్మను కాదని, గుజరాత్ నుంచి వచ్చిన హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అందించింది ముంబై యాజమాన్యం. అయితే తాము చేసింది పెద్ద తప్పని తెలుసుకోవడానికి ముంబై యాజమాన్యానికి ఎంతో టైమ్ పట్టలేదు. ఈ సీజన్ లో దారుణ వైఫల్యంతో ఇంటిదారి పట్టింది ఎంఐ టీమ్. దాంతో రోహిత్ ఫ్యాన్స్ ముంబైపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోహిత్ ను కెప్టెన్ గా తీసివేయడంతోనే ఇలా జరిగిందని మేనేజ్ మెంట్ ను విమర్శిస్తున్నారు. అదీకాక నెక్ట్స్ సీజన్ కు హిట్ మ్యాన్ ముంబై టీమ్ లో ఉండడని బల్లగుద్దిమరీ చెబుతున్నారు ఫ్యాన్స్, నెటిజన్లు.
ఈ క్రమంలోనే ఇదే విషయంపై తన అభిప్రాయాలను పంచుకున్నాడు పాకిస్తాన్ దిగ్గజం వసీం అక్రమ్. “ఐపీఎల్ నెక్ట్స్ సీజన్ లో రోహిత్ శర్మ కేకేఆర్ టీమ్ కు ఆడితే చూడాలని ఉంది. ఓపెనర్ గా రోహిత్ శర్మ, మెంటర్ గా గౌతమ్ గంభీర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ లాంటి కాంబినేషన్ చూడ్డానికి క్రేజీగా ఉంటుంది. ఇలా ఊహించుకుంటేనే కేకేఆర్ బలమైన టీమ్ గా అనిపిస్తోంది” అంటూ చెప్పుకొచ్చాడు వసీం అక్రమ్. అయితే ఒకవేళ రోహిత్ ఏ జట్టులోకి వెళ్లినా.. అది కెప్టెన్ గానే వెళ్తాడని కొందరు చెప్పుకొస్తున్నారు. ఇప్పటికే చాలా టీమ్స్ రోహిత్ కు కెప్టెన్సీ ఇచ్చి.. జట్టులోకి తీసుకోవాలని చూస్తున్నట్లు ఎన్నో వార్తలు కూడా వచ్చాయి. చూడాలి మరి రోహిత్ నెక్ట్స్ ఐపీఎల్ సీజన్ లో ఏ టీమ్ లోకి వెళ్తాడో? లేక ముంబైలోనే ఉంటాడో? మరి రోహిత్ శర్మ ఏ టీమ్ లోకి వెళ్తే చూడాలని ఉంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.