నాకౌట్ మ్యాచ్‌కు ముందు కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్కు కింగ్ కోహ్లీ భయం పట్టుకుంది. దీనికి 15 ఏళ్ల బ్యాక్ స్టోరీ ఉంది.
నాకౌట్ మ్యాచ్‌కు ముందు కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్కు కింగ్ కోహ్లీ భయం పట్టుకుంది. దీనికి 15 ఏళ్ల బ్యాక్ స్టోరీ ఉంది.
విరాట్ కోహ్లీ, కేన్ విలియమ్సన్.. ప్రస్తుత క్రికెట్లో అద్భుతమైన ప్లేయర్ల పేర్లు చెప్పమనగానే ముందుగా గుర్తొచ్చే పేర్లు ఇవే. బ్యాటింగ్ రికార్డుల విషయంలో కోహ్లీకి, కేన్ మామకు కంపారిజన్ లేదు. ఎందుకంటే సెంచరీల మీద సెంచరీలు చేస్తూ, టన్నులు కొద్దీ పరుగులు చేస్తూ జెంటిల్మన్ గేమ్‌లో ఉన్న చాలా రికార్డులను తన పేరు మీద రాసేసుకున్నాడు కింగ్ కోహ్లీ. మైల్‌స్టోన్స్ విషయంలో పోలిక లేకపోయినా ఈ తరంలో గొప్ప ఆటగాళ్లలో కోహ్లీ తర్వాత ఆ లిస్టులో విలియమ్సన్ తప్పక ఉంటాడని చెప్పొచ్చు. బ్యాటింగ్‌లో సెంచరీలు చేయకపోయినా, కెప్టెన్సీ నాక్స్ ఆడతాడు కేన్ మామ. నిలకడగా రన్స్ చేస్తూ టీమ్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తుంటాడు. కోహ్లీలాగే టీమ్ ఎంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా అందులో నుంచి బయటపడేస్తాడు.
విలియమ్సన్ బ్యాటింగ్ స్టైల్ కూడా చూడముచ్చటగా ఉంటుంది. భారీ షాట్లకు బదులు కోహ్లీలాగే సేఫ్ గేమ్‌కు ఇంపార్టెన్స్ ఇస్తాడు కేన్ మామ. స్ట్రయిక్ రొటేట్ చేస్తూ చాప కింద నీరులా చూస్తూ ఉండగానే మంచి స్కోరు చేసేస్తాడు. కెప్టెన్సీలో ఈ కివీస్ స్టార్‌కు వంక పెట్టడానికి లేదు. టీమ్‌లో సూపర్ స్టార్లు లేకపోయినా ఉన్న వనరులను కరెక్ట్‌గా వాడుకుంటూ గత వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్‌ను ఫైనల్స్‌కు చేర్చాడు. తుదిపోరులో టీమ్ ఓడిపోయినా ఆ బాధ బయటకు కనిపించకుండా, ప్లేయర్లను భరోసాగా నిలబడ్డాడు. జట్టుపై ఉండే ప్రెజర్‌ను తానే తీసుకొని.. ఆటగాళ్లను కూల్‌గా ఉంచుతాడు. ఇలా కోహ్లీ, విలియమ్సన్‌లు ఇద్దరూ క్రికెట్‌పై తమదైన ముద్రవేశారు. వీళ్లిద్దరూ సెమీస్ మ్యాచ్‌లో మరోమారు తలపడుతున్నారు.
టీమిండియా, న్యూజిలాండ్ నడుమ జరిగే నాకౌట్ మ్యాచ్‌లో కేన్ విలియమ్సన్, కింగ్ కోహ్లీ మధ్య పోరు కీలకం కానుంది. కోహ్లీపై కేన్ మామకు 15 ఏళ్ల పగ ఉంది. 2008 అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో విలియమ్సన్‌ను విరాటే ఔట్ చేశాడు. నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో వికెట్ తీసి ఉత్సాహంలో ఉన్న కోహ్లీ.. సెమీస్‌లోనూ బౌలింగ్ చేసే ఛాన్స్ కనిపిస్తోంది. దీంతో దానికి ప్రతీకారం తీర్చుకోవాలని కేన్ మామ అనుకుంటున్నాడు. అయితే విలియమ్సన్‌ను మళ్లీ ఔట్ చేసి భారత్‌కు కోహ్లీ బ్రేక్ త్రూ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ బౌలింగ్‌కు దిగుతాడో లేదో తెలియదు గానీ.. ఒకవేళ అతడు బౌలింగ్ వేసి కేన్ మామను ఔట్ చేస్తే మాత్రం మామూలుగా ఉండదు.
ఇక, 2008 అండర్-19 వరల్డ్ కప్‌లో కోహ్లీ కెప్టెన్సీలోని భారత్.. విలియమ్సన్ నేతృత్వంలోని కివీస్‌ను ఓడించింది. 2019లో కేన్ సారథ్యంలోని న్యూజిలాండ్.. విరాట్ కెప్టెన్సీలోని టీమిండియాను ఓడించింది. 2021 డబ్ల్యూటీసీ ఫైనల్లోనూ మరోమారు కేన్ మామ టీమ్ మనల్ని ఓడించింది. ఈ నేపథ్యంలో విలియమ్సన్‌పై పగ తీర్చుకోవాలని కోహ్లీ కూడా బలంగా కోరుకుంటున్నాడు. కివీస్‌ను చిత్తు చేసి తన టీమ్‌ను ఫైనల్‌కు చేర్చాలని భావిస్తున్నాడు. మరి.. కేన్ మామ, కోహ్లీల్లో ఎవరు ఎవరిపై పగ తీర్చుకుంటారని మీరు భావిస్తున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: శ్రీలంక క్రికెట్‌ను జై షా నాశనం చేశాడా? అర్జున రణతుంగ విమర్శల్లో నిజమెంత?
Virat Kohli took the wicket of Kane Williamson in the 2008 U-19 World Cup Semi-Final. pic.twitter.com/puh6rGHhFs
— Johns. (@CricCrazyJohns) November 14, 2023
Virat Kohli vs Kane Williamson#INDvNZ #ODIWorldCup2023 #ICCWorldCup2023 #INDvsNZ pic.twitter.com/L5L6wKAnZK
— RVCJ Media (@RVCJ_FB) November 14, 2023